కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 12/1 పేజీలు 4-7
  • నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవభయము, మత్సరముల మధ్యపోటి
  • విశ్వాసము, అత్యాశల మధ్య పోటి
  • ఆస్తులకంటే ప్రజలే ఎంతో ప్రాముఖ్యము
  • నేరము—అప్పుడే నిర్మూలించబడెనా?
  • నేరనిర్మూలన—భవిష్యత్‌ సంభవములు
  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • గుడ్డివాళ్లను బాగుచేశాడు, జక్కయ్యకు సహాయం చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు యెరికోలో ప్రకటించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 12/1 పేజీలు 4-7

నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నది!

నేరస్థుల గుర్తింపు మరియు దృక్పదాలను బయల్పరచు ఆధారాలను పరిశీలించుట మూలంగా నేరములను పరిష్కరించాలని అపరాధ పరిశోధకులు ప్రయత్నించుచున్నారు. ఈ అపరాధ పరిశోధకుల పథకములు నైపుణ్యము అనేవి ప్రపంచవ్యాప్తంగా నవలలో చర్చనీయాంశముగా బహుళ ప్రఖ్యాతిగాంచెను. తుదకు అతడు నేరస్థుని కనుగొనుటలో విజయము సాధించినను, నేరము జరిగిపోయిన పిమ్మట, సంఘటన సంభవించిన తరువాతనే సర్వసాధారణంగా అపరాధ పరిశోధకుని పని ప్రారంభమౌతుంది.

నేరములు పెరిగిపోవుటను గమనిస్తే, ఒక నేరస్థుడు పట్టుబడితే, యితరులు అనేకులు నేరములకు పాల్పడుచున్నట్లు తెలుస్తున్నది. నేరమును నిర్మూలించుటకు సంభవించిన నేరములను పరిష్కరించుటకంటే ఎక్కువగా చేయవలసిన అవసరమున్నది. ప్రజలు నేరస్థులుగా కాకుండా వారిని ఏది ఆపగలదు?

నేరమునకు నైతికత్వముతో సంబంధమున్నది. హత్య, మానభంగము, మరియు యితర హింసాత్మక చర్యలు నేరములేనని అంగీకరించుటకు మనకెట్టి యిబ్బంది లేదు. పన్నుచెల్లింపు పత్రమును పూరించునప్పుడు మోసము చేస్తే దానిసంగతేమి? అట్టి చర్య కూడా నేరమే, ఎందుకంటే యథార్థతనే నైతికప్రమాణానికి అది భిన్నమైనది. నేరమును పూర్తిగా అంతముచేయుట అంటే నైతికత్వమునకు విరుద్ధమగు చర్యలను తుడిచిపెట్టుట అని అర్థము.

నేరమునకుగల కారణమును మాత్రమేకాక దానిని నిర్మూలించగలమార్గమును చూపు మూడు బైబిలు దృష్టాంతములను గమనించుము.

దైవభయము, మత్సరముల మధ్యపోటి

ఆసాపు అనే కీర్తనల రచయిత మాటలను గమనించుము: “భక్తిహీనుల క్షేమము నాకంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని.” (కీర్తన 73:3) అవును, నేరస్థులు వర్థిల్లుట, వారి జీవన విధానమును గూర్చిన మత్సరము అనేకులను అక్రమమార్గములను అవలంభించునట్లు చేయును. టెలివిజనులోను పత్రికలలోను నేరములను అందంగా చిత్రీకరించడం, చెడును అసహ్యించుటను పురికొల్పుటకు బదులు దానిని బహుగా అంగీకరించునట్లు చేయుచున్నది.

అయితే ప్రేరేపిత సామెతల రచయిత యిలా బుద్ధిచెప్పుచున్నాడు: “పాపులను చూచి నీ హృదయము నందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము.” ఒకవ్యక్తియొక్క కోరిక మరియు దృక్పథమే ఆ సమస్యయొక్క వేరునందున్నది. వాటిని అణిచివేయుటకు అత్యంత ప్రభావమగు మార్గమేదనగా యెహోవా దేవుని అయిష్టపర్చకుండా ఉండే దైవభయమును నిర్మించుకొనుటయే. “నిశ్చయముగా ముందుగతిరానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు.”—సామెతలు 23:17, 18.

విశ్వాసము, అత్యాశల మధ్య పోటి

సా.శ. 33 వసంత ఋతువునందు, యేసు యెరికో పట్టణముగుండా ప్రయాణించుచుండెను. అది జక్కయ్య స్వంతపట్టణము, అతడు “ఒక ప్రముఖ సుంకపు గుత్తదారుడని” దానికితోడు “ధనవంతుడు” అని సువార్తను వ్రాసిన లూకా వర్ణించెను. యెరికో చుట్టుప్రక్కలనున్న సారవంతమైన జిల్లాలలో పన్నుల వసూలు బాగుగా జరిగేది. జక్కయ్య స్వంతమాటలు చూపినట్లు, పన్నుల వసూలుదారునిగా అన్యాయముగా సంపాదించుటకు అతనికి అవకాశముల నిచ్చియున్నది. కాని జక్కయ్య నేరస్థునిగానే ఉండిపోలేదు.—లూకా 19:1-8

యేసు చుట్టు గుమికూడియున్న జనసమూహము కంటె ముందుగా పరుగెత్తివెళ్లి తాను పొట్టివాడైనందున ఒక మేడిచెట్టు ఎక్కికూర్చుండెను. యేసు అతనిని చూచి జక్కయ్య క్రిందికి దిగుమని, యెరికోలో తానున్నప్పుడు అతనియింట ఉంటానని చెప్పెను. అటుతరువాత ఒక మార్పు చెందిన స్వభావమును జక్కయ్య మాటలు పల్కినవి: “నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును.” అన్యాయముగా తీసికొనిన సొమ్మును తిరిగి యివ్వడం చాలా ఖర్చుతో కూడినపని ఇలా చేస్తానని వాగ్థానము చేయడం మూలంగా, జక్కయ్య యేసునందలి తన విశ్వాసమును ప్రకటించెను. అవును, అతనిలో వచ్చిన మార్పు, గొప్పఫలితాన్ని తెచ్చింది. తాను అన్యాయంగా తీసికొన్నదానిని యిచ్చివేయడమేకాక దానికి మూడురెట్లు విలువను, అనగా నాలుగంతలు చెల్లించుటకు సిద్ధపడెను. ఆవిధంగా, జక్కయ్య తానుచేసిన చెడుపనిని సరిచేసెను. అంతేకాక మార్పుచేసికొనిన తన జీవనవిధానముయొక్క విధేయతను నిరూపించుకొనెను..—2 కొరింథీయులు 7:11.

ఆస్తులకంటే ప్రజలే ఎంతో ప్రాముఖ్యము

దోషారోపణ చేయబడిన యేసుక్రీస్తు విషయములో రోమా గవర్నరు పిలాతు యిలా అన్నాడు: “ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు.” (లూకా 23:4) సంపదను సమకూర్చుకొనుటను నేరప్రవృత్తివైపు తిరుగుటకుబదులు యేసు తన భూసంబంధ పరిచర్యలో, ప్రజలయెడల ప్రేమాపూర్వక ఆసక్తిని ప్రదర్శించెను. “ఆయన సమూహములను చూచి, వారుకాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి, ‘కోతవిస్తారమేకాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తనకోతకు పని వారిని పంపుమని కోతయజమానుని వేడుకొనుడని’ తన శిష్యులతో చెప్పెను.” (మత్తయి 9:36-38) యేసు, స్పష్టముగా సంపదకంటె, చివరకు తనస్వంత సుఖము మరియు ఆసక్తులకంటె ప్రజలను ముందుగా పెట్టెను. తనశిష్యులను, తన ఉపదేశము మరియు సహాయము నిమిత్తము ఆయనను వెదకుచువచ్చిన జనసమూహమును లక్ష్యపెట్టుటలో తన్నుతాను వ్యయపర్చుకొనుటకు ఆయన చూపిన సంసిద్ధత నందుకూడా దీనిని చూడగలము. (మత్తయి 8:20; 14:13-16) దీనిలో మనము అనుసరించుటకు యేసు ఒకమాదిరిని ఉంచెను.—1 పేతురు 2:21.

వస్తుసంబంధమైన వాటికన్నా తోటిమానవులను అత్యంత విలువైన వారిగా కల్గియుండుటకు, అట్టి మాదిరిని అనుసరించుట నేటి ప్రజలకు సాధ్యమగునా? దృఢముగా మనము సమాధానమివ్వగలము. నేడు ముఫై అయిదు లక్షలకంటె ఎక్కువగాయున్న యెహోవాసాక్షులను గమనించండి. క్రీస్తు మనస్సును కల్గియుండగోరి, దానిని ఆచరణాత్మకంగా వ్యక్తపర్చ గోరుచున్నారు. ఇతరులనేకులను నేరములకు నడుపు చెడుకోరికలను తమ హృదయములలో నుండి తీసివేయుటకు వారు స్థిరముగా పనిచేయుచున్నారు. సాక్షులు కాక మునుపు, నేరస్థులుగా ఉన్నవారు, బైబిలును పఠించుచుండగా, దేవునియెడల ప్రేమను వృద్ధిచేసికొన్నప్పుడు, అది వారిని తాకింది; వారిలో అనేకులు తాము ముందుచేసిన నేర చర్యలనుండి మరలి పునరుద్ధరించబడుటకు పురికొల్పినది. అట్టివారు ప్రచారముకొరకు దానిని చేయుటలేదుకాని, యెహోవా దేవునితో సమాధానకరమైన సంబంధమును కల్గియుండుటకు తద్వారా యేసుక్రీస్తు విమోచన బలిద్వారా వ్యక్తపర్చబడిన ఆయన కరుణా వాత్యల్యతనుబట్టి ప్రయోజనమును పొందుటకును చేయుచున్నారు—1 కొరింథీయులు 2:16; 6:11; 2 కొరింథీయులు 5:18-20.

అట్టి క్రైస్తవులు తమ పొరుగువారియెడల ప్రేమతో, యితరులను సందర్శించి, అట్టి కుటుంబములు దేవునిరాజ్యము క్రింది పరదైసువంటి పరిస్థితులలో జీవము కొరకు ఎలా ఎదురు చూడవచ్చునో వివరించుటకు సమయమును తీసుకుంటారు. యెహోవా సాక్షులు తమరాజ్యమందిరములలో ప్రతివారము క్రమంగా కూటములను జరుపుకొందురు. తాను దొంగనని ఒప్పుకున్న ఒకడు అసలు కూటములు ఎలా ఉంటాయో చూడడాన్కి అతనికివ్వబడిన ఆహ్వానాన్ని అంగీకరించాడు. అతడిలా వివరిస్తున్నాడు: “చాలా తక్కువచెప్పాలంటే, నేనుచాలా ఆశ్చర్యపోయాను. నేను ఊహించినట్లు అది ఒక్క రవ్వంతయైనా మందకొడిగా లేక విసుగు కల్గించేదిగా లేదు. ఆప్యాయత మరియు ప్రేమ చాలా స్పష్టంగా కన్పించింది, నిశ్చయముగా అవి నిజమైనవి. ఆత్మీయవిషయముల యెడల సాక్షులందరూ కల్గియున్న అభినందన వర్ణనాతీతం.” తన సహవాసమును కొనసాగించె విధంగా అతడు ముగ్దుడయ్యాడు, అది అతనికి మార్పుచెందుటకు సహాయపడింది. నేరములో నీవు యిమిడియున్నను లేకున్నను నీవు దేవుని సేవకులతో సహవాసము చేయునప్పుడు, సంపదలకంటే ప్రజలయెడల అట్టి నిజమైన ఆసక్తినే నీవును కనుగొనగలవు.—మత్తయి 22:39.

నేరము—అప్పుడే నిర్మూలించబడెనా?

ప్రజలు ఇక నేరస్థులవలె ప్రవర్తించకపోతే, వారు పరిపూర్ణులై పోయారని దీని భావమా? కానేకాదు! ఇతరులవలె, యెహోవాసాక్షులు కూడా మనమొదటి తండ్రియైన ఆదామునుండి సంక్రమింపజేసికొనిన పాపము మూలంగా బాధించబడుచున్నారు. (రోమా 5:12; 1 యోహాను 1:8) అయితే వారుచేయుచున్న ప్రకటన మరియు బోధించుపనియందు ప్రతిబింబించురీతిగా దేవుని సేవించుటయందు వారు ఏకమైయున్నారు. యెషయా ప్రవచన నెరవేర్పుయొక్క శక్తివంతమైన సాక్ష్యమునిది కల్గియున్నది: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును. . .సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.” (యెషయా 2:2) నిజమే, యెహోవా యొక్క ఉన్నత ఆరాధనకు, ఆయన మార్గములందు ఉపదేశమునుకోరుచు లక్షలాదిమంది ప్రవాహమువలె వచ్చుచున్నారు. నేరమును విడనాడిన ప్రజలతో సహవాసము చేయుటమూలంగా ప్రయోజనము పొందువారిలో నీవును ఒకడవు కావచ్చును.

నేరనిర్మూలన—భవిష్యత్‌ సంభవములు

మనదినములలో పెరిగిపోవుచున్న నేరకార్యములు నిజంగా నేరములను చేయుచున్నవారితో సహా దుష్టులనందరిని నిర్మూలించుటకు దైవికచర్య సమీపమాయెననుటకు ముందు సూచన. “కీడుచేయువారు నిర్మూలమగుదురు. . ..ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారిస్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.” (కీర్తన 37:9, 10) నిజముగా, నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపమాయెను. ఆది నేరస్థుడైన, అపవాదియైన సాతాను, బంధింపబడి అగాధములో పడవేయబడు సమయమునకు మనము సమీపించుచున్నాము. (ప్రకటన 20:1-3) నేరమునుగూర్చిన భయము మరియు దాని పీడితులు అనుభవించిన బాధ అతి త్వరలో గతించిన సంగతులైయుండునని తెలిసికొనుట ఎంత ఉల్లసంగా ఉండును!

అయితే పునరుత్థానమందు భూమిపై తిరిగి జీవమునకురానైయున్న లక్షలాదిమంది విషయమేమిటి? (అపొస్తలులకార్యములు 24:15) తాము మరణించకమునుపు ఉన్నటువంటి వ్యక్తిత్వము మరియు మార్గములో మరలా కొనసాగితే మరొక క్రొత్త నేరతరంగమును వారు ఉత్పన్నముచేయరా? దాని విషయంలో భయపడనవసరములేదు. ఒకదొంగతో యేసు పునరుత్థానమునుగూర్చి వాగ్థానము చేసి యిట్లనెను.: “నీవు నాతోకూడా పరదైసులో ఉందువని నిజముగా నేడు నేను నీతో చెప్పుచున్నాను.” (లూకా 23:43, NW) కనుక పునరుత్థానమగువారు నిశ్చయంగా మార్పులు చేసికొనవలెనని యిది చూపుచున్నది; లేనియెడల నూతనలోకము పరదైసు కాజాలదు.

రాటుదేలిన నేరస్థులు సహితం ఎట్టి సమస్యలు సృష్టించకుండా సమాజములో స్థిరపడాలంటే మార్పుచేసికొనవలసియున్నది, గనుక, దేవుని రాజ్యములో జనులు చట్టమునకు బద్ధులైయుండునట్లు విస్తృతమైన విద్యాకార్యక్రమము వారికి సహాయముచేయును. (ప్రకటన 20:12, 13) దేవునిశాసనములకు విధేయులగు పరదైసు నివాసులతో కూడియుందుమనే నిశ్చయమగు ప్రతిఫలంతో పునరుత్థానులగువారు సక్రమంగా నడుపబడే ఆర్థిక పరిస్థితులను అనుభవించగలరు. (యెషయా 65:21-23) న్యాయమైన పాలకులుందురు, చెడుపనులు చేయుటలో కొనసాగేవారు జీవమును కోల్పోతారు. (యెషయా 32:1; 65:20) కనుక, చివరకు నేరము అంతమగునని నమ్ముటకు కావలసినంత హేతువున్నది.

నేరములతో నిండియున్న లోకంలో మనమింకా నివసించుచున్నను, తన నమ్మకమైన సేవకులకు పరదైసునందు పరిపూర్ణమైన జీవము ప్రతిఫలంగా యిస్తానని వాగ్థానముచేసిన యెహోవాయందు నీవు నమ్మకమును నిశ్చింతగా ప్రదర్శించవచ్చును. యెహోవా సాక్షులు అందించుచున్న ఉచిత గృహ బైబిలు పఠనమును పొందుటద్వారా యిప్పుడు ఆలాగుచేయుము. (యోహాను 17:3) ఈసారి మీరువారిని కలిసినప్పుడు ఎక్కువ వివరముల కొరకు ఎందుకు అడుగకూడదు? లేదా ఈ పత్రిక రెండవపేజిలో చూపబడిన చిరునామాలలో మీకు సమీపమైన దానికి వ్రాయవచ్చును. అది నిశ్చయంగా విలువైన ప్రయాస, ఎందుకంటే నేరముయొక్క అంతము యిప్పుడు సమీపంగా ఉన్నది! (w89 8⁄15)

[5వ పేజీలోని చిత్రాలు]

జక్కయ్య విశ్వాసము తాను అన్యాయముగా సంపాదించిన దానిని తిరిగి యిచ్చివేయుటకు పురికొల్పినది

[7వ పేజీలోని చిత్రాలు]

చట్టబద్ధులు కావలయునని దేవునిరాజ్యనివాసులకు ఒక విద్యాకార్యక్రమము బోధించును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి