9వ సెక్షన్‌కు పరిచయం
ఈ సెక్షన్‌లో యెహోవా మీద గొప్ప విశ్వాసాన్ని చూపించిన యువకులు, ప్రవక్తలు, రాజులు గురించి చూస్తాం. సిరియా దేశంలో ఉంటున్న ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న పాప యెహోవా ప్రవక్త నయమానును బాగుచేస్తాడని నమ్మింది. ప్రవక్త అయిన ఎలీషా శత్రువు సైన్యం నుండి యెహోవా అతన్ని ఖచ్చితంగా కాపాడతాడని నమ్మాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా పసివాడైన యోవాషును అతని చెడ్డ నానమ్మ అతల్యా నుండి కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పడేసుకున్నాడు. యెహోవా యెరూషలేమును రక్షిస్తాడని రాజైన హిజ్కియా నమ్మి అష్షూరీయులు బెదిరించినా లొంగిపోలేదు. రాజైన యోషీయా దేశం నుండి విగ్రహారాధన తీసేసి, ఆలయాన్ని బాగు చేసి, దేశాన్ని సత్యారాధన వైపు నడిపించాడు.