వాగ్ధానదేశమునుండి దృశ్యములు
యూదయ అరణ్యము బంజరు అయితే ఆకర్షణీయమైనది
వాగ్ధాన దేశమందలి యూదయ అరణ్యము ఎట్లుంటుందని నీవు ఊహించుదువు? ఒక దట్టమైన మహారణ్యమును పోలియుండునని కొందరు తలంచారు. మరికొందరైతే అనంతమైన ఇసుకతిన్నెలు కల సహారావంటి ఎడారిని పోలియున్నదని ఊహింతురు.
పైనున్న చిత్రపటమును చూస్తే వీటిలో ఏ ఒక్కవర్ణన సరిపోదు. ఈ దృశ్యములో యేసుకు సంబంధమున్న కొద్దిపాటి అరణ్యప్రదేశమును నీవు చూచుచున్నావు. ఈ కొండ శిఖరమునుండి సాతాను యేసుకు “ఈ లోకరాజ్యములన్నిటిని” చూపించెనని సాంప్రదాయము కలదు, కాగా ఈ శిఖరము అరణ్యము అంచున ఉంది, తూర్పున యొర్దానులోయలో ఖర్జూరపు చెట్లతో అలంకరించబడిన యెరికో పట్టణమును కనుమరుగుచేసింది.—మత్తయి 3:1; 4:1-11.
ఈశాన్యభాగమున ఇక్కడినుండి మృతసముద్రముయొక్క పశ్చిమతీరంవరకు యూదయ అరణ్యము వ్యాపించియున్నది. 1989 యెహోవాసాక్షుల క్యాలండరు అట్టపైనున్న చిత్రపటములో ఈ ప్రాంతమును గుర్తించిన నీకు సహాయకరముగా ఉండును. (పైచిత్రముయొక్క పెద్దసైజు పటమును కూడా క్యాలెండరు కలిగియున్నది.) యూదయకొండల తూర్పుపల్లపు ప్రాంతములోనుండి మృతసముద్రతీరమువరకు ఈ అరణ్యము 10 నుండి 15 మైళ్ల వెడల్పు వ్యాపించియున్నది.
మధ్యధరా సముద్రమునుండి వస్తున్న గాలులలో అధికభాగమును ఆ పర్వతములు నిలిపివేస్తాయి. కనుక తూర్పున ఉన్ననున్నని, సున్నపుకొండలకు శీతాకాలపు నెలలైన నవంబరు, డిశంబరులలో తప్ప మిగిలినకాలములో కొద్దిగానే వర్షము లభించును. అప్పుడే ఇక్కడ గడ్డిమొలుచును, అప్పుడు గొర్రెలమందలు ఇచ్చట కన్పిస్తాయి. ఆవిధంగా 1 సమూయేలు 24:3లో తెల్పబడిన “రాతిగొఱ్ఱెదొడ్లు” అనేది ఈ ప్రాంతానికి సరిగ్గాసరిపోతుంది.
ఇచ్చట మొలిచినగడ్డి ఎక్కువకాలం నిలువదు. ఎడారి నుండి వీచే తూర్పుగాలులు ఈ పచ్చికను త్వరగా గోధుమవర్ణమునకు మాడ్చివేయును. ప్రవచనవ్యాఖ్యను ఇది ఎంతచక్కగా వర్ణించుచున్నది: “గడ్డియెండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8; 1 పేతురు 1:24, 25.
యేసు 40 పగళ్లు, 40 రాత్రులు ఈ అరణ్యములో తిరుగాడినప్పుడు బహుశ ఈ లేఖనభాగమును ధ్యానించియుండవచ్చును.చెట్లులేని కొండలమీద ఇరుకులోయలలో తీక్షణమైన ఎండకాయునప్పుడు యేసు ఎలా వ్యాకులపడెనో ఊహించుము. (యెషయా 32:2) అటుతరువాత “దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి” అనుట ఎంత సందర్భసహితంగా ఉన్నది!—మత్తయి 4:1-11.
బంజరుభూమిగా, నిర్జనముగా ఉండుటమూలంగా, ఈ యూదయ అరణ్యము తరచుగా ఒక ఆశ్రయప్రాంతముగా ఉపయోగపడేది. అత్యాగ్రహముతోనున్న రోజున సౌలు ఎదుటనుండి దావీదు పారిపోయి అచ్చట ఆశ్రయముపొందెను. “నీళ్లు లేక యెండియున్నదేశము”అని అతడు దానిని వర్ణించెను. (కీర్తన 63:1 మరియు దానిపైనున్న మాటలు; 1 సమూయేలు 23:29) కొంతకాలమువరకు ఆయన ఒక గుహలో దాగుకొనెను, బహుశ అది వాడిఖరెయిటన్‌లోని (బెత్లెహేము తూర్పు భాగమునుండి మృతసముద్రమువరకు వ్యాపించియున్న ఒక లోయ), ఉమ్ ఖటాఫా గుహను పోలియుండును. (హెబ్రీయులు 11:32, 38) ఆ గుహనుండి కన్పించు ఈ దృశ్యములో కుడివైపు దిగువభాగంలో కొన్ని నల్లని గొఱ్ఱెలు అక్కడక్కడ ఉన్న పచ్చికకొరకు తిరుగుచున్నట్లు నీవుచూడగలవు.
సౌలు ఏకాంతమందు విశ్రాంతి పొందుచున్నప్పుడు దావీదు ఏన్గెదీ ప్రాంతములోని ఒక గుహలో ఉండెను. సౌలుయొక్క పైవస్త్రపు చెంగును దావీదు కోసినను, “యెహోవాచేత అభిషేకమునొందిన వానికి” కీడుచేయ యిష్టపడలేదు. పిమ్మట రాజు క్రిందభాగమున దట్టమైన ఆకులమధ్య ఉండగా దావీదు సౌలును పిలిచియుండవచ్చును. (1 సమూయేలు 24:1-22) ‘ఇక్కడ దట్టముగా ఆకులా?’ అని నీవు ఆశ్చర్యపడవచ్చును.
అవును, నీరుసమృద్ధిగా ఉన్నప్పుడు ఈ యెండిన భూమి బహుగా పూయగలదు. దీనికి ఏన్గెదీ ఒక ఉదాహరణ. సూక్ష్మ రంధ్రములుగల బండలోనికి నీరు యింకి, ఈలోయలో నీటి బుగ్గలుగాను, జలపాతములుగాను మారి బయటికి వచ్చును, ఈ లోయ మృతసముద్రముయొక్క పశ్చిమ తీరానికి వ్యాపించియుండును. ఇది ఏన్గెదీని వృక్షములతో సమృద్ధిగా నింపి నిజంగా అరణ్యమువలె మార్చును. దాని నీవు దర్శించిన యెడల రకరకాల పుష్పములు పండ్లు నీవు కనుగొంటావు. పొట్టికుందేళ్లను మొదలుకొని కొండమేకలవరకు అడవి జంతుజాలములను చూడవచ్చును; ఆ ప్రాంతములో చిఱుతపులులు కూడకలవు!—1 సమూయేలు 24:2; పరమగీతము 1:14.
బంజరుభూమిగాయున్న యూదయ అరణ్యము బహుపచ్చగా మారగలదు; ఈ విషయము, యెరూషలేము దేవాలయమునుండి ప్రవహించు నీటినిగూర్చిన యెహెజ్కేలు దర్శనమును గూర్చిన మన గుణగ్రహణను పటిష్టపర్చును. ప్రవాహము తూర్పుదిక్కుగా యూదయ అరణ్యము గుండా పారినదిగా మారువరకు హెచ్చుచు వచ్చెను. దాని ఫలితం? యెహెజ్కేలు ఇలా వ్రాసెను: “నదీతీరమున ఇరుప్రక్కలచెట్లు విస్తారముగా కనబడెను. . .వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.” ఆ నీరు మృతసముద్రములోనికి ప్రవహించి ఆ నిర్జీవజలములను మంచి నీళ్లుగా మార్చివేయును.—యెహెజ్కేలు 47:1-12; యెషయా 35:1, 6, 7.
కావున, యూదయ అరణ్యము కొంతమేరకు బంజరుగా వున్నను, నిర్జనప్రాంతమైనను, అది అనేక బైబిలు వృత్తాంతములలో కాననగు వ్యత్యాసములను చూపించు ఆకర్షణీయమైన ప్రదేశమై కూడా ఉన్నది.—లూకా 10:29-37. (w89 11/1)
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.