కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 2 పేజీ 5
  • సహజంగా మాట్లాడడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహజంగా మాట్లాడడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సహజత్వం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • గట్టి నమ్మకంతో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఆప్యాయత, సహానుభూతి
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 2 పేజీ 5

అధ్యాయం 2

సహజంగా మాట్లాడడం

లేఖనం

2 కొరింథీయులు 2:17

ఏమి చేయాలి? మీరు చెప్తున్న విషయం గురించి, వినేవాళ్ల గురించి మీకు ఏమి అనిపిస్తుందో తెలిసేలా సహజంగా, నిజాయితీగా మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • ప్రార్థన చేసుకుని, జాగ్రత్తగా సిద్ధపడండి. మీరు మీ మీద కాకుండా మీరు చెప్పే సందేశం మీద మనసుపెట్టేలా సహాయం చేయమని ప్రార్థించండి. మీరు చెప్పాల్సిన ముఖ్యాంశాల (main points) మీద మనసుపెట్టండి. మీరు రాసుకున్న విషయాన్ని ఉన్నదున్నట్లు కాకుండా సొంత మాటల్లో చెప్పండి.

    సలహా

    మీరు బైబిల్ని లేదా మరో ప్రచురణను చదవాలనుకుంటే, దాన్ని తడబడకుండా చక్కగా చదివేలా బాగా ప్రాక్టీసు చేయండి. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని చదువుతున్నప్పుడు, మరీ నాటకీయంగా కాకుండా వాళ్ల భావాలు అర్థమయ్యేలా చదవండి.

  • హృదయంలో నుండి మాట్లాడండి. ప్రేక్షకులు మీరు చెప్తున్న సందేశం ఎందుకు వినాలో ఆలోచించండి. వాళ్ల మీదే మనసుపెట్టండి. అప్పుడు మీరు నిలబడే-కూర్చునే తీరులో, సంజ్ఞల్లో, ముఖకవళికల్లో మీకున్న నిజమైన ఆప్యాయత, ప్రేమ కనిపిస్తాయి.

    సలహా

    సహజంగా మాట్లాడడమంటే అమర్యాదగా మాట్లాడడమని అనుకోకండి. తప్పులు లేకుండా, స్పష్టంగా మాట్లాడి మీ సందేశానికి ఉన్న గౌరవాన్ని కాపాడండి.

  • వినేవాళ్ల వైపు చూడండి. మీ సంస్కృతిలో తప్పు కాకపోతే కళ్లల్లోకి చూసి మాట్లాడండి. మీరు ప్రసంగం ఇస్తున్నప్పుడు, అందరిని ఒకేసారి కాకుండా ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తూ మాట్లాడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి