13వ సెక్షన్‌కు పరిచయం
యేసు అపరిపూర్ణమైన మనుషుల కోసం ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకు వచ్చాడు. ఆయన చనిపోయినా గానీ లోకాన్ని జయించాడు. యెహోవా ఆయన కుమారుడికి నమ్మకంగా ఉండి ఆయన్ని మళ్లీ బ్రతికించాడు. చనిపోయే క్షణం వరకు, యేసు వినయంగా ఇతరులకు సేవ చేశాడు. వాళ్లు తప్పులు చేసినప్పుడు వాళ్లను క్షమించాడు. తిరిగి లేచాక యేసు శిష్యులకు కనిపించాడు. ఆయన వాళ్లకు ఇచ్చిన ముఖ్యమైన పనిని ఎలా చేయాలో నేర్పించాడు. మీకు పిల్లలుంటే మనం కూడా అదే పని చేయాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.