పాట 113
మనకు అనుగ్రహించబడిన శాంతి
1. ఐక్యతకు, శాంతికి
యెహోవా మూలం.
స్థాపిస్తాడు శాంతిని,
మాన్పించి యుద్ధం.
సమాధానాధిపతి
క్రీస్తు సౌమ్యుడు.
నీతికోసం పోరాడి
శాంతి తెస్తాడు.
2. పరుషపు మాటల్ని
విడిచిపెట్టాం.
నాగళ్లుగా మార్చాము
ఖడ్గాల్ని మనం.
శాంతి నిలిపేందుకు
క్షమిద్దాం మనం.
గొర్రెలమై యేసుకు,
శాంతిగా ఉందాం.
3. దేవుడిచ్చే శాంతిని
చూసి అందరు,
గుర్తిస్తారు ఆయనే
దీవించాడని.
దైవరాజ్యం శాంతిని
తెచ్చు త్వరలో,
శాంతిమార్గం చాటుతూ
నడుద్దాం దాన్లో.
(కీర్త. 46:9; యెష. 2:4; యాకో. 3:17, 18 కూడా చూడండి.)