సూచన నూతన లోకము సమీపముగా ఉన్నదనుటకు నిదర్శనమా?
“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును: [వివిధ] ప్రాంతములలో కరవులు, తెగుళ్ళు, భూకంపములు సంభవించును.”—మత్తయి 24:7, కింగ్‌జేమ్సు వర్షన్.
మొదటి ప్రపంచ యుద్ధము చెలరేగుచుండగా ది వాచ్‌టవర్, ఏప్రిల్ 15, 1917 పై మాటలను ఉదహరించి యిట్లనెను: “ఈ ప్రవచనాత్మక వ్యాఖ్యపాక్షిక నెరవేర్పును మనము చూస్తున్నాము. దానిలో ముఖ్యంగా భూమి మీదనున్న దేశములన్నీ ప్రాణాంతకమైన పోరాటములో మునిగియున్నవి. ప్రతిచోట ఆహారసరఫరా తగ్గిపోవుచున్నది, జీవన వ్యయప్రమాణము పెరుగుచున్నది.”
ఇప్పుడు, 72సంవత్సరముల అనంతరంకూడ ఈ పత్రిక ఆ ప్రవచనంవైపు తమ పాఠకుల అవధానమును మళ్లించుచున్నది. యేసుక్రీస్తుచే యివ్వబడిన: “సూచన” భాగమైన ఈ ప్రవచనమును ముగ్గురు ప్రాచీన చరిత్రకారులు వ్రాసారు.—మత్తయి 24:3, 7; మార్కు 13:4, 8; లూక 21:7, 10, 11.
యుద్ధమువలన, కరవులవలన, తెగుళ్లవలన, మరియు విపత్తుల మూలముగా 1914 నుండి కోటానుకోట్ల మంది ప్రాణాలు మసైపోయినవి. ది న్యూ ఎన్సైకెపీడియా బ్రిటానికా (1987) గత 1,700స.ల.లో జరిగిన 63 చారిత్రక భూకంపాలను వ్రాసింది. ఈ మొత్తంలో 27, లేదా 43శాతం 1914 తరువాత సంభవించాయి. జెరి మరియు షా అనే ప్రొఫెసర్లు వ్రాసిన టెర్రా నాన్ ఫిర్మా అను పుస్తకములో మరింత కాల పరిమితిలో సంభవించిన వాటి జాబితా ఉన్నది. ఆ మొత్తం జాబితాలో “చెప్పుకోదగ్గ” వాటియందు 54 శాతము 1914 తరువాతనే సంభవించాయి.a గతించిన శతాబ్దములందలి నిఘంటువులన్నియు అసంపూర్ణములనుకొనిననూ, మనకాలములో మానవులు బహుగా లోనైనారనే ముగింపును మనము తప్పించుకొనలేము.
జపాను పట్టణములైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రేలెనను మరింత భయోత్పాత విషయమును మనుష్యుల హృదయాలను తాకెను. మానవాళిని అంతరింపచేయుటకు సామూహిక నాశనముచేయగల అనేక ఆయుధములను నేటిపరమాణుశక్తి కల్గియున్నది. చరిత్రకారుడైన లూకా యేసు ప్రవచనమును వ్రాయుచు: “ఆకాశమునుండి మహాభయోత్పాతములును గొప్పసూచనలును పుట్టును. . .భూమి మీద కలవరపడిన జనములకు శ్రమ. . .లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు.”—లూకా21:11, 25, 26.
అగ్రరాజ్యములు తమ ఆయుధగారములలోని ఆయుధాల సంఖ్యను తగ్గించవలెనని ఒప్పంద పడిననూ, అటువంటి ఒప్పందములు హింసాత్మకనేరములను, ఆర్థికదౌర్బల్యమును, ఉగ్రవాదముల వలనవచ్చు మానవుని భయాన్ని తగ్గించలేవు. “ఈ రోజులలో ప్రజలను అధిక వేదనకు గురిచేయునదేమనగా వారి వ్యక్తిగత రక్షణయే. . .నేరము ఒక వెర్రిగామారినది. అన్నివిషయములలోను భయము వ్యాపించినది,” అని ఒక ఆఫ్రికా వార్తాపత్రిక పేర్కొన్నది. ఔను “అక్రమము విస్తరించుటను” గూర్చి యేసు ముందే చెప్పిననూ, అది సూచన యొక్క మరి యొక ఖచ్చితమైన వివరణ.—మత్తయి 24:12.
“సువార్త”
ఇప్పుడు పేర్కొనిన విషాద సంఘటనల వెనుక: “సువార్త లోకమందంతటను ప్రకటింపబడునని” ప్రవచింపబడినదన్న విషయాన్ని నీవు విన్నప్పుడు నీవు ఉపశమనము పొందగలవు. (మత్తయి 24:14) ఆ “సువార్త” దేవుని రాజ్యమును గూర్చినది. ఇప్పటికే, ఆ మానవాతీత ప్రపంచ ప్రభుత్వము లక్షలాదిమంది యథార్థప్రజలను సమీకరించినది. త్వరలో అది మానవుల విషయములలో జోక్యము కలుగ జేసికొని, నీతియుక్త నూతన లోకము కొరకు మానవునికి గల అవసరతను తృప్తిపర్చును.—లూక 21:28-32; 2 పేతురు 3:13.
అనేకులు అపనమ్మకముతో ఆ సువార్తను తృణీకరింతురు. కొందరు దానిని నమ్మెదమందురు గాని దాని విషయములో ఎక్కువ కృషిసల్పరు. మరి కొందరు కొంతకాలము దాని విషయమై పనిచేస్తారు, పిమ్మట దానిని గూర్చి అనుమానించుట ప్రారంభిస్తారు. అటువంటి ప్రతిచర్యలు కూడా ‘సూచన’ యందలి భాగమని చెప్పబడినదా? మరి ప్రాముఖ్యంగా, ఈ సూచన ద్వారా నీవు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనము పొందగలవు? (w88 10/15)
[అధస్సూచీలు]
a ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా (1987) సా.శ.పూ. 526 నుండి సంభవించిన 37 “ప్రధాన భూకంపములను” పేర్కొన్నది. ఈ జాబితాలో, 65శాతము 1914 నుండి సంభవించినవే.