కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 5/1 పేజీలు 5-7
  • మీరు క్రొత్త తలంపులను అంగీకరింతురా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు క్రొత్త తలంపులను అంగీకరింతురా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బెరయవారి మాదిరి
  • ఎంపికచేసుకొనుడి!
  • క్రొత్త తలంపుల నెందుకంగీకరించవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • జపాన్‌లోని సాక్షులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ బహుమతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • బైబిలు ఎందుకు చదవాలి?
    తేజరిల్లు!—1992
  • ‘లేఖనాలు అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ప్రయత్నించాడు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 5/1 పేజీలు 5-7

మీరు క్రొత్త తలంపులను అంగీకరింతురా?

కొంతమంది ప్రజలు ఏక్రొత్త తలంపులకైనను తమ మనసులను తెఱువరు. తమ భావములకు అవి వేరుగా ఉండవచ్చును గనుక వారు తిరస్కరింపవచ్చును. ఉదాహరణకు, డెన్‌మార్కులోనున్న ఒక స్త్రీ ‘జెమ్మెట్‌’ అను వారపత్రికకు వ్రాస్తూ ఇట్లనెను, “మేము పదేపదే యెహోవాసాక్షులచేత మా గుమ్మములయొద్ద వేటాడబడుచున్నాము. వారు నన్ను బహుగా చిరాకు పెట్టుచున్నారుగాని వారిని ఎలా వదిలించుకొనవలెనో నాకు తోచుటలేదు. . .వారి పీడను చట్టము నిషేధించలేదా?”

19వ శతాబ్దంలో పాశ్చాత్యులు జపాను దేశస్థుల తలుపు తట్టడంకూడా వారికి “పీడగానే” తోచింది. వారిలో అనేకమంది పిలువకుండా ఇంటికి వచ్చినవారితో గల పని పనికిమాలినదిగాను, కొన్నిసార్లు హానికరమైనదిగాను భావించేవారు. ఒక లౌకిక సామెత చెప్పునదేమనగా “అనుమానం చీకటిలో పెనుభూతాల్ని సృష్టించును.” జపాను దేశస్థులు తమచిత్రపటములలో పెర్రి బొమ్మలను వేసిన విధానము వారి మానసిక ప్రవృత్తిని సూచించుచున్నది. లభ్యమగు సుమారు 50 బొమ్మలలో 2 లేక 3 మాత్రమే అతనిని యు.యస్‌. నౌకాదళాధిపతిగా వేయడం జరిగింది. మిగతా బొమ్మలన్నిటిలో అతనిని పొడుగుముక్కు ఉన్న దయ్యముగనో, లేక తెల్లముఖముగల రాక్షసుడుగానో చిత్రీకరించారు.

వారిదేశము మిగతా ప్రపంచమునకు తెఱువబడినపుడు, జపానీయులలో నిష్కపటులైన అనేకమంది విదేశీయులు క్రూరులు కారని గ్రహించిరి. మొదటగా సంయుక్తరాష్ట్రములను సందర్శించినపుడు పాశ్చాత్యసంస్కృతిని ప్రత్యక్షంగా చూచిన జపానుబృందములోని కొంతమందికి కనులపొరలు రాలెను. అమెరికన్లు ఎట్లు అమర్యాదస్తులో జపాను దేశ దృష్టితో చూచిన ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేసెడివారు. కాని యువతరము మాత్రము నూతన సంస్కృతిని సమదృష్టితో న్యాయముగా బేరీజు వేసెను.

ఒక ఉన్నతాధికారి క్రిందపనిచేయు 19సం.ల యవనస్థుడు తరువాత ఇట్లు వ్రాయుచున్నాడు. “70 మందిగల జపాను బృందములో చాలామంది [అమెరికన్లను] ద్వేషించినవారే. ఏమైనప్పటికిని, అసలు పరిస్థితిని వారుచూచినప్పుడు వారిలో చాలామంది తాము కలిగియున్న పొరపాటు భావములకు విచారపడిరి. విదేశీయులను కుక్కలుగాను గుఱ్ఱములుగాను తలంచి అవమానపరచటం వారిమీద మనము క్రూరులుగాను , దుర్నీతిపరులుగాను గెలవటమే.” ఈ యౌవనస్థునివలె మీరుకూడ నిష్పక్షపాత వైఖరితో క్రొత్తతలంపులకు మీమనస్సులను తెఱచి ఉంచుదురా?

బెరయవారి మాదిరి

సామాన్యశకము మొదటి శతాబ్దములో అనేకమంది యూదులు క్రైస్తవబోధలయెడల హేతువులేని పక్షపాతవైఖరి కలిగియుండిరి. కొన్నివిషయములలో దానిని దురభిమానముతో బయటప్రపంచమునకు వేరై ఒంటరిగానున్న జపానుతో పోల్చవచ్చును. “అంతటను (క్రైస్తవత్వమునకు) ఆపేక్షణ చేయుచున్నామని” పురాతన రోములోని యూదులు చెప్పుకొనిరి. (అ.కార్యములు 28:22) అయితే థెస్సలొనీకయ పట్టణములోని కొంతమంది క్రైస్తవులను గూర్చి పక్షపాతబుద్ధిగల యూదులు అరచినదేమనగా “భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడకు కూడ వచ్చియున్నారు”—అ.కార్యములు 17:6.

అయినప్పటికిని, కొంతమంది పక్షపాతవైఖరిని వీడిచూచు ప్రజలున్నారు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు మరియు తన సహకారియైన సీలయు బెరయ నివాసులకు సువార్తను ప్రకటించినపుడు వారెట్లు ప్రతిస్పదించిరి? “వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటే ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అ.కార్యములు 17:11) మీరును బెరయవారివలె “ఘనమైనమనసు” కలిగియున్నారా?

దయచేసి మసాజి విషయము గమనించండి. ఒకానొకప్పుడు తాను బలమైన శతృత్వమును క్రైస్తవత్వము యెడల కలిగియుండెను. జపానును మిగతా ప్రపంచమునకు తెఱవకుండా అడ్డుకున్న వేర్పాటు వాదువలె అతడుండెను. తన భార్య సచికో బైబిలు పఠనము ప్రారంభించినపుడు అతడు బహు తీవ్రముగా వ్యతిరేకించెను. అతడు తన కుటుంబమంతటిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనేంతవరకు తలంచెను. అతని దౌర్జన్యమువలన అతని కుటుంబము ఉత్తరజపానులోని సచికో యొక్క పెద్దన్న యింటికి పారిపోవలసివచ్చెను.

చివరకు మసాజి తనమనస్సును కొద్దిగాతెఱచి తన భార్య మతమును పరిశీలించుటకు నిర్ణయించుకొనెను. కొంత బైబిలు సాహిత్యములను చదివినతరువాత తనలో కొన్నిమార్పులను చేసికొను ఆవశ్యకతను అతడు గుర్తించెను. అతడు లేఖనములు చదువుచుండగా అతని హింసాత్మక ప్రవృత్తిమారి, దేవుని ఆత్మీయఫలమును ప్రతిబింపజేయునదాయెను. (గలతీ 5:22, 23) సాక్షుల యెడల తానుచేసిన దౌర్జన్యమునకు వారు తన యెడల ప్రతీకారము తీర్చుకొందురేమోయని భయపడి, మసాజి యెహోవాసాక్షులు మీటింగులకు హాజరవుటకు వెనుకాడెను. చివరకు తాను రాజ్యమందిరమును దర్శించినపుడు, తనకివ్వబడిన వెచ్చని ఆహ్వానమునకు ముగ్ధుడై, బాష్పబిందువులను రాల్చెను.

అవును పక్షపాతవైఖరి విడనాడి నూతన తలంపులను పరీక్షించుటకు, మనపరిధిని పెంచి మనకనేక విధములుగా సహాయపడును. అయితే, మనకెదురగు ప్రతినూతన తలంపులను అంగీకరించవలెనని దీని అర్థమా?

ఎంపికచేసుకొనుడి!

జపాను ఒంటరితనము అంతమైనప్పుడు క్రొత్తతలంపులు ప్రవాహమువలె చొచ్చుకువచ్చినవి. కొన్నింటివలన వారు ప్రయోజనము పొందారు కాని మరికొన్ని రాకుండా ఉంటేనే వారు బాగుండేవారు. రెండవప్రపంచయుద్ధము తర్వాత లొంగిపోయిన జపానుగూర్చి యు.యస్‌. జనరల్‌ డగ్లస్‌ మాక్‌ ఆర్థర్‌ చెప్పినదేమనగా “నౌకాదళాధిపతియైన పెర్రియొక్క ఉద్దేశ్యములకు వ్యతిరేకముగా” జపాను పాశ్చాత్యప్రపంచమును గూర్చిన జ్ఞానమును ఒకపరికరముగా హింస మరియు బానిసత్వములకొరకు ఉపయోగించెను. “పశ్చిమదేశాల సలహాదారులననుసరించి జపాను చేపట్టిన మార్గము, దానిని వరుసగా అనేక యుద్ధములు చేయుటకు నడిపించెను.” వీటి అంతము రెండవ ప్రపంచయుద్ధము యొక్క చివరలో రెండు అణుబాంబులను జపాను ప్రాంతములపై వేయుటద్వారా ముగిసెను.

దీనినినుండి మనము నేర్చుకొనగలిగినదేమి? క్రొత్త ఉద్దేశ్యములను అంగీకరించుటలో మనము ఎంపిక చేసికొనవలయును. మనము బెరయలోనున్న వారిని ఈ విధముగా అనుసరించవలెను. “సంగతులు (పౌలు బోధించినవి) ఆలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచువచ్చిరి.” (అ.కార్యములు 17:11) గ్రీకులో “పరిశోధించు” అను పదమునకు వాడబడిన మాటకు అర్థమేమనగా “చట్టపరమైన విధానములోవలె జాగ్రత్తగా మరియు ఖచ్చితముగా చేయు పరిశోధన” (ఎ.టి. రాబర్ట్‌సన్‌ వ్రాసిన వర్డ్‌ పిక్చర్స్‌ ఇన్‌ది న్యూటెస్ట్‌మెంట్‌) మనకు వచ్చిన ప్రతి క్రొత్త తలంపును గ్రుడ్డిగా అనుసరించే బదులు న్యాయము చెప్పుటకుముందు న్యాయాధిపతి ఎట్లు విషయములను పరిశీలించునో అట్లే మనము జాగ్రత్తగా, ఖచ్చితమైన పరిశోధన వాటిపై చేయవలెను.

మనము ఎంపిక చేసికొనుచున్నట్లయితే, ప్రతివిధమైన వెర్రి ఆలోచనకు లేక హానికరమైన తలంపునకు తావివ్వము. ఉదాహరణకు, 1960వ దశాబ్దములో నూతన నైతికత్వముగా చెప్పబడినవి కొంతమందికి ఇష్టపడేంత క్రొత్తతలంపుగా నుండవచ్చును. కానీ జాగ్రత్తగా పరిశీలించినమీదట, అవి హానికల్గించు పాతదుర్నీతే క్రొత్తపేరుతో వచ్చినదని తేలినది. 1920 దశాబ్దములో కూడ ఆర్థికంగా దెబ్బతిన్న జర్మనీలో చాలామందికి నాజి పాలన ప్రేరేపించు క్రొత్తతలంపుగానుండెను. గాని అది ఎంత వేదనను తెచ్చిపెట్టినది!

సంతోషకరమైన విషయమేమనగా, క్రొత్తతలంపులను పరీక్షించుటకు దేవుడు మనకు ఒక గీటురాయిని ఏర్పాటు చేసెను. అది ఆయన ప్రేరేపితవాక్యమగు బైబిలు. దీని మార్గదర్శక సూత్రములను కుటుంబజీవనములో మరియు మానవ సంబంధములలో ఉపయోగించి నట్లయితే నేడు సాంఘికవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు మరియు ఇతర క్షేత్రములలో ప్రావీణ్యులమని చెప్పుకొనెడివారినుండి వచ్చు అనేక నూతనతలంపులను పరీక్షించుట కది మనకు సహాయపడును. (ఎఫెసీయులు 5:21–6:4; కొలస్సి. 3:5-14) దేవునితోను మరియు పొరుగువారితోను గల సంబంధములపై బైబిల్‌ ఇచ్చు సలహా నేడు మతము అనే అంశముపై వ్యాప్తిచెందు అనేక క్రొత్తతలంపులను పరీక్షించిచూచుటకు సహాయపడును. (మార్కు 12:28-31) క్రొత్తతలంపు నిజముగా విలువైనదా కాదా అని నిర్ధారించుటకు మనము ఖచ్చితమైన బైబిల్‌ జ్ఞానమును కలిగి యుండవలెను. అప్పుడే మనము ‘సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టు’ సామర్ధ్యమును కలిగియుందుము. (1 థెస్సలొనీకయులకు 5:21)

యెహోవాసాక్షులు తమ పొరుగువారిని దర్శించి బైబిల్‌ను నేర్చుకొనుటకు ప్రోత్సాహింతురు. తద్వారా వారు క్రొత్తతలంపులను సరైనరీతిలో నిర్ణయించుటకు శక్తిమంతులగుటకు సహాయపడుదురు. అనేక మందికి క్రొత్తగానున్న బైబిల్‌ తలంపులను కూడ సాక్షులు వారికి చూపించుదురు. మనము నివసించుచున్న కాలములను గూర్చిన సత్యము మరియు మానవజాతికి ఎటువంటి భవిష్యత్తు వేచియున్నవనునవి వాటిలోకొన్ని. (మత్తయి 24:3-44; 2 తిమోతి 3:1-5; ప్రకటన 21:3, 4) కనుక యెహోవా సాక్షులు మీయింటికి వచ్చినపుడు ‘ఒంటరి మనస్సు’ను కలిగియుండకుము. దానికిబదులుగా, మీ మనో కవాటములను తెఱచి వారేమి చెప్పుచున్నారో దానిని ఎందుకు వినకూడదు? మీకు శాశ్వత ప్రయోజనములను చేకూర్చు తలంపుల యెడల మీ మనసులను మూసికొనవద్దు. (w90 1/15)

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

Library of Congress photo LC-USC62-7258

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి