“ఘనతకు ముందు వినయము”
చేయని నేరమునకు ఐగుప్తు చెఱసాలలో ఒకయౌవనుడు వేయబడెను. అతడు చాలా అవమానము పొంది, చెఱసాలనుంచి బయటకు వచ్చుటకు ఎట్టి ఆశయు లేక యుండెను. అట్టి స్థితిలో అతడు ఫరోముందు నిలువబడవలెనని ఆజ్ఞాపింపబడెను. చెఱసాల బంట్రవుతులు అతనిని త్వరగా బయటకు తెచ్చిరి. అతని గడ్డముగీచి, అతని వస్త్రములు మార్చి ఆతరువాత రాజుముందు నిలువబెట్టిరి.
యోసేపు కొరకు ఒక ఆశ్చర్యమును కలిగించు విషయము ఎదురుచూచుచుండెను. యెహోవా సహాయముతో ఫరోకు కలిగిన రెండు కలలకు యోసేపు ఖచ్చితముగా అర్థము చెప్పగలిగెను. అందుకు ఫరో “చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నాను.” (ఆదికాండము 41:41) ఎంతటి నమ్మశక్యము కాని అనుభవము—ఒక్కరోజులోనే చెఱసాలనుంచి రాజసౌధమునకు! ఆ తరువాత దైవావేశ పూరితుడైన సొలొమోను వ్రాసిన దానినిబట్టి యోసేపు అనుభవమును మనము గమనింపవచ్చును. “అట్టివాడు దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నెందుటకు చెఱసాలలోనుండి బయలు వెళ్లును.” సరియైన విధముగా సొలొమోను రెండుసార్లు ఇట్లు వ్రాసెను “ఘనతకు ముందు వినయముండును.—ప్రసంగి 4:14; సామెతలు 15:33; 18:12.
ఆ దైవిక సత్యమునుండి ప్రయోజనము పొందుటకు నీకై నీవు ఇట్లు ప్రశ్నించుకొనుము: అవమానకరమైన పరిస్థితుల అనుభవములో యోసేపును కాపాడిన దేమి? అబద్ధనేరారోపణతో జైలులో వేయబడ్డ విశ్వాసముగల యెహోవా సేవకుడు అక్కడ ఎట్లు తట్టుకొనగలిగెను? యోసేపుకొరకు యెహోవా ఎట్టి ఘనతను తన మనస్సులో కలిగియుండెను? అప్పటినుండి శతాబ్ధముల తరబడి విశ్వాసముతో మరియు ధైర్యముతో శ్రమలను అవమానములను భరించిన వారికెట్టి ఘనత ఎదురుచూచుచున్నది? వీటన్నిటికి మించి, మనము అవమానములను భరించునపుడు సమదృష్టిగల దృక్పథమును కలిగియుండుటకు మనకు సహాయపడునదేమి?
తన తల్లిదండ్రులతో సహా అతని అన్నదమ్ములు తనకు “వంగి నమస్కరించుదురు” అని తెలుపు గత రెండు ప్రవచనాత్మక కలలపై యోసేపు తప్పకుండా తరచుగా ధ్యానము చేసే ఉంటాడు. నిజానికి మొదటి కల వినిన తరువాత అతని సహోదరులు ఇట్లనిరి: “నీవు మామీద రాజువగుదువా?”—ఆదికాండము 37:8-10.
ఈర్ష్యగల యోసేపు సహోదరులు అతనిని హత్యచేసినంతగా చేసిరి. కాని యెహోవా నడిపింపు క్రింద ఆ 17 సంవత్సరముల బాలుడు ప్రయాణించు వర్తకులకు అమ్మబడెను. ఆ తదుపరి వారు ఫరో అంగ రక్షకుల ప్రధానియైన పోతీఫరుకు అతనిని అమ్మిరి.
క్రమేణా, యోసేపు పోతీఫరు గృహమంతటిమీద నిర్వాహకుడాయెను. అయితే పోతీఫరు భార్య అందమైన ఈ యౌవనస్థుని మీద కన్నువేసి బలవంతముచేసెను. అయినను యోసేపు యెహోవాకు విధేయుడై తప్పించుకొనెను. కపటియైన ఆ భార్య యోసేపు తనను బలాత్కారముచేయబోయెనని అబద్ధమాడినందువలన పోతీఫరు ఆమాటలునమ్మి ఏ పాపమెరుగని యోసేపును చెఱసాలలో వేయించెను.
అయినను అతడు యెహోవాకు విధేయుడైయుండెను. ఇంతకు మునుపు ప్రస్తావించినట్లుగా అతడు కలలబావమునుచెప్పుటకు ఫరోవద్దకు తీసికొని పోబడెను. ఆ తరువాత ఫరో ఐగుప్తుదేశ ఆహార సరఫరాను సంస్థీకరించుటకు యోసేపును నియమించెను. క్షామము కానానుకు విస్తరించినపుడు యోసేపు సహోదరులు తమ కుటుంబముల కొరకు ఆహారము నిమిత్తము నిజముగా వారు యోసేపుకు నమస్కరించిరి.
‘వినయమునుండి ఘనతకు’ వెళ్లిన ఇతరులు
దైవిక సత్యమైన “ఘనతకు ముందు వినయము”నకు తన జీవితమును మలచుకొన్న మరొక విశ్వసనీయ యెహోవాసేవకుడు మోషే. బోగబాగ్యములతోకూడిన ఫరో రాజసౌధమునందు పెరిగిన మోషేకు ఉజ్వలమైన భవిష్యత్తు యున్నది. అప్పటి పరిస్థితులు దుఃఖకరముగా మారినవి. యెహోవాయెడల విశ్వాసము మరియు తనప్రజల యెడల గల ప్రేమతో చేసినపని వలన ఫరో కోపమునకు గురియై తన ప్రాణముకొరకు పారిపోవలసివచ్చెను. ఒంటరిగానే మిద్యానువరకు అతడు ప్రయాణముచేసెను. తన మామయైన ఇత్రోకు సేవచేయుచు 40 సంవత్సరములు వినయమును కనపరచి సాధారణ గొర్రెల కాపరివలె జీవించెను. ఈ 40 సంవత్సరములలో తన వ్యక్తిత్వమును వినయముతో మలచుకొనుటకు మరియు అతనికై రాబోవు విషయములను ఆలోచించి ఆవిధంగా వినయస్తునిగా ఏర్పాటుచేసిన యెహోవా విధానములు ఎంత ప్రోత్సాహకరముగా నున్నవి!
అప్పుడు ఘనత వచ్చినది. తన ప్రజలను ఐగుప్తులోనుండి బయటకు తెచ్చుటకు ఫరోవద్దకు తన ప్రతినిధిగా యెహోవా మోషేను నియమించెను. పదితెగుళ్లను తెచ్చుటలో తాను ప్రత్యక్షంగా పనిచేసి ఆతరువాత ఎర్రసముద్రము గుండా ఇశ్రాయేలీయులను నడిపించిన మోషేకు ఎంతటి ఘనమైన ఆధిక్యత లభించినది! తరువాత మోషే సీనాయికొండమీద యెహోవానుండి ధర్మశాస్త్రమును పొందెను. అతను దిగివచ్చినపుడు ప్రజలు “ముఖముమీద ప్రకాశించుచున్న మహిమవలన ప్రజలు మోషే ముఖమును తేరిచూడ లేక పోయిరి.”—2 కొరింథీయులు 3:7.
మరలా, తూర్పు దేశస్థులలో అతి ప్రముఖుడైన యోబును గూర్చి ఆలోచించుడి. అతడు “నిందారహితుడును న్యాయవంతుడును దేవునియందు భయభక్తులు గలిగి చెడుతనమును విసర్జించిన వాడు.” (యోబు 1:2, 3, 8) తదుపరి, హఠాత్తుగా అతను తన పదిమంది పిల్లలను, వేలకొలదిగానున్న గొఱ్ఱెలను ఒంటెలను, పశువులను, ఆడుగాడిదలను పోగొట్టుకొనెను.
అంతేకాదు. యోబునకు ఒళ్లంతా బాధాకరమైన పుండ్లువచ్చి భౌతికముగా చాలా అసహ్యపడువ్యక్తిగా ఆయెను. అతని స్వంత బార్యే అతనిని అసహ్యించుకొనుచు “నీవింకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్ము!” అనెను. (యోబు 2:9) యోబు చాలా కఠినముగా శోధింపబడి అవమానపరచబడెను. అయినను అతనికి పరలోకములో యెహోవాకు మరియు ప్రధాన తిరుగుబాటు దారుడు అయిన సాతానుకు మధ్య జరిగిన వివాదము విషయము బొత్తిగా తెలియదు. యోబుయొక్క ముగ్గురు “స్నేహితులు” చేసిన దీర్ఘ-చర్చలవలన పరిస్థితి ఏ మాత్రమును మెరుగుపడలేదు. ఏమైనను, యోబు తన యదార్ధతను కాపాడుకొనెను. తన కంటె బాగాచిన్నవాడైన—ఎలీహు యొక్క జ్ఞానయుక్త సలహాను వినయముతో అంగీకరించెను.—యోబు 32:4.
యోబుకు ప్రతిఫలము లభించినదా? అవును. యెహోవా యోబునకు రెండింతలు పశుగణములను, ఏడుగురు కుమారులను, ఆ దేశమంతటిలో సౌందర్యవంతులైన ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించెను! యోబు వినయమునుండి ఎంతటిఘనత వచ్చినది! “ఘనతకు ముందు వినయముండుట”—ఎంత నిజము—యోబు 42:12-15.
వివిధరకముల ఘనత
స్పష్టముగా అనేకరకములైన ఘనతలున్నవి—స్త్రీ కేశసంపద ఘనతనుండి సీనాయికొండనుండి దిగివచ్చిన మోషే ముఖమువరకు ఎన్నోవిధముల ఘనతలున్నవి. (1 కొరింథీయులు 11:15; 2 కొరింథీయులు 3:7) రంగురంగుల సూర్యాస్తమయము మరియు నక్షత్రములకు మరొక ఘనత కలదు.—1 కొరింథీయులు 15:41.
“ఘనత” అను మాట బైబిలులో వందలకొలది రకములుగా వాడబడినది. ఈ వచనాలన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాటి సందర్భమును బట్టి యెహోవాయే సమస్తమహిమకు మూలమని స్పష్టమగుచున్నది. ఆయన విశ్వాస సేవకులు మరియు సృష్టిలో ఆయన చేసిన అద్భుత కార్యములు ఆయన మహిమను వేర్వేరు స్థాయిలో ఎన్నోవిధములుగా ప్రతిబింబించుచున్నవి.
మన 20వ శతాబ్దములో మహిమాన్వితమైన పరలోక జీవమును పొందుటకు ఎంతో అవమానాన్ని శ్రమలను అనుభవించిన అనేకమంది యొక్క రుజువులు మనవద్ద ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధమునందు తప్పు నేరారోపణతో న్యూయార్కులో బ్రూక్లిన్ నందలి వాచ్‌టవర్ సొసైటికి చెందిన ప్రముఖ సభ్యులకు 20 సం.లు జైలు శిక్ష విధించిరి. అదేసమయములో శ్రమలు అనేక ప్రదేశములలో ప్రజ్వరిల్లినవి. ఉదాహరణకు జె.బి. సైబెన్‌లిస్టు అకారణంగా వారెంటు కూడ లేక జైలులో నిర్భంధించబడి మూడు పాడైన మొక్క జొన్నరొట్టెముక్కల కంటె మరే ఆహారమియ్యబడక బాధింపబడెను. ఆ తరువాత ఒక పెద్ద గుంపు అతనిని జైలు బయటకు తెచ్చి వస్త్ర హీనున్నిచేసి, వేడివేడి తారుమీద పోసి, ఇనుపతీగ చివరగల గుర్రపు బండి చెండ్రకోలతో కొట్టిరి. ఒక సందర్భములో హింసలను అతని మీదకు తెచ్చు అధికారి ఇట్లనెను: “నీ బైబిలుతో సహా నీవుచావు. నీవు విరిగిన నడుముతో నరకముతో ప్రవేశింపవలసియున్నది. నీవు ఉరి తీయబడవలసియున్నది.”
రెండవ ప్రపంచ యుద్ధకాలములో నాజీ కాన్‌సంట్రేషన్ క్యాంపులలలో కొంతమంది యెహోవా విశ్వసనీయ సేవకులు చెప్పనలవికాని విధంగా బాధింపబడిరి. వారిలో ఒకడు మార్టిన్ పోయిట్ జింగర్. ఇతడు అభిషక్తుడై యుండి ఈ బాధలనుండి తప్పింపబడినవాడై యెహోవాసాక్షుల గవర్నింగ్ బాడి సభ్యుడయ్యాడు. ఈయన డకావ్‌ను “దయ్యముల పిచ్చి ఇల్లుగా” వర్ణించెను. మౌతాసెన్ అను క్యాంపులో “యెహోవాయెడల నున్న మా విశ్వాసమును పగులగొట్టుటకు గెస్టపో ఎన్నోవిధములుగా ప్రయత్నించిరి. ఆకలితో బాధించు ఆహారము, కపట సహోదరత్వము, కఠినహింస, ఇనుప చట్రంలో ప్రతిదినము నిలువబెట్టుట, కాళ్లు చేతులు వెనుకకుకట్టి పది అడుగులు దూలమునకు వ్రేలాడదీయుట చెండ్రకోలతో కొట్టుట ఇంకా అనేక విధములుగా ప్రయత్నించిరి.”
విశ్వాస క్రైస్తవులను తట్టుకొనునట్లు చేసినదేమి?
అటువంటి ఖండింపదగిన నీచమైన పరిస్థితులలో తమ యదార్థతను కాపాడుకొనువారికి వేచియున్న మహిమన్వితమైనగొప్ప భవిష్యత్తులోగల నిరీక్షణ వారు శ్రమలను సహించుటకు తోడ్పడినది. ‘చిన్నమంద’కు చెందిన అభిషక్త సాక్షులకు ఇది పరలోక వారసత్వమైయున్నది. (లూకా 12:32) ఒక ప్రత్యేక మహిమ ఇతర విశ్వాసమానవులకు వేచియున్నది. వారిలో కొందరు యోసేపు, మోషే. వీరిని గూర్చి హెబ్రీ 11వ అధ్యాయములో చెప్పబడినది. దయచేసి 32-40 వచనముల వరకు చదివి వారిలో కొందరు పొందిన శ్రమలను ధ్యానించండి. ఇంకా ‘ఒక గొప్పసమూహము’ నేడు భూమిమీద యెహోవాను సేవించుచున్నది. (ప్రక 7:9, 15) వారికి ఎట్టి భవిష్యత్తు గలదు?
వారికి సమృద్ధియైన భవిష్యత్తు ఎదురుచూచుచున్నది. యేసుక్రీస్తు క్రిందనున్న పరలోక ప్రభుత్వమునకు భూమి మీదను ప్రతినిధులుందురు. వీరు ప్రకటన 20:1 లో వ్రాయబడిన గ్రంథపు చుట్టలలో వ్రాయబడిన సూచనలను అమలుపరచుదురు. ఘనతగల పరదైసు భూమిలో పునరుత్థానము చెందినవారితో సహా లెక్కించలేనంత విశ్వసనీయ విధేయతగల మానవులతోపాటు వారు రాజులవలెకాక “భూమియందటనున్న అధికారులుగా” మహిమగల ఆధిక్యత గలిగి నిరంతము జీవించెదరు.—కీర్తన 45:16.
నేడు లక్షలకొలది ప్రజలు తమ అబద్ధమతమును విడచి యెహోవాసాక్షుల పనియైన ఇంటింటి సేవలో సంతోషముతో పాల్గెనుట ద్వారా తమ విధేయతను ప్రదర్శించుచున్నారు. వీరిలో అనేకమంది తమ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో దూషింపబడియు సత్యారాధనకు కట్టుబడియున్నారు. సత్యదేవుడైన యెహోవాను సేవించుటకు వినయముతో తమ మార్గములను సరిచేసికొని ఇవ్వబడు శిక్షణను అంగీకరించుచున్నారు. వారి నిరీక్షణ పరదైసునందున్నది. అప్పుడు “సముద్రము జలముతో నిండియుండునట్లు భూమి యెహోవా మహోత్సవమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—హబక్కూకు 2:14.
నేటి దినములు యెహోవా ప్రజలను పరీక్షించునవైయున్నవి. మనము పూర్తిగా పరదేశములోనున్న క్రొత్త వ్యక్తులముగా నున్నాము. సత్యారాధనకు, అబద్ధారాధనకు మధ్యగల వ్యత్యాసము పెరిగిపోవుచున్నది. మనమందరము ఎంతోకొంత శ్రమలననుభవింపక తప్పదు. యేసుక్రీస్తు విషయములో తన ముందున్న సంతోషము ఆయనకు బలముచేకూర్చి ఎట్లు ఆదరణగా నిలచినదో అట్లే మనముకూడ చివరకు జరుగబోవునది గుర్తుంచుకొనుచు శ్రమలను సహింపవలయును.
బైబిలిట్లు సలహానిచ్చుచున్నది: “యెహోవాదృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” (యాకోబు 4:10) మీకెప్పుడైనా తీవ్రమైన శోధనవచ్చినపుడు ఈమాటలను తలంచుడి “ఘనతకు ముందు వినయముండును.” ఇది కూడ గుర్తుంచుకొనండి యెహోవా ఎన్నటికి విఫలుడు కాడు! (w89 6/15)