వెలలేని నిధులను మీరు కనుగొనగలరు!
“నీవు ఏమైనా చూడగలుగుచున్నావా?” అని సంపన్నుడైన ఆంగ్లేయుడు అడిగాడు. “అవును, అద్భుతమైనవి” అని ఐగుప్తు పరిశోధకుడు ప్రత్యుత్తరమిచ్చాడు. అది 1922, హోవర్డ్‌కార్టర్ ఐగుప్తురాజుల లోయలో ఫరో టూటంఖమెన్‌యొక్క సమాధిలోనికి అప్పుడే తరిచిచూచాడు. కార్టర్ మాటలు ప్రేరణతో నిండిపోయెను:
“వెలుతురుకు నా కళ్లు క్రమేపి అలవాటుపడగా, పొగవంటి దానితో నింపబడిన గదిలోని వింతజంతువులు, విగ్రహములు మరియు బంగారము నిదానముగా కనిపించినవి. ఎటుచూచినా బంగారముయొక్క మెరుపే. ఒక్కక్షణము నాప్రక్కన నిలుచున్న వారికైతే నిత్యత్వం అనిపించవచ్చు—నేను నిర్ఘాంతపోయి మూగవాడనై పోయాను. . .ఇటువంటి దానిని గూర్చి మేము ఎన్నడు కలకూడా కనలేదు, గదినిండా—ఒక మ్యూజియంనకు సరిపడునట్లు అన్పించే—ప్రతిమలు.” కార్టర్ ఒప్పుకున్నదేమంటే: “నిధికొరకు వెదికేవానికి. . .ఇది నమ్మశక్యముకాని నిజము.”
ఆ పరిశోధన 3,000 సంవత్సరములకంటే పూర్వము దాచబడిన నమ్మలేనంత నిధులను వెలికి తీసినది. అయితే అంతకంటే మహత్తైన నిధి అన్వేషణలో మనము నిమగ్నులము కావలెనని దేవుడు కోరుచున్నాడు. అది బంగారము, వెండి, రత్నములను వెదకుట కంటే అత్యంత ప్రతిఫలదాయకమైన అన్వేషణ. ఆ నిధి అన్వేషణ దైవజ్ఞానము కొరకు, మరియు దానియొక్క మిక్కిలి విలువైన ఉపయుక్తములలో ఒకటి నిత్యజీవము.—యోహాను 17:3.
ప్రయత్నము అవసరము
ఒక పురావస్తు ప్రదేశమును త్రవ్వాలంటే గొప్ప ప్రయత్నము అవసరము. దాచబడిన, పాతిపెట్టబడిన, లేక కూరుకు పోయిన నిధిని వెదకుటకు అరణ్యప్రాంతములో త్రవ్వడం లేదా అపాయకరమైన నీటిలోనికి దిగడం అంత సులభంకాదు. అయితే ఉత్సుకతతో నిధిని అన్వేషించువారు సంతోషముతో అట్టి ప్రయత్నములను చేస్తారు. తీవ్రమైన వ్యతిరేకతలను అసాధ్యమైనవిగా కనిపించు ఆటంకములను కష్టముతో సాధించుట తరచు వారి అనుభవము. అట్లయితే, దైవజ్ఞానము కొరకు అన్వేషించుటలో అంతకన్న ఎక్కువ ప్రయత్నము చేయుట ప్రయోజనముకాదా?
బైబిలును మరియు రత్నములవంటి జ్ఞానమును కనుగొనుటలో మనకు సహాయపడుటకొరకు సిద్ధపరచబడిన నిజక్రైస్తవ సాహిత్యములను పఠించుటకు తగు ప్రయత్నము చేసిన యెడల మూల్యములేని నిధులను మనము కనుగొందుము. కొనసాగే ప్రయత్నము యుక్తము. ద్రవ్యనిధులకొరకు మనము త్రవ్వడము ప్రారంభించి కేవలము పైపైనే గీరినమీదట విడిచిపెట్టినట్లయితే మనము ధనికులము కాజాలము. ఆలాగే ఆత్మీయనిధులకొరకు మనము త్రవ్వుట మొదలుపెట్టి, దానిని కొనసాగించుట చాలా శ్రమతో కూడినదని తలంచి వెంటనే విడిచిన యెడలకూడ అదే జరుగును. “పైనుండి వచ్చు జ్ఞానము” దానిని పొందడానికి ప్రయాసపడువారికి లభించును. (యాకోబు 3:17) మూల్యములేని నిధులగు దైవిక జ్ఞానమును కనుగొనుటకు అవసరమగు ప్రయత్నమును నీవు చేయవద్దా? (w89 3⁄15)
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover and page 3 photo: K. Scholz/H. Armstrong Roberts