కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 9/1 పేజీలు 8-9
  • హింసను ఎదుర్కెనుటకు సంసిద్ధంచేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హింసను ఎదుర్కెనుటకు సంసిద్ధంచేయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • హింసనెదుర్కొనుటకు సిద్ధంచేయుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • ఆయన వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధముచేయుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసే మార్గం, సత్యం, జీవం
    యేసే మార్గం, సత్యం, జీవం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 9/1 పేజీలు 8-9

యేసు జీవితము పరిచర్య

హింసను ఎదుర్కెనుటకు సంసిద్ధంచేయుట

ప్రచారపనిని కొనసాగించు పద్దతులనుగూర్చి యేసు తనశిష్యులకు ఉపదేశించిన పిదప, వ్యతిరేకులనుగూర్చి ఆయన వారిని హెచ్చరించెను. ఆయన చెప్పెను: “ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. . .మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి, వారుమిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.”

తనశిష్యులు తీవ్రమైన హింసను ఎదుర్కొనవలసియున్నను, యేసు అభయమిచ్చుచు వాగ్ధానమిచ్చెను: “వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటలాడుదుము? ఏమిచెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడేగాని మాటలాడువారు మీరుకారు.”

యేసు కొనసాగించుచు “సహోదరుడు సహోదరుని, తండ్రికుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.” ఆయన యింకా చెప్పుచు: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు, అంతమువరకును సహించినవాడు రక్షింపబడును.”

ప్రచారపని ప్రాముఖ్యమైయున్నందున, ఈ పనిని కొనసాగింపజేయుటకు స్వతంత్రంగా ఉండునిమిత్తము వివేకముయొక్క అవసరతను యేసు ఉన్నతపర్చెను. “వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారముచేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”

ఈ ఉపదేశము, హెచ్చరిక మరియు ప్రోత్సాహమును యేసు తన 12 మంది శిష్యులకు యిచ్చెననునది వాస్తవమే, కాని ఆయన మరణము మరియు పునరుత్థానము అనంతరము ప్రపంచవ్యాప్త ప్రచారపనిలో ప్రతి ఒక్కరికి అవి వర్తించును. తన శిష్యులు కేవలం అపొస్తలులు ప్రకటించుటకు పంపబడిన ఇశ్రాయేలీయులచేత మాత్రమేకాక మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు, అని ఆయన చెప్పిన వాస్తవమును బట్టి అది చూపబడెను. మరియు, యేసు వారిని ఆ కొద్దిపాటి ప్రచారపనికి పంపినప్పుడు అపొస్తలులు అధిపతుల యెదుట మరియు రాజుల యెదుటకు తేబడలేదు. అంతేకాకుండా విశ్వాసులు తమ కుటుంబసభ్యులచేత మరణమునకు అప్పగించబడలేదు.

“మనుష్యకుమారుడు వచ్చుపర్యంతము” తన శిష్యులు తమప్రాంతమందు ప్రకటించుపనిని పూర్తిచేయరని చెప్పినప్పుడు, ఆర్మగెద్దోనునందు యెహోవా ప్రతిదండనాధికారిగా మహిమాయుతుడైన యేసుక్రీస్తు రాకముందు స్థాపించబడిన దేవుని రాజ్యమును గూర్చి భూమియంతట ప్రకటించుటను తన శిష్యులు పూర్తిచేయరని యేసు ప్రవచనాత్మకముగా మనకు చెప్పుచుండెను.

ప్రకటించుపనికి సంబంధించిన ఉపదేశములను కొనసాగించుచు యేసు యిట్లనెను: “శిష్యుడు బోధకునికంటె అధికుడుకాడు; దాసుడు యజమానుని కంటె అధికుడుకాడు.” కనుక దేవునిరాజ్యమును ప్రకటించుటకు తానుపొందిన అవమానము, హింసలను యేసు అనుచరులు కూడా పొందుతారని ఎదురుచూడాలి. ఆయనిలా ఉపదేశించెను: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడిగాని ఆత్మను దేహమును కూడా గెహెన్నాలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”

ఈ విషయములో యేసు మాదిరి చూపెను. సర్వశక్తిగల యెహోవా దేవునియెడల తనకుగల యదార్థత విషయములో రాజీపడుటకు బదులుగా ఆయన నిర్భయముగా మరణమును సహించెను. అవును, ఒకని ఆత్మను (ఈ సందర్భములో జీవించు ఆత్మగా ఒకని భవిష్యత్‌ ఉత్తరాపేక్షలను) నాశనము చేయగలవాడు మాత్రమే కాక నిత్యజీవమును అనుభవించుటకు ఒక వ్యక్తిని పునరుత్థానము చేయగలవాడు కూడ యెహోవాయే. ఎంతటి ప్రేమ, దయాళుడైన పరలోకపు తండ్రి యెహోవా!

వారియెడల యెహోవా కల్గియున్న ప్రేమాపూర్వక లక్ష్యమును ఉన్నతపర్చే ఒక ఉపమానముతో యేసు తదుపరి తన శిష్యులను ప్రోత్సహించెను. “రెండుపిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా?” అని ఆయన అడిగెను. “అయినను మీతండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెంట్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు.”

ప్రకటించుమని యేసు తన శిష్యులకు అప్పగించిన రాజ్యవర్తమానము కుటుంబములో కొందరు దానిని అంగీకరించనందువలన మరి కొందరు తృణీకరించినందున గృహము విభాగింపబడును. “భూమి మీదికి నేను సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి” అని ఆయన వివరించెను. “ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.” ఆవిధంగా ఒక కుటుంబ సభ్యుడు బైబిలు సత్యానికి హత్తుకోవాలంటే ధైర్యము కావాలి. యేసు యిలా చెప్పెను, “తండ్రినైనను, తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు, కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు.”

తన ఉపదేశములను ముగించుచు తనశిష్యులను చేర్చుకొనువాడు తన్ను చేర్చుకొనుచున్నాడని యేసు వివరించెను. “మరియు శిష్యుడని యెవడు ఈచిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్లు మాత్రమునిచ్చునో వాడుతన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” మత్తయి 10:16-42.

◆ యేసు తన శిష్యులకు ఎలాంటి హెచ్చరికలు యిచ్చెను?

◆ వారికి ఆయన ఎలాంటి ప్రోత్సాహమును మరియు ఓదార్పునిచ్చెను?

◆ యేసు ఉపదేశములు ఆధునిక క్రైస్తవులకు కూడా ఎందుకు వర్తించును?

◆ యేసు శిష్యుడు ఏవిధంగా తన బోధకునికంటె అధికుడుకాడు? (w87 8/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి