కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 9 పేజీ 12
  • వీడియోలతో, చిత్రాలతో బోధించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వీడియోలతో, చిత్రాలతో బోధించడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • దృశ్య సహాయకాల సమర్థమైన ఉపయోగం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • బోధించే దృశ్య సహాయకాలను ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఎయిడ్స్‌—తలిదండ్రులు, పిల్లలు దాన్నిగూర్చి ఏమి తెలుసుకోవాలి
    తేజరిల్లు!—1992
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 9 పేజీ 12

అధ్యాయం 9

వీడియోలతో, చిత్రాలతో బోధించడం

లేఖనం

ఆదికాండం 15:5

ఏమి చేయాలి? మీరు బోధిస్తున్న ప్రాముఖ్యమైన విషయాలను వినేవాళ్లు బాగా అర్థం చేసుకొని, గుర్తుంచుకునేలా చిత్రాలు, వీడియోలు లాంటివాటిని ఉపయోగించండి.

ఎలా చేయాలి?

  • సరైన వీడియోలను, చిత్రాలను ఎంచుకోండి. ప్రసంగం ఇస్తున్నప్పుడు చిన్నచిన్న వివరాలను కాకుండా ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి చిత్రాలు, చిత్రపటాలు, మ్యాప్‌లు, కాలరేఖలు (సంవత్సరాలను చూపే చార్టులు) వంటివాటిని ఉపయోగించండి. పరిచర్యలో మీరు వీడియోలను కూడా ఉపయోగించవచ్చు. వినేవాళ్లు కేవలం మీరు చూపించే చిత్రాలు, వీడియోలనే కాకుండా మీరు చెప్పే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునేలా సహాయం చేయండి.

  • వీడియోలు, చిత్రాలు చక్కగా కనిపించేలా చూసుకోండి.

    సలహా

    మాట్లాడడం మొదలుపెట్టక ముందే, మీరు ఉపయోగించాలని అనుకుంటున్న చిత్రాలను, వీడియోలను సిద్ధంగా ఉంచుకోండి.

పరిచర్యలో

ఇంటివ్యక్తికి ప్రచురణలోని ఒక చిత్రాన్ని చూపించి, దాని మీద ఆయన అభిప్రాయం అడగండి. అవసరమైతే, ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి అదనపు ప్రశ్నలు వేయండి. వీడియో చూపిస్తున్నట్లయితే, ఇంటివ్యక్తికి కనిపించేలా ట్యాబ్‌ను గానీ ఫోన్‌ను గానీ పట్టుకోండి. మామూలుగా, వీడియో ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి