కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 12/1 పేజీలు 3-4
  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • పోలీసులు వారి భవిష్యత్తు ఏమిటి?
    తేజరిల్లు!—2002
  • అరాచకత్వ లోకములో నేరమును ఎదుర్కొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 12/1 పేజీలు 3-4

ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?

“ఎక్కువ నేరములు ఆస్తుల విషయంలో సంభవిస్తున్నాయి,” అని ఒక బ్రిటీషు ప్రభుత్వ బ్రోషూరు వక్కాణించుచున్నది. అయినను ఆదేశంలో ప్రజలపై క్రూరమైన నేరములు, యితర అన్ని అపరాధములలో అవి 5 శాతమే అయినప్పటికిని “అత్యంత వేగంగా పెరుగుచున్ననేరమని” పేర్కొనబడెను.

ప్రపంచవ్యాప్తముగా నేరము ఎలా పైకెగయుచున్నదో ఈ పరిస్థితి అద్దం పట్టుచున్నది. దారిమళ్లించుట, సాయుధదోపిడీ, మానభంగము మరియితర విధములైన హింసాత్మక చర్యలు, హింసాయుతముకాని యితర నేర రిపోర్టులకంటె తరచు అధిక అవధానమును పొందుచు ప్రపంచవార్తలలో క్రమంతప్పకుండా ప్రచురించబడుచున్నవి. అట్లయితే, నీవు, నీ ఆస్తులు రెండును నేరమునకు గురికావచ్చునేమో. ఎందుకు? ప్రజలు నేరస్థులగునట్లు ఏమి పురికొల్పుచున్నది?

అనేక నేరస్థులు అవకాశవాదులు. తత్ఫలితంగా, తాము ఇరుగుపొరుగునందు ఏమి సంభవిస్తున్నదో తెలుసుకొనుటలో మరింత అప్రమత్తంగా ఉండుడని ప్రోత్సహించుటద్వారా నేరతరంగములను త్రిప్పికొట్టుటకు అధికారులు ప్రయత్నించుచున్నారు. నేరస్థుల ఆగడాలను అరికట్టే నిమిత్తము కృషిచేయుటకు అట్టి పథకాలను ప్రయోగించినను, ప్రజలను నేరస్థులుకాకుండా ఆపగల్గుచున్నవా? లేదు.

నేరప్రవృత్తిని గూర్చి ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంది. ఆసక్తికరంగా దేవుని వాక్యమైన బైబిలు, నయవంచనతో మాట్లాడు యౌవనులను గూర్చి హెచ్చరించుచున్నప్పుడు నేరస్థుల ఆలోచన ఏలాగుండునో చూపుచున్నది: “రండి; చంపడాన్కి ఎవరినొకరిని వెదుకుదాం! పరిహాసానికి కొంతమంది అమాయకులపై దాడిచేద్దాం! మనంవారిని కనుగొన్నప్పుడు వారు సజీవంగా మరియు సంతోషంగా ఉండవచ్చు కానివారిపై మనము పడినప్పుడు వారు చచ్చెదరు! సకలవిధములైన సంపద మనము కనుగొంటాము, దోపుడు సొమ్ముతో మనయిండ్లను నింపుకొందము! రండి, మాతోచేరండి, మనము దోచుకున్న దానిని మనమంతా పంచుకొందము!” (సామెతలు 1:11-14; టుడేస్‌ ఇంగ్లీషు వర్షన్‌) అవును, అత్యాశ, లోభత్వము, వస్తుసంపదపైగల కోరిక నేరములను పెంపొందించును.

మాదక ద్రవ్యముల అలవాటు మరియు మానవునికి కావలసినది సౌఖ్యమే అని బోధించు మతము (హిడోనిజమ్‌) కూడా ఈ 20వ శతాబ్దమందలి అనేకుల ఆలోచనలను యేలుచున్నవి. అధికఖర్చుల నిమిత్తము డబ్బు అవసరం, ఇతరులను గాయపర్చియైనా, లేక ప్రాణంతీసియైన సరే డబ్బు సంపాదించాలి. ఈ ‘అపాయకరమైన కాలములలో’ అనేకుల “పాదములు నేరముచేయుటకై పరుగులెత్తుచు, రక్తముచిందించుటకై వారు త్వరపడుచున్నారు,” అనునది నిజమే.—2 తిమోతి 3:1, 3, 4; సామెతలు 1:16, ది న ఇంగ్లీష్‌ బైబిల్‌.

నేరమనేది “అతిముఖ్యంగా నైతికత్వమునకు వ్యతిరేకంగా నిలిచే గొప్ప అపరాధము” అని వెబ్‌స్టర్స్‌ నైన్త్‌ న్యూకాలేజియేట్‌ డిక్షనరీ చెప్పుచున్నది. నైతికత విచ్ఛిన్నమైపోయిన తరములో మనము నివసిస్తున్నాము. “అంధకారమైన మనస్సుగలవారై తమ హృదయకాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానముచేత దేవుని వలనకలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతననుసరించి నడుచుకొనుచు అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతాము అప్పగించుకొనినవారిని” గూర్చి జాగ్రత్తగా ఉండుడని ఎఫెసీ క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు హెచ్చరించెను. అలాగే మనమును నేడు జాగ్రత్త వహించవలసియున్నాము.—ఎఫెసీయులు 4:17-19.

పైశాచిక వీడియో చిత్రములను విచ్చలవిడిగా అనుమతించడం, యుద్ధాన్ని ప్రశంసించడం, కామవిలాసములను స్వార్థబుద్ధితో అపేక్షించడం ఇవన్ని కొందరిని నేరస్థులగునట్లు పురికొల్పుచు, కొంతమంది అమాయకులను బలిగొనడంలేదా? అయితే ఈ నేర ప్రవృత్తి వలలో మరొక మూలము ఉన్నది. అదేమిటి?

అది అపవాదియైన సాతాను. అతని కోపము ప్రస్తుత లోకలక్షణమగు అవివేకమైన హింస, నేరములనే అగ్నిని రేపుచున్నది. (1 యోహాను 5:19; ప్రకటన 12:12) మనుష్యులందరిని నిజదేవుడైన యెహోవానుండి మళ్లించుటయే అతని ధ్యేయము. అనేకుల విషయములో అతడు విజయము పొందియున్నను, దేవునియొక్క నిజసేవకుల యథార్థతను చెడగొట్టుటలో అతడు విఫలుడగునని బైబిలు ప్రవచనాత్మకంగా బయల్పరచుచున్నది. చివరకు, సాతానే నిర్మూలముచేయబడును. అయితే, సాతాను తొలగించబడినప్పుడు, నేరమునకు అంతముకల్గునా? నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నదా? (w89 8⁄15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి