కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీ 7
  • గద్దలా లేక రాబందులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గద్దలా లేక రాబందులా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సూచన
  • పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగరడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • చేపవిందుల కొరకు గ్రద్దలు పయనించే స్థలం
    తేజరిల్లు!—1995
  • పక్షిరాజు కన్ను
    తేజరిల్లు!—2003
  • యెషయా 40:31—“యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీ 7

గద్దలా లేక రాబందులా?

సూచన

పీనుగు ఎక్కడ ఉండునో అక్కడగద్దలు పోగవును.” (మత్తయి 24:28) ఈ ఉపమానమునుండి ఉపదేశమును పొందుటకుబదులు కొందరు దీనిలో తప్పును పట్టిరి. గద్దలు స్వతంత్రంగా వేటాడి జీవముతో నున్న ఎరను భుజిస్తాయిగాని మృత కళేబరమును కాదు అని వారు చెప్పుదురు. అందుచేత కొన్ని బైబిల్లు “రాబందులు” అనే మాటను ఉపయోగించినవి. కాని ఎ.యి.టోస్‌ అనే గ్రీకుపదము “గద్ద” అని సరియైన విధంగా తర్జుమా చేయబడెను.

ఇశ్రాయేలులో కనుగొనబడిన ఒకానొక ప్రాణి తామ్రవర్ణపు గద్ద. “ఎరను వేటాడు అనేకయితర పక్షులవలె తామ్రవర్ణ గద్ద పీనుగను తినుటకు అయిష్టతను చూపదుగాని తాజాగా చంపబడినదానిపై తరచు మొదటిగా వచ్చేదానిలో ఒకటి,”అని జాన్‌సింక్లైన్‌ మరియు జాన్‌ మెండెల్‌సన్‌ గమనించారు. ఆఫ్రికా కలహారిలో 60 బేటిల్యూర్‌లు మరియు తామ్రవర్ణ గద్దలు పోగవునని మరొక పరిశీలకుడు నివేదించాడు. అతడు యింకా యిట్లన్నాడు: “తామ్ర వర్ణ గద్దలు చచ్చినదానియొద్ద చేరినప్పుడు అధికారం చెలాయిస్తాయి. ఎక్కువగా రెండు పక్షులే ఊహించదగినట్లు ఒక జంట ఆ చంపబడినదానిని పంచుకొనడం చూడదగును.”

మధ్యధరా ప్రాంతములలో సముద్రగద్దలుకూడా సామాన్యంగా కనబడతాయి. గతశతాబ్దములలో, ఈ సముద్ర గద్దలు, నేలపై ఎగురు గద్దలు యుద్ధములో చంపబడిన గుర్రాల కళేబరములను భుజిస్తూ ఉండేవి. “అందుకొరకే అవి సైన్యాన్ని అనుసరిస్తూ వెళ్లేవి. . .అవి బహుళ వ్యాప్తి అయినట్లు” మెక్లింటాక్‌ అండ్‌స్ట్రాంగ్స్‌ సైకోపీడియా చెప్పియున్నది.

చురుకుగా మరియు దూరదృష్టికలిగి యున్నందున, తాజామృతకళేబరముపై మొదటిగా చేరుకొనేది గద్దలే. యెహోవాదేవుడు యోబును అడిగిన ఈ వినయ ప్రశ్నయందలి వర్ణనను యేసు ఎరిగియుండెను: “పక్షిరాజు (గద్ద) నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా? తనగూడు ఎత్తయిన చోట కట్టునా?. . . కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తుచోటను గూడు కట్టును. అక్కడనుండియే తనయెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును. . .హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అదియుండును.”—యోబు 39:27-30.

అదేవిధంగా, ఎవరికైతే అలంకారమైన గద్దకన్నులు ఉంటాయో వారు సూచననుండి ప్రయోజనము పొందగలరని యేసు బహుచక్కగా వర్ణించెను. (w88 10/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి