కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 3 పేజీ 6
  • ప్రశ్నలు వేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నలు వేయడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 3 పేజీ 6

అధ్యాయం 3

ప్రశ్నలు వేయడం

లేఖనం

మత్తయి 16:13-16

ఏమి చేయాలి? వినేవాళ్లలో ఆసక్తి కలిగించి దాన్ని నిలబెట్టడానికి, వాళ్లను ఆలోచింపజేయడానికి, ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి గౌరవపూర్వకంగా ప్రశ్నలు వేయండి.

ఎలా చేయాలి?

  • ఆసక్తి కలిగించి, దాన్ని నిలబెట్టండి. వినేవాళ్లు మనసులో జవాబు చెప్పుకునేలా లేదా వాళ్ల ఆసక్తి పెరిగేలా ప్రశ్నలు వేయండి.

  • ఆలోచింపజేయండి. వినేవాళ్లు మీరు చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని నమ్మేలా కొన్ని ప్రశ్నలు వేయండి.

  • ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పండి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పే ముందు ఆసక్తి కలిగించే ప్రశ్న వేయండి. ముఖ్యమైన విషయాన్ని వివరించిన తర్వాత గానీ, మీ ప్రసంగం ముగింపులో గానీ మీరు మాట్లాడిన విషయం మీద ప్రశ్నలు వేయండి.

    సలహా

    ఒక లేఖనం చదివిన తర్వాత, ఆ వచనంలో లేదా వచనాల్లో ఉన్న ముఖ్యమైన విషయాన్ని నొక్కిచెప్పడానికి ప్రశ్నలు వేయండి.

పరిచర్యలో

ఒక విషయం మీద ఇంటివ్యక్తి అభిప్రాయం అడగండి. ఆయన ఇచ్చే జవాబును శ్రద్ధగా వినండి. ప్రశ్నలు ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో పరిస్థితిని బట్టి తెలివిగా నిర్ణయించుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి