కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 6/1 పేజీలు 21-26
  • “సువార్తను గూర్చి సిగ్గుపడకుండుట”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సువార్తను గూర్చి సిగ్గుపడకుండుట”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సువార్త ప్రపంచవ్యాప్తముగా ప్రకటింపబడుచున్నది
  • ప్రకటించబడగల శ్రేష్టమైన సువార్త
  • యేసు క్రీస్తు మరియు యెహోవాను గూర్చి సిగ్గుపడకుండుట
  • దేవునికి భయపడి ఆయనను మహిమపరచుటకు సిగ్గుపడకుండుట
  • ‘మంచివార్త విషయంలో సిగ్గుపడం’
    2024-2025 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • అందరికీ అవసరమైన సువార్త!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఈ సువార్త ముందుగా ప్రకటింపబడవలెను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ‘సువర్తమానము ప్రకటించడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 6/1 పేజీలు 21-26

“సువార్తను గూర్చి సిగ్గుపడకుండుట”

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికిని. . .రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.”—రోమీయులు 1:16.

1. సాధారణముగా సువార్త ఎట్లు చేర్చుకొనబడును, అయితే దేవునిరాజ్య సువార్తను విశ్వాసములేని లోక ప్రజలు ఎట్లు దృష్టింతురు?

ఒక వ్యక్తికి సువార్తగా కన్పించునది మరొక వ్యక్తికి అది సువార్తగా కన్పించక పోవచ్చును. సాధారణముగా సువార్తను మోసుకొని వచ్చు వ్యక్తిని ఆహ్వానించి, అతను చెప్పునది వినుటకు ఆసక్తి చూపించుట జరుగును. అయితే, విశ్వాసములేని లోక ప్రజలు, దేవుని రాజ్యము దాని రక్షణదాయక సువార్తను సంతోషవార్తగా దృష్టించరని బైబిలు ముందుగనే తెలియజేసినది.—2 కొరింథీయులు 2:15, 16 పోల్చుము.

2. తాను ప్రకటించిన సువార్తను గూర్చి పౌలు ఏమని చెప్పెను, మరియు ఆయన ప్రకటించిన సువార్త ఈనాటికిని ఎందుకు సువార్తయై యున్నది?

2 ప్రజలకు సువార్తను ప్రకటించుటకు అపొస్తలుడైన పౌలు అలా పంపబడెను. తన కప్పగింపబడిన పనిని గూర్చి ఆయనెట్లు భావించెను? ఆయనిట్లనెను: “నావలనైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను.” (రోమీయులు 1:15, 16) అది ఈనాటికిని మంచి వార్తయైయుండవలెనంటే, పౌలు దానిని అప్పటి రోములోని క్రైస్తవులకు వ్రాసిన తర్వాత దాదాపు 2000 సంవత్సరముల తర్వాత కూడా, అది నిజముగా శాశ్వతకాలము నిలిచియుండు సువార్తయై ఉండవలెను. అది వాస్తవమునకు “నిత్య సువార్తయై” యున్నది.—ప్రకటన 14:6.

3, 4. సువార్త విషయమై తాను సిగ్గుపడనని అపొస్తలుడైన పౌలు ఎందుకు చెప్పెను?

3 సువార్తను గూర్చి తాను సిగ్గుపడలేదని అపొస్తలుడైన పౌలు ఎందుకు చెప్పెను? దాని విషయమై ఆయనెందుకు అవమానపరచబడి యుండేవాడు? ఎందుకనగా అది జనసమ్మతమైనది కాదు, కారణమేమనగా అది బయటకు అంత మంచిగా కన్పించని సంఘటన, అనగా అది నేరస్థునివలె హింసాకొయ్యపై మరణించిన వానిని గూర్చినదైయుండెను. ఈ వ్యక్తి సువార్తతో మూడున్నర సంవత్సరములపాటు పాలస్తీనా అంతట తిరిగి, యూదులనుండి, ప్రత్యేకముగా మతనాయకులనుండి తీవ్రమైన వ్యతిరేకతను చవిచూసినవాడై యుండెను. ఇప్పుడు పౌలు తిరస్కరింపబడిన ఆవ్యక్తి నామమును ధరించినవాడై, అదే విధమైన వ్యతిరేకతను ఎదుర్కొనుచుండెను.—మత్తయి 9:35; యోహాను 11:46-48, 53; అ.కార్యములు 9:15, 20, 23.

4 అటువంటి వ్యతిరేకత కారణముగా, పౌలు మరియు తనతోటి యేసు క్రీస్తు శిష్యులు సిగ్గుపడవలసినదేదో తాము కలిగియున్నట్లుగా దృష్టించియుండవచ్చును. నిజానికి, పౌలు తానిదివరకు అవమానకరమని తలంచిన దానిని ఇప్పుడు హత్తుకొనియున్నాడు. యేసు క్రీస్తు అనుచరుల మీద నిందను మోపుటలో ఆయన వ్యక్తిగతముగా భాగము వహించియుండెను. (అ.కార్యములు 26:9-11) ఇప్పుడైతే ఆయన ఆ పనినుండి విరమించుకొనెను. తత్ఫలితముగా, యితర క్రైస్తవులతోపాటు ఆయనకూడా తీవ్రమైన హింసననుభవించెను.—అ.కార్యములు 11:26.

5. సువార్త విషయమై సిగ్గుపడనను మాటను పౌలు ఎట్లు వివరించెను?

5 యేసు క్రీస్తు అనుచరుడైయున్నందుకు ఒక వ్యక్తి అది తనకు సిగ్గుకరమని తలంచుటకు అనుమతించినట్లయిన, అతను విషయమును మానవ దృక్కోణమునుండి తీసుకొనిన వాడైయుండును. అపొస్తలుడైన పౌలు అట్లుండలేదు. బదులుగా, తాను ప్రకటించిన సువార్త విషయమై తాను సిగ్గుపడుటలేదని చెప్పుచు, ఆయనిట్లనెను: “నమ్ము ప్రతివానికిని. . .రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమీయులు 1:16) యేసు క్రీస్తు తానుగా ఎవరిని ఆరాధించువానిగాను, స్తుతించువానిగాను యుండెనో, ఆ దివ్యదేవుని స్తోత్రార్హమైయున్న సంకల్పమును నెరవేర్చుట కొరకు దేవుని శక్తి యేసు శిష్యునిద్వారా పనిచేయుచున్నట్లయిన, అది సిగ్గుపడుటకు కారణము కానేకాదు.—1 కొరింథీయులు 1:18; 9:22, 23 పోల్చుము.

సువార్త ప్రపంచవ్యాప్తముగా ప్రకటింపబడుచున్నది

6, 7. (ఎ) సువార్త విషయమైన ఏ బాధ్యతకు తగినట్టుగా జీవించుటకు యెహోవా సాక్షులు కృషిచేయుచున్నారు, దాని ఫలితమేమి? (బి) సాక్ష్యమివ్వకుండ భయము మనలను వెనుకకు లాగిపట్టుకొనుటకు మనము ఎన్నటికిని అనుమతించకపోయినను, కొన్నిసార్లు ఏమి అవసరమైయుండును? (పాదవచనము చూడుము.)

6 పౌలువలెనే ఈనాటి యెహోవా సాక్షులుకూడా ఆయన మహిమపరచబడిన కుమారుడగు, యేసు క్రీస్తు శిష్యులైయున్నారు. యెహోవా తన సాక్షులకు ఈ “మహిమగల సువార్త” సంపదను అప్పగించియున్నాడు. (1 తిమోతి 1:11) ఈ గురుతర బాధ్యతకు తగినట్టుగా జీవించుటలో యెహోవా సాక్షులు తప్పిపోలేదు, అలాగే దానిని బట్టి సిగ్గుపడనక్కరలేదనియు వారు వేడుకొనబడుచున్నారు. (2 తిమోతి 1:8) సాక్ష్యమిచ్చుటనుండి మనలను మనము యెహోవా సాక్షులుగా గుర్తించుకొనుటనుండి భయము భీతి మనలను వెనుకకు లాగిపట్టుకొనుటకు ఎన్నటికిని అనుమతించకుండుట అవశ్యకము.a

7 అలా నిర్భయముగా జంకులేకుండా సాక్ష్యమిచ్చుట ఫలితముగా భూమియందంతట సర్వోన్నతుడైన దేవుని నామము మరియు భూవ్యాప్తముగా ఆయన రాజ్యసువార్తయు ప్రకటించబడుచున్నది. దేవుని కుమారుడు ఇట్లనెను: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును,” కాగా ఎన్నటికిని ఆయన చెప్పిన ఈ ప్రవచనము నెరవేరకుండ విఫలమగుటకు అనుమతింపబడదు. (మత్తయి 24:14) సువార్త యిప్పుడు 210కంటే ఎక్కువ దేశములలో ప్రకటించబడుచున్నది, మరియు ప్రకటించు పని ముగింపునకు యింకను చేరుకొనలేదు. సువార్త విషయమై సిగ్గుపడకుండ భవిష్యత్తును ధైర్యముగా ఎదుర్కొంటు, యేసు క్రీస్తు తొలి శిష్యులవలెనే మనము ప్రార్థింతుము: “యెహోవా, . . .నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.”—అ.కార్యములు 4:29.

8. భూమిమీది దేశములన్నింటి ద్వారా వ్యతిరేకతయున్నను, యెహోవా సాక్షులు ఎందుకు నిరుత్సాహపడకూడదు?

8 భూవ్యాప్తముగా అన్ని దేశములలో యెహోవా సాక్షులను ద్వేషించుట, వ్యతిరేకించుట జరుగుచున్నది వాస్తవమైనను, యిది సజీవుడైన సత్యదేవుని నిజమైన ఆరాధికులను గుర్తించుటకు గురుతుగా చెప్పబడిన ప్రవచన నెరవేర్పైయున్నది. (యోహాను 15:20, 21; 2 తిమోతి 3:12) కాబట్టి, దీనిమూలముగా నిరుత్సాహపడుట మరియు అధైర్యపడుటకు బదులుగా, వారు దైవాంగీకారము కలిగియున్నారని, విశ్వసార్వభౌమాధిపతియగు యెహోవా గుర్తించిన సంస్థకుచెందినవారని సువార్త ప్రచారకులకు అభయమివ్వబడినది.

9. లోకమంతయు మనకు వ్యతిరేకముగాయున్నను మనకెందుకు ఫరవాలేదు?

9 మనకు సమస్త విశ్వములోకెల్లా సర్వోన్నతుడైయున్న దేవుని మద్దతు కలదు: దీనిని ఎన్నటికిని మరువకూడదు. కాబట్టి, లోకము దాని సమస్త మతశాఖలు మరియు రాజకీయ విభాగములతో కూడి మనకు వ్యతిరేకముగా ఉన్నప్పటికిని మనకేమి? దేవుని అద్వితీయ కుమారునికే సమస్త లోకము వ్యతిరేకమైయుండగా, అటువంటి పరిస్థితిలోనేయుండుటకు మనము సిగ్గుపడము. ఆయన తన అపొస్తలులతో చెప్పినట్లుగా: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోకసంబంధులైనయెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”—యోహాను 15:18, 19.

10. సాక్షులకు హింస ఎక్కువగా ఏ మూలమునుండి కలుగుచున్నది, మరియు వారెందుకు సిగ్గుపడని వారైయున్నారు?

10 యెహోవా సాక్షులు ఆవిధముగా ప్రపంచవ్యాప్తముగా అయితే మరి ఎక్కువగా నామకార్థ క్రీస్తుమత సామ్రాజ్య దేశములలో హింసననుభవించిరి. క్రీస్తుమత సామ్రాజ్యము ద్వారా కలిగిన అటువంటి హింస సాక్షులను క్రైస్తవులు కాదన్నట్లుగా నిరూపించలేదు. బదులుగా, అది నిజమైన క్రైస్తవులమని, యేసు క్రీస్తు తండ్రి మరియు దేవుడునైన యెహోవా సాక్షులమని వారు చెప్పుకొనుటను బలపరచుచున్నది. వారు దేవుని సాక్షులైనందున, మతపరముగా వచ్చు అలాంటి హింసననుభవించుటకు వారు సిగ్గుపడరు. కాబట్టి, సిగ్గుపడకుడని తొలి-శతాబ్ద క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు యిచ్చిన సలహా, సరిగా యిప్పటి యెహోవా సాక్షులకు అన్వయించుచున్నది.—ఫిలిప్పీయులు 1:27-29 చూడుము.

ప్రకటించబడగల శ్రేష్టమైన సువార్త

11. యెహోవా సాక్షులను నామమును తీసుకొనినను, మనమెందుకు యేసు క్రీస్తు అనుచరులుగా యుండుటను విరమించుకొనము?

11 తన నిబంధన ప్రజలకు యెషయా 43:10లో యెహోవా వాగ్ధానము చేసిన దాని నెరవేర్పునందు యెహోవా సాక్షులు ధైర్యముగా తమ పేరును అంగీకరించిరి. విషయమట్లున్నంత మాత్రమున వారు ఇక యేసు క్రీస్తును ఏమాత్రము అనుసరింపరని దాని భావము కాదు. యేసు వారి నాయకుడైయుండి, వారనుసరించి నడుచుటకు ఆయన వారికి మాదిరియైయున్నాడు. ఆయన తానుగా ఒక యెహోవా సాక్షియైయున్నాడు. వాస్తవానికి, ఆయన నాయకత్వము వహించుచున్న యెహోవా సాక్షియైయున్నాడు.—1 తిమోతి 6:13; ప్రకటన 1:5.

12. ప్రపంచవ్యాప్తముగా యెహోవా సాక్షులు ఎటువంటి వర్తమానమును ప్రకటించుచున్నారు, ఎందుకు?

12 ప్రపంచవ్యాప్తముగా యెహోవా సాక్షులు ప్రకటించుచున్న వర్తమానము ఎప్పటికిని ప్రకటింపబడగల శ్రేష్ఠమైన సువార్తయై యున్నది. ఏ మానవజాతిని విమోచించుటకు తన అద్వితీయకుమారుని పంపెనో ఆ మానవజాతి లోకముమీద పరిపాలించుటకు యెహోవా స్థాపించిన మెస్సీయా రాజ్యముకంటే శ్రేష్ఠమైన ప్రభుత్వము మరొకటి మానవజాతికి ఉండజాలదు. (యెషయా 9:6, 7) రాజ్యసువార్త ప్రకటించబడుచున్న భూనివాసులు దానిని అంగీకరించి భూపరదైసుమీద మానవ పరిపూర్ణతయందు నిత్యజీవమను బహుమతిని పొందుటకు అర్హులుగా నిరూపించుకొను అవకాశమివ్వబడుచున్నారు.

13. మెస్సీయా రాజ్య ప్రభుత్వము శ్రేష్టమైయుండునని మనమెందుకు నిశ్చయతను కలిగియుండగలము, మరియు సాక్షులు సిగ్గుపడని వారిగా వారు దేనిని సిఫారసు చేయుదురు?

13 తన ప్రజలుగా తయారగువారిని విడిపించుటకు కౄరమరణముననుభవించుటకు యేసు యిష్టపడియుండినట్లయిన, నిశ్చయముగా ఆయన వారికి శ్రేష్ఠమైనది తప్ప మరొక ప్రభుత్వమునివ్వడు. ఆ ప్రభుత్వమునకు నమ్మకమైన విధేయతగల పౌరుడవుకమ్మని, భూమిమీది ప్రతి మానవప్రాణికి మేము సిఫారసు చేయుచున్నాము. మానవజాతికి నమ్మకముగా సిఫారసుచేయు ప్రభుత్వము విషయమై మేము సిగ్గుపడువారము కాము. ఈ పని మామీదికి హింసను తెచ్చినను, రాజ్యమును ప్రకటించుటనుండి మేము వెనుదీయము. అపొస్తలుడైన పౌలువలె మాలో ప్రతివారము చెప్పునదేమనగా: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను.”

14. యేసు ప్రకారము, మన కాలములో రాజ్యప్రచారము ఎంత విస్తారముగా ఉండును?

14 రాజ్యసువార్తను ప్రకటించు పని ప్రపంచవ్యాప్తముగా జరుగునని యేసు ముందుగనే చెప్పెను, కాగా అటువంటి వర్తమానమునకు అంత విశాలతను తెలుపు ప్రవచనము సరియైయున్నది. (మార్కు 13:10) అంత విస్తీర్ణతకు చేరునని—అవును, భూదిగంతముల వరకు యెహోవా రాజ్యము ప్రకటింపబడునని ప్రవచించుటలో ఆయన అసమ్మతియైలేడు. (అ.కార్యములు 1:8) ప్రతిచోట ప్రజలు కనుగొనబడుదురని, రాజ్యసువార్తతో వారిని చేరుటకు తన నమ్మకమైన అనుచరులు చిత్తశుద్ధితో ప్రయత్నింతురని యేసు ఎరిగియుండెను.

15, 16. (ఎ) సువార్తను విను అర్హతను ఎవరు కలిగియున్నారు? (బి) అపవాది సంస్థద్వారా వ్యతిరేకతయున్నను ప్రకటించుపని ఎందుకు నెరవేర్చబడును?

15 ఈనాడు భూనివాసులు కోట్లసంఖ్యలో పెరిగిపోయి ఖండఖండములకు, సముద్ర ద్వీపములకు విస్తరించిరి. అయినను, సువార్తతో చేరుటకు ప్రయత్నించుటలో యెహోవా సాక్షులకు భూమిమీది ఏ భాగము చేరలేనంత దూరముగా యుండలేదు. నివాసిత భూమియంతయు యెహోవా దేవుని సూచనార్థక పాదపీఠమై యున్నది. (యెషయా 66:1) ఈ పాదపీఠముయొక్క ఏ భాగమునాక్రమించుకొనియున్న మానవులైనను ఈ రక్షణ వర్తమానమును వినుటకు అర్హులైయున్నారు.

16 సువార్త ఈనాడు మెస్సీయా చేతులయందు యిప్పటికే స్థాపింపబడిన రాజ ప్రభుత్వమునకు చెందిన సంతోషమును కల్గించు వర్తమానమైయున్నది. అపవాది సంస్థతెచ్చు బహుదుష్టమైన హింసమధ్యను, మెస్సీయా నిజమైన అనుచరులు “ఈ రాజ్యసువార్తను” ఒక స్థాపిత వాస్తవముగా “భూమియందంతట ప్రకటించుటకు” ప్రతి అంచునకు వెళ్లుటకు దేవుని ఆత్మ వారిని ప్రేరేపించునని యేసు ఎరిగియుండెను.—మత్తయి 24:14.

యేసు క్రీస్తు మరియు యెహోవాను గూర్చి సిగ్గుపడకుండుట

17. (ఎ) దేని విషయమై సత్యారాధికులు సిగ్గుపడరు? (బి) మార్కు 8:38లో యేసు ఏ నియమమునుంచెను, మరియు దాని ప్రాముఖ్యత ఏమైయున్నది?

17 సర్వోన్నతుడైన దేవుడు యెహోవా అని తనకొక నామమిచ్చుకొనుటలో అయిష్టతను కలిగిలేడు; అట్లే ఆయన నమ్మకమైన సేవకులును ఆ నామమును గూర్చి సిగ్గుపడకూడదు. సత్యారాధికులు తెలియబడుటకు, మరియు ఆయనకు అవిభాగిత ఆరాధన చేయువారిగా, విధేయత చూపువారిగా గుర్తింపబడుటకు సంతోషింతురు. తన విషయమై యేసు మార్కు 8:38లో ఒక నియమమును లేక సూత్రమును పెట్టియున్నాడు: “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.” అదేప్రకారము ప్రభువైన యేసు క్రీస్తుయొక్క తండ్రియు దేవుడునైన వానిని గూర్చి సిగ్గుపడు ప్రతివారిని గూర్చి, యెహోవా సిగ్గుపడును. అవిశ్వాస క్రియావిధానమును బట్టి ఎవరివిషయములో యెహోవా సిగ్గుపడునో, ఆవ్యక్తి దేవుని అధికార పరిధిలోని పరలోకములోగాని లేక భూమిమీద ఏ భాగమునందైననుగాని ఉనికిలోయుండుటకు అర్హుడైయుండడు.—లూకా 9:26.

18. (ఎ) మత్తయి 10:32, 33లోని యేసు మాటలు ఎందుకు మన హృదయములలో మరియు మనస్సులలో గాఢముగా నాటుకొనవలెను? (బి) మనుష్యుల భయముచేత యేసును యెహోవాను ఎరుగననువారికి ఏమి సంభవించును? (పాదవచనముమీద ఆధారపడి ఉదాహరణలనిమ్ము.)

18 యేసు క్రీస్తు పలికిన ఈ క్రింది మాటలు మన హృదయములలో మరియు మనస్సులలో గాఢముగా నాటుకొని పోవునుగాక: “మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:32, 33; లూకా 12:8, 9) అదే ఆధారముగా, ప్రభువైన యేసు క్రీస్తుయొక్క తండ్రియు దేవుడునైన వానిని ఎవరు ఎరుగనందురో వారిని ఆయనయు ఎరుగననును. అతడు యేసు క్రీస్తు ముఖ్య కుమారునిగాయుండు కుటుంబములో సభ్యునిగా అర్హుడైయుండడు. అలా అతడు దేవుని నిర్ణయకాలమున నాశనము చేయబడును.b

19, 20. (ఎ) యెహోవా నామము పరిశుద్ధపరచబడు గాక అని ప్రార్థించువారు ఎందుకు దేనిగూర్చియు సిగ్గుపడని వారైయుందురు? (బి) నిర్భయస్థులైన రాజ్యప్రచారకులు ఏమి నెరవేర్చిరి, మరియు ఏ మద్దతుతో?

19 “పరలోకమందున్న మాతండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరును గాక”అని యేసు తన శిష్యులకు నేర్పించిన మాదిరి ప్రార్థనకు జవాబు దొరుకును. (మత్తయి 6:9, 10) అది సంభవించినప్పుడు యేసు ప్రేమగల శిష్యులు దేనిని గూర్చియు సిగ్గుపడరు. ఎన్నటికిని చనిపోనవసరములేని లక్షలాదిమంది మానవుల ద్వారానేకాకుండ, తన వెయ్యేండ్ల పాలనాకాలములో సమాధులలోనుండి ఆయన పిలుచు కోట్లాదిమంది ద్వారాకూడ యెహోవా నామము పూజ్యనీయము చేయబడును మరియు పరిశుద్ధపరచబడును. వారు పరదైసు భూమిమీద నిత్యము జీవించు అవకాశమును కలిగియుందురు.

20 సిగ్గుపడని వారిగా, ఈ నిర్భయ ప్రచారకులు తమవెనుక మానవాతీత శక్తి—పరలోక దూతల మద్దతు—కారణముగా ప్రపంచవ్యాప్త వ్యతిరేకత మధ్యను భౌగోళికముగా రాజ్యసువార్త సాక్ష్యపు పనిని నెరవేర్చినవారై యుందురు. కాబట్టి, యెహోవా సాక్షులు “దేవునికి భయపడి, ఆయనను మహిమపరచెదరు.”—ప్రకటన 14:6, 7.

దేవునికి భయపడి ఆయనను మహిమపరచుటకు సిగ్గుపడకుండుట

21. దేనిని చేయుటకు యెహోవా సాక్షులు సిగ్గుపడరు, మరియు దాని ఫలితమేమి?

21 యెహోవా నామమును ఉపయోగించుచు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుటకు తాము సిగ్గుపడువారము కాదని యెహోవా సాక్షులు నిరూపించిరి. దీని ఫలితముగా వారికి చెప్పనలవికాని ఆశీర్వాదములు వచ్చెను. ఈ ఆశీర్వాదములు సర్వోన్నతుడైన దేవుని వాగ్ధానముల నమ్మకమైన నెరవేర్పునుండి వచ్చెను. విశ్వ సార్వభౌమాధిపతియు, సత్యమైన సజీవుడైన దేవునిగా ఆయనను ఇది ఎంతగా మహిమపరచినది!

22. యెహోవా సాక్షులు ఎందుకు తీవ్ర హింసను ఎదుర్కొందురు, అయితే ఏ ఆనందము వారి స్వంతమగును?

22 రానైయున్న భవిష్యత్తులో లోక ప్రభుత్వములు మత పాలనలకు వ్యతిరేకముగా తిరిగి వాటిని—క్రీస్తు మత సామ్రాజ్యముతో సహా—ఉనికిలో లేకుండా తుడిచివేయును. (ప్రకటన 17:16, 17) తత్ఫలితముగా, కొంత సమయము మట్టుకు లోక మూలధాతువుల ద్వారా యెహోవా సాక్షులు తీవ్ర హింసను ఎదుర్కొందురు. నిత్యదేవుడు వారితో యుండనట్లయిన వారు దానిని భరించి తప్పించుకొన శక్తిగలవారై యుండరు. అయితే ఆయన వారితో ఉన్నాడు, మరియు సాక్షులు అనుల్లొంఘనముగా ఆరాధించు దేవుడు అలాంటి క్రీస్తు వ్యతిరేకులను, యెహోవా శత్రువులను ఉనికిలో లేకుండ తుడిచివేయుటను చూచినప్పుడు వారానందింతురు. బహిర్గతము చేయబడుటద్వారా అవమానమును, నిజమైన దైవపాలనా శత్రువులుగా వారు నాశనమును అనుభవింపరు అయితే వారు ఆనందముతో యెహోవాకు: “యుగయుగములు నీవే దేవుడవు,” అని కీర్తనలు పాడుటయందు చెప్పలేనంత ఆనందముననుభవింతురు.—కీర్తన 90:2.

23. యెహోవా సాక్షులు దేనిగూర్చియు ఎందుకు సిగ్గుపడని వారైయున్నారు, మరియు దాని ఫలితమేమైయున్నది?

23 ఎవరిమూలముగా మానవకుటుంబము విమోచింపబడి పరదైసు భూమిమీద మానవ పరిపూర్ణతయందు, సంతోషమునందు నిత్యజీవమును అనుభవించునో ఆ యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునియందు వారు ఘనతనొందుదురు. యేసు క్రీస్తుద్వారా తానెంత శక్తిమంతుడో యెహోవా దేవుడు ఎంతగా చూపించుకొనియున్నాడు! తన సర్వశక్తిని జ్ఞానయుక్తముగా, ప్రేమగా ఉపయోగించువాడేగాని దుర్వినియోగపరచువాడు కాదని యెహోవా ఎంత మనోహరముగా ప్రదర్శించియున్నాడు! తదనుగుణ్యముగా, ఆయనను గూర్చిగాని, ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును గూర్చిగాని సిగ్గుపడు విషయమేమియు మనకు లేదు. “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను” అని తన భూజీవిత చివరిఘడియలయందు చెప్పిన, క్రీస్తు యేసు మూలముగా యెహోవా దేవుని జయించు శక్తిని తెలియజేయు మహిమాయుక్త సువార్తను ప్రకటించువారిగా యుండుటకు మనము సిగ్గుపడువారముకాము. (యోహాను 16:33) ఈ విధానమును చేపట్టుటలో సువార్తను గూర్చి ఎన్నటికిని సిగ్గుపడని అపొస్తలుడైన పౌలు మాదిరిని మనమన్నివేళలా అనుసరించుదుము గాక. మనమట్లు చేసినట్లయిన, సర్వశక్తిగల దేవుడు మననుగూర్చి సిగ్గుపడడు. (w90 1/1)

[అధస్సూచీలు]

a మనము సాక్షులమను వాస్తవము విషయమై సిగ్గుపడుటకు మనము కోరకపోయినను, మనము “పాములవలె వివేకులునై”యుండవలసిన సమయములు కలవు. (మత్తయి 10:16) నాజీ జర్మనినందలి సాక్షులు తమనుతాము గుర్తించుకొను మరియు అలాచేయకూడని సమయములను ఎరిగియుండిరి.—అ.కార్యములు 9:23-25 పోల్చుము.

b అనేకమార్లు, మనుష్యుల భయము కారణముగా యెహోవాను యేసును ఎరుగననిన వారు అటు లోకమందును ఆదరింపబడలేదు. ఉదాహరణకు, ది వాచ్‌టవర్‌ మే 1, 1989, పుట 12; 1982 ఇయర్‌బుక్‌, పుట 168; 1977 ఇయర్‌బుక్‌, పుటలు 174-6; 1974 ఇయర్‌బుక్‌, పుటలు 149-50, 177-8 చూడుము. మరొక ప్రక్కన, తీర్మానించుకొనిన వ్యతిరేకులకు సహితము సాక్షులు యేసును యెహోవాను ఎరుగననరను సంగతి తెలుసు. (1989 ఇయర్‌బుక్‌, పుటలు 116-18) మత్తయి 10:39 మరియు లూకా 12:4 కూడ చూడుము.

సారాంశమందలి ప్రశ్నలు

◻ సువార్తను ప్రకటించు విషయములో అపొస్తలుడైన పౌలువలె ఏ దృక్పధమును మనము కలిగియుండవలెను, మరియు ఎందుకు?

◻ యెహోవా సాక్షులు ప్రకటించు వర్తమానము ఎందుకు ఎప్పటికంటెను శ్రేష్ఠమైనదైయున్నది?

◻ తాను రాజ్యమహిమయందు వచ్చునప్పటికి తనను గూర్చి సిగ్గుపడుచునుండు వారికి యేసు ఏ హెచ్చరికను చేసెను?

◻ యెహోవాను యేసు క్రీస్తును ఉపేక్షించువారికి ఏమి సంభవించును?

◻ సిగ్గుచెందకుండ సువార్తను ప్రకటించువారు ఏమి నెరవేర్చ శక్తిగలవారైయున్నారు, ఎందుకు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి