కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wcg అధ్యా. 1 పేజీలు 16-19
  • దేవునితో నడిచాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునితో నడిచాడు
  • ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎక్కువ తెలుసుకోండి
  • మనం నేర్చుకునే పాఠాలు
  • మనసుపెట్టి ఆలోచించండి
  • ఇవి కూడా చూడండి
  • అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • దైవభక్తిలేని లోకంలో హనోకు దేవునితో నడిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • హనోకు—విపత్తులన్నిటినీ నిర్భయంగా ఎదుర్కొన్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
wcg అధ్యా. 1 పేజీలు 16-19

1 హనోకు

దేవునితో నడిచాడు

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

ఒంటరితనం ఎలా ఉంటుందో హనోకుకు బాగా తెలుసు. ఎందుకంటే లోకమంతా ఒకవైపు ఉంటే, హనోకు మాత్రం ఇంకో వైపు ఉన్నాడు. అప్పట్లో జీవించిన వాళ్లందరిలో, ఈయన గురించి మాత్రమే బైబిలు ఇలా చెప్పింది: “హనోకు సత్యదేవునితో నడుస్తూ ఉన్నాడు.” ఒక మామూలు మనిషి దేవునితో ఎలా నడవగలడు? హనోకు చూపించిన ధైర్యం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

హనోకు రెండు విధాలుగా సత్యదేవునితో కలిసి నడిచాడు. ఒకటి, దేవునికి నచ్చని వాటికి దూరంగా ఉన్నాడు. రెండు, దేవుడు చెప్పింది చేశాడు. హనోకు చుట్టూ ఉన్నవాళ్లు చెడ్డపనులు చేసేవాళ్లు. కానీ ఆయన అలాంటి పనులకు దూరంగా ఉన్నాడు. ఆదాముహవ్వల నుండి హనోకు ఏడో తరం వాడు. అప్పటికే ఆదాము చాలా ముసలివాడయ్యాడు గానీ, ఇంకా బ్రతికే ఉన్నాడు. (“పూర్వీకుల నుండి న్యాయాధిపతుల వరకు ఉన్న కాలం” అనే టైమ్‌లైన్‌ చూడండి.) ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరిగారు, వాళ్ల పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ల కొడుకైన కయీను తన సొంత తమ్ముడైన హేబెలును చంపేశాడు. హేబెలు దేవుని మీద విశ్వాసం చూపించిన వాళ్లలో మొదటి వ్యక్తి. కయీను వంశస్థుల్లో కొంతమంది కయీనులాగే క్రూరంగా తయారయ్యారు; చెప్పాలంటే అతని కంటే ఘోరంగా తయారయ్యారు. (ఆది. 4:23, 24) అలా క్రూరంగా ప్రవర్తించేవాళ్లకు హనోకు దూరంగా ఉన్నాడు. అలా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. ఆయన అందరితో మంచిగా, శాంతిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన్ని చూసి సంతోషించాడు.

హనోకు పుట్టడానికి చాలా సంవత్సరాల ముందు నుండే, “ప్రజలు యెహోవా పేరును వాడడం మొదలుపెట్టారు.” (ఆది. 4:26) వాళ్లు దేవుని పేరును భక్తితో కాదుగానీ అగౌరవంగా, అబద్ధ ఆరాధన కోసం వాడారు. హనోకు మాత్రం అలాంటి పనులేం చేయలేదు. ఆయన యెహోవా పవిత్రమైన పేరును ప్రేమించాడు, చాలా గౌరవించాడు. అలా అందరూ ఒకవైపు ఉంటే, ఈయన మాత్రం ఇంకో వైపు ఉన్నాడు.

హనోకు మాటలు విన్న ప్రజలు కోపంతో ఆయన్ని చంపాలని చూశారు, కానీ వాళ్ల చేతికి చిక్కకుండా యెహోవా ఆయన్ని కాపాడాడు

యెహోవాకు నచ్చనిది చేయకపోవడం ఒక ఎత్తయితే, ఆయనకు నచ్చింది చేయడం ఇంకొక ఎత్తు. అలా చేయాలంటే హనోకుకు ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. దేవుడు హనోకును ప్రవక్తగా నియమించాడు, అదొక ప్రత్యేకమైన బాధ్యత. చెడ్డ పనులు చేస్తూ, క్రూరంగా ఉన్న అప్పటి ప్రజల మధ్యకు వెళ్లి హనోకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే: “ఇదిగో! యెహోవా తన లక్షలాది పవిత్ర దూతలతో వచ్చాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చడానికి వచ్చాడు. భక్తిహీనులు దైవభక్తి లేకుండా చేసిన భక్తిహీన పనులన్నిటిని బట్టి, అలాగే భక్తిహీన పాపులు దేవుని గురించి నీచంగా మాట్లాడిన మాటలన్నిటిని బట్టి వాళ్లను శిక్షించడానికి ఆయన వచ్చాడు.”

ప్రజలు పనులు చేసుకుంటూ బిజీగా ఉన్న ఒక వీధిలో హనోకు దేవుని తీర్పు సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడున్నవాళ్లలో కొంతమంది చాలా కోపంగా, చిరాగ్గా కనిపిస్తున్నారు. మరికొంతమంది చేతిలో ఆయుధాలు ఉన్నాయి.

ఇక్కడ హనోకు మాటల్ని చూస్తే, అవి అప్పటికే జరిగిపోయినట్టుగా, దేవుని తీర్పు ఆ ప్రజల మీదికి వచ్చేసినట్టుగా ఉన్నాయి. అంటే, హనోకు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మవచ్చు. ఆయన చాలా కఠినమైన తీర్పు సందేశాన్ని ప్రకటించాడు. ప్రజలకు ‘దైవభక్తి లేదని’ అర్థం వచ్చే పదాలను నాలుగుసార్లు ఉపయోగించాడు! ఆ మాటలు వాళ్లకు చురకల్లా తగిలి ఉంటాయి. అయినప్పటికీ, యెహోవా చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన ధైర్యంగా వాళ్లకు చెప్పాడు.

అది విన్న ప్రజలు ఏం చేశారు? దాని గురించి బైబిలు సూటిగా ఏం చెప్పట్లేదు గానీ, హనోకు ప్రాణం ప్రమాదంలో పడిందని మాత్రం అర్థమౌతుంది. అలాగని ఎలా చెప్పవచ్చు? బైబిల్లో ఇలా ఉంది: “ఆ తర్వాత అతను ఇక లేడు, ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు.” అసలేం జరిగింది? ఆ కాలంలోని చెడ్డ ప్రజలు, ఎలాగైనాసరే హనోకు నోరు మూయించాలని ప్రయత్నించి ఉంటారు. హనోకు ప్రజలకు చిక్కి, వాళ్ల చేతిలో గాయపడి చనిపోవడం యెహోవాకు ఇష్టంలేదు. అందుకే, తనకెంతో ఇష్టమైన స్నేహితున్ని తీసుకెళ్లిపోయాడు. అంటే, హనోకు ప్రశాంతంగా మరణంలో నిద్రపోయేలా చేశాడు. అలా ఆయన యెహోవా జ్ఞాపకంలో పదిలంగా ఉన్నాడు; అక్కడ ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేరు.

చనిపోయేముందు యెహోవా హనోకుకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు. ఏంటది? బైబిలు ఇలా చెప్తుంది: “అలా తీసుకెళ్లబడడానికి ముందు, అతను దేవుణ్ణి సంతోషపెట్టాడని సాక్ష్యం పొందాడు.” బహుశా, యెహోవా హనోకుకు ఒక దర్శనం చూపించి ఉంటాడు. అందులో, ఆయన పరదైసు భూమ్మీద ప్రశాంతమైన జీవితాన్ని ఆనందిస్తున్నట్టు చూసి ఉంటాడు! బలమైన విశ్వాసాన్ని, కొండంత ధైర్యాన్ని చూపించినందుకు యెహోవా తనని ప్రేమించాడని, దీవించాడని కన్నుమూసే ముందు హనోకుకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది!

ఈ వచనాలు చదవండి:

  • ఆదికాండం 5:21-24

  • హెబ్రీయులు 11:5

  • యూదా 14, 15

ప్రశ్న:

హనోకు ఎలా ధైర్యం చూపించాడు?

ఎక్కువ తెలుసుకోండి

  1. 1. “ప్రజలు యెహోవా పేరును వాడడం మొదలుపెట్టారు” అనే మాటకు అర్థం ఏంటి? (ఆది. 4:26; w01 9/15 29 ¶3)

  2. 2. ఏ పని చేసిన వాళ్లలో హనోకు మొదటివాడు? దాన్ని ఆయన ఎలా చేయగలిగాడు? (w01 9/15 31 ¶5)

  3. 3. ప్రవచించడం మొదలుపెట్టక ముందే, తన ధైర్యానికి పరీక్ష వస్తుందని హనోకుకు తెలిసే ఉంటుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? (w06 10/1 19 ¶13-14) చిత్రం 1

    చిత్రాలు: తన పూర్వీకులకు జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్న హనోకు. 1. ఏదెను తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు కెరూబులు, మండుతున్న ఖడ్గం. 2. ముసలివాళ్లయిన ఆదాము, హవ్వ. 3. తన తమ్ముడైన హేబేలును చంపేసి ఆయన శవం దగ్గర నిల్చున్న కయీను.

    చిత్రం 1

  4. 4. హనోకు పరలోకానికి వెళ్లాడని కొంతమంది నమ్ముతారు. కానీ, అది నిజం కాదని మీరు ఎలా వివరిస్తారు? (యోహా. 3:13; హెబ్రీ. 11:5, 13)

మనం నేర్చుకునే పాఠాలు

  • ప్రీచింగ్‌ చేయడానికి మనకు ధైర్యం ఎప్పుడు అవసరం అవుతుంది? హనోకుకు సహాయం చేసినట్టే యెహోవా మీకెలా సహాయం చేస్తాడు? చిత్రం 2

    గ్యారేజిలో పనిచేస్తున్న ఒక బ్రదర్‌ కోపిష్ఠిలా కనిపించే తన తోటి ఉద్యోగిని మీటింగ్‌కి ఆహ్వానించడానికి అతని దగ్గరికి వెళ్తున్నాడు. వెనకాల ఉన్న మిగతా ఇద్దరు ఉద్యోగులు బ్రదర్‌ని చూసి నవ్వుకుంటున్నారు.

    చిత్రం 2

  • మనం ధైర్యం చూపిస్తూ యెహోవాతో నడిచినప్పుడు ఆయనకు ఎలా అనిపిస్తుంది? (సామె. 27:11; హెబ్రీ. 11:5)

  • హనోకులాగే మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?

మనసుపెట్టి ఆలోచించండి

  • ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?

  • ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?

  • కొత్త లోకంలో హనోకును కలిసినప్పుడు ఆయన్ని నేను ఏం అడగాలనుకుంటున్నాను?

ఇవి కూడా చూడండి

హింసను తట్టుకోవడానికి హనోకు ఉదాహరణ మీకు ఎలా సహాయం చేస్తుంది?

విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు—హనోకును అనుకరించండి, లెమెకును కాదు (2:53)

విశ్వాసాన్ని పెంచుకోవడానికి హనోకుకు ఏది సహాయం చేసిందో తెలుసుకోండి.

“సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి” (w05 9/1 13-17)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి