19వ పాఠం
యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులా?
యెహోవాసాక్షులమైన మేము నిజ క్రైస్తవులమని నమ్ముతాం. ఎందుకు? మా నమ్మకాలు దేనిమీద ఆధారపడి ఉంటాయో, మేము యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు పెట్టుకున్నామో, మేము ఎలా ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుంటామో పరిశీలించండి.
1. యెహోవాసాక్షుల నమ్మకాలు దేనిమీద ఆధారపడి ఉంటాయి?
యేసు ఇలా అన్నాడు: దేవుని వాక్యమే సత్యం. (యోహాను 17:17) యేసు ఎప్పుడూ దేవుని వాక్యంలో ఉన్నవే బోధించాడు. యెహోవాసాక్షుల నమ్మకాలు కూడా దేవుని వాక్యం మీదే ఆధారపడి ఉంటాయి. యెహోవాసాక్షుల చరిత్రను పరిశీలించండి, ఒకప్పుడు వాళ్లను బైబిలు విద్యార్థులు అని పిలిచేవాళ్లు. 1870లలో, కొంతమంది బైబిలు విద్యార్థులు కలిసి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టారు. బైబిలు చెప్పేవాటికి, చర్చి చెప్పేవాటికి తేడా ఉందని గుర్తించి, వాళ్లు బైబిలు చెప్పేవే నమ్మాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వాళ్లు నేర్చుకున్న బైబిలు సత్యాల్ని వేరేవాళ్లకు కూడా చెప్పడం మొదలుపెట్టారు.a
2. మేము యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం?
తనను ఆరాధించేవాళ్లు తన గురించి నిజాలు చెప్తారు కాబట్టి, యెహోవా వాళ్లను తన సాక్షులు అని పిలుస్తున్నాడు. (హెబ్రీయులు 11:4–12:1) ఉదాహరణకు, పూర్వకాలంలో యెహోవా తన ప్రజలతో ఇలా అన్నాడు: “మీరే నా సాక్షులు.” (యెషయా 43:10 చదవండి.) బైబిలు యేసును “నమ్మకమైన సాక్షి” అని పిలుస్తుంది. (ప్రకటన 1:5) కాబట్టి, 1931 లో మేము యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నాం. ఆ పేరు పెట్టుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం.
3. యేసులాగే యెహోవాసాక్షులు ఎలా ప్రేమ చూపిస్తారు?
యేసు తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడంటే, వాళ్లను తన సొంత కుటుంబంలా చూశాడు. (మార్కు 3:35 చదవండి.) అదేవిధంగా, యెహోవాసాక్షులు ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అందుకే, మేము సహోదరుడు, సహోదరి అని పిలుచుకుంటాం. (ఫిలేమోను 1, 2) అంతేకాదు, మేము ఈ ఆజ్ఞను కూడా పాటిస్తాం: “ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని ప్రేమించండి.” (1 పేతురు 2:17) మేము ఆ ప్రేమను ఎన్నో విధాలుగా చూపిస్తాం. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సహోదర సహోదరీలు అవసరంలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేస్తాం.
ఎక్కువ తెలుసుకోండి
యెహోవాసాక్షుల చరిత్ర గురించి ఎక్కువ తెలుసుకోండి. అలాగే మేము నిజ క్రైస్తవులం అని చెప్పడానికి ఇంకా ఏ రుజువులు ఉన్నాయో చూడండి.
నిజ క్రైస్తవుల నమ్మకాలు బైబిలు మీద ఆధారపడి ఉంటాయి, వాళ్లు బైబిలు సత్యాల్ని వేరేవాళ్లకు చెప్తారు
4. మా నమ్మకాలు బైబిలు మీద ఆధారపడి ఉంటాయి
చివరి రోజుల్లో బైబిలు సత్యం స్పష్టంగా అర్థమౌతుందని యెహోవా ముందే చెప్పాడు. దానియేలు 12:4, అధస్సూచి చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
దేవుని ప్రజలు బైబిల్ని పరిశీలించే కొద్దీ ఏం “ఎక్కువౌతుంది”?
ఛార్లెస్ రస్సెల్ అనే ఆయన, ఇంకొంతమంది బైబిలు విద్యార్థులు దేవుని వాక్యాన్ని ఎలా పరిశీలించారో చూడండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
ఛార్లెస్ రస్సెల్, ఇంకొంతమంది బైబిలు విద్యార్థులు బైబిల్ని ఎలా పరిశీలించారు?
మీకు తెలుసా?
కొన్నిసార్లు మేము మా నమ్మకాల్లో కొన్ని మార్పులు చేసుకున్నాం. ఎందుకు? సూర్యుడు ఉదయించి వెలుగు అంతకంతకూ ఎక్కువయ్యే కొద్దీ ఎలాగైతే పరిసరాల్ని స్పష్టంగా చూడగలుగుతామో, అలాగే దేవుడు క్రమక్రమంగా సహాయం చేసే కొద్దీ బైబిల్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. (సామెతలు 4:18 చదవండి.) బైబిలు మారదు. కానీ దేవుని సహాయంతో మేము బైబిల్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు, మా నమ్మకాల్లో మార్పులు చేసుకుంటాం.
5. మేము మా పేరుకు తగ్గట్టు జీవిస్తాం
మేము యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు సరిగ్గా సరిపోతుంది?
యెహోవా తనకు సాక్షులుగా ఉండడానికి ప్రజల్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే, వాళ్లు ఆయన గురించి సత్యాన్ని చెప్తారు. లోకంలో చాలామంది ఆయన గురించి ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. వాటిలో రెండిటిని చూడండి.
ఆరాధనలో విగ్రహాలు ఉపయోగిస్తే దేవుడు సంతోషిస్తాడని కొన్ని మతాలు చెప్తున్నాయి. మరి అది నిజమేనా? లేవీయకాండం 26:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
విగ్రహాల గురించి యెహోవా ఏం అనుకుంటున్నాడు?
కొంతమంది మత బోధకులు యేసే దేవుడు అని చెప్తున్నారు. మరి అది నిజమేనా? యోహాను 20:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
యేసు, దేవుడు ఇద్దరూ ఒకటేనా?
యెహోవా తన సాక్షుల్ని మీ దగ్గరికి పంపించి తన గురించి, తన కుమారుని గురించి సత్యాన్ని చెప్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది?
6. మేము ఒకరి మీద ఒకరం ప్రేమ చూపిస్తాం
బైబిలు క్రైస్తవుల్ని శరీరంలోని వేర్వేరు అవయవాలతో పోలుస్తుంది. 1 కొరింథీయులు 12:25, 26 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
తోటి క్రైస్తవులకు కష్టం వస్తే, నిజ క్రైస్తవులు ఏం చేస్తారు?
యెహోవాసాక్షుల మధ్య మీరు ఎలాంటి ప్రేమను చూశారు?
ఒక దేశంలోని యెహోవాసాక్షులకు కష్టం వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులంతా వెంటనే స్పందిస్తారు. ఒక ఉదాహరణ తెలుసుకోవడానికి వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
తుఫాను వచ్చినప్పుడు యెహోవాసాక్షులు ఒకరి మీద ఒకరు ఎలా ప్రేమ చూపించుకున్నారు?
నిజ క్రైస్తవులు తోటివాళ్లకు సహాయం చేస్తూ ప్రేమ చూపిస్తారు
కొంతమంది ఇలా అంటారు: “యెహోవాసాక్షులది కొత్త మతం.”
యెహోవా తనను ఆరాధించేవాళ్లను ఎప్పటినుండి సాక్షులు అని పిలుస్తున్నాడు?
ఒక్కమాటలో
యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులు. ప్రపంచంలో ఎక్కడున్నా మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం, మా నమ్మకాలు బైబిలు మీద ఆధారపడి ఉంటాయి, మేము యెహోవా గురించిన సత్యాన్ని అందరికీ చెప్తాం.
మీరేం నేర్చుకున్నారు?
మేము యెహోవాసాక్షులు అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం?
మేము ఎలా ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుంటాం?
యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులు అని మీరు అనుకుంటున్నారా?
ఇవి కూడా చూడండి
మా చరిత్ర గురించి ఎక్కువ తెలుసుకోండి.
యెహోవాసాక్షులు విశ్వాసంతో ముందుకెళ్లారు, 1వ భాగం: చీకటి నుండి వెలుగులోకి (1:00:53)
యెహోవాసాక్షులు అబద్ధ బోధల్ని ఎలా బయటపెట్టారో ఒక ఉదాహరణ చూడండి.
యెహోవాసాక్షుల గురించి మీకు వచ్చే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి.
“యెహోవాసాక్షుల గురించి తరచూ అడిగే ప్రశ్నలు” (jw.orgలోని సెక్షన్)
స్టీఫెన్ వేరే జాతుల ప్రజల్ని ద్వేషిస్తూ వాళ్లను కొట్టేవాడు. కానీ యెహోవాసాక్షుల్ని చూశాక ఆయన ఎలా మారాడో తెలుసుకోండి.
a కావలికోట అనే మా ముఖ్యమైన పత్రిక, 1879 నుండి బైబిలు సత్యాన్ని ప్రచురిస్తూనే ఉంది.