కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 1 పేజీ 4
  • మంచి ఉపోద్ఘాతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి ఉపోద్ఘాతం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫలవంతమైన ఉపోద్ఘాతములు
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 1 పేజీ 4

అధ్యాయం 1

మంచి ఉపోద్ఘాతం

లేఖనం

అపొస్తలుల కార్యాలు 17:22

ఏమి చేయాలి? మీ ఉపోద్ఘాతం లేదా పరిచయ మాటలు ఆసక్తి కలిగించాలి. అలాగే, మీరు ఏమి చెప్పబోతున్నారో, దాన్ని ఎందుకు తెలుసుకోవాలో వినేవాళ్లకు వెంటనే అర్థమయ్యేలా ఉపోద్ఘాతం ఉండాలి.

ఎలా చేయాలి?

  • ఆసక్తి కలిగించండి. వినేవాళ్లకు ఆసక్తి కలిగించే ఒక ప్రశ్న గానీ, వాక్యం గానీ, నిజంగా జరిగిన అనుభవం గానీ, వార్త గానీ ఎంచుకోండి.

    సలహా

    వినేవాళ్ల ఇష్టాల గురించి, వాళ్లకున్న సమస్యల గురించి ముందుగానే జాగ్రత్తగా ఆలోచించి, దానికి తగ్గట్టు మీ ఉపోద్ఘాతాన్ని మార్చుకోండి.

  • మీరు ఏమి చెప్తున్నారో అర్థమయ్యేలా చూసుకోండి. మీ ఉపోద్ఘాతం వినగానే మీరు ఏమి చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో వినేవాళ్లకు వెంటనే అర్థమవ్వాలి.

  • మీరు చెప్తున్న విషయం ఎందుకు ప్రాముఖ్యమో చూపించండి. వినేవాళ్ల అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడండి. మీరు చెప్తున్న విషయం వాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో వాళ్లకు బాగా అర్థమవ్వాలి.

    సలహా

    ప్రసంగం కోసం సిద్ధపడుతున్నప్పుడు, ‘నా సంఘంలోని సహోదరసహోదరీలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు?’ అనే ప్రశ్న వేసుకొని, వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా మీ ఉపోద్ఘాతాన్ని మార్చుకోండి.

పరిచర్యలో

వినే వ్యక్తికి దేని మీద ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి ఆయన చేసే పనులను లేదా పరిసరాలను గమనించండి. వాటి గురించి ఒక చిన్న మాట చెప్పి లేదా ఒక ప్రశ్న వేసి మాట్లాడడం మొదలుపెట్టండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి