అన్నింటికన్నా ముందు కాపుకొచ్చేది
మధ్యదరా ప్రాంతమందలి ఫలవృక్షాల్లో, బాదము చెట్టు బహు ఆకర్షణీయమైన వృక్షం. జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి తొలిభాగంలోనే అంటే ఏ యితర వృక్షాలకంటె కూడ చాలాముందుగా అది శీతాకాలపు ప్రభావాన్నుండి త్వరగా కోలుకుంటుంది. అదెంతగా వికసిస్తుంది! చెట్టంతా గులాబి లేదా తెల్లని పూమొగ్గలతో నిండిపోతుంది, తెల్లని పూమొగ్గలతో ఆ చెట్టు తెల్లగా తలపండిన వృద్ధుని పోలి వుంటుంది.—ప్రసంగి 12:5 పోల్చండి.
త్వరగా పూతకు రావడాన్ని సూచిస్తూ ప్రాచీన హెబ్రీయులు బాదము చెట్టును “మేల్కొల్పేదని” పిలిచేవారు. ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని దృష్టాంతపరచేందుకు ఈ వృక్ష లక్షణాన్ని యెహోవా ఉపయోగించాడు. తన పరిచర్య ఆరంభకాలంలో యిర్మీయాకు దర్శనంలో ఈ బాదము చువ్వ చూపబడింది. దాని భావమేమి? యెహోవా యిలా వివరించాడు: “నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను.”—యిర్మీయా 1:12.
బాదము చెట్టు పెందలకడ ‘మేల్కొన్నట్లే,’ అలంకారార్థమందు అవిధేయత పరిణామాలను గూర్చి యెహోవా తన ప్రజలను హెచ్చరించుటకు “పెందలకడనే లేచి” తన ప్రవక్తలను పంపెను. (యిర్మీయా 7:25) ఆయన తన వాక్యం నెరవేరు వరకు విశ్రాంతి తీసుకోడు అనగా ఆయన ‘మేల్కొనే’ ఉంటాడు. కావున సా.శ.పూ. 607లో, నిర్ణయకాలమందు మతభ్రష్ట యూదా జనాంగము మీదికి యెహోవా తీర్పు వచ్చింది.
మనం జీవించే ఈ దుష్ట విధానం మీదికి కూడ అటువంటి తీర్పే వచ్చునని దేవుని వాక్యము ప్రవచిస్తున్నది. (కీర్తన 37:9, 10; 2 పేతురు 3:10-13) అటువంటి న్యాయచర్యను సూచిస్తూ ప్రవక్తయైన హబక్కూకు మనకిలా అభయమిస్తున్నాడు: “దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, . . . దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) కనులవిందుచేసే బాదము పూత యెహోవా తన వాక్కును నెరవేర్చడంలో మెలకువగా ఉండుననే విషయాన్ని మనకు గుర్తుచేస్తున్నది. (w93 2/15)
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.