కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 51 పేజీ 124-పేజీ 125 పేరా 2
  • ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆ అమ్మాయి సహాయం చేయాలనుకుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మొదట్లో మొండికేసినా తర్వాత మాట విన్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం
    నా బైబిలు కథల పుస్తకము
  • తన దేవుని గురించి ధైర్యంగా చెప్పింది
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 51 పేజీ 124-పేజీ 125 పేరా 2
బాగవ్వడానికి నయమాను ఎలీషాను కలుస్తాడు

లెసన్‌ 51

ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప

ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న పాప, ఇంటికి చాలా దూరంలో సిరియా దేశంలో ఉంది. సిరియా సైన్యం ఆమె కుటుంబం దగ్గరనుండి ఆ పాపను తీసుకెళ్లి పోయింది. ఇప్పుడు ఆమె సైనిక అధికారియైన నయమాను భార్యకు పనిమనిషిగా ఉంది. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు యెహోవాను ఆరాధించకపోయినా ఆ పాప యెహోవాకే ఆరాధన చేసేది.

నయమానుకు ఒక భయంకరమైన చర్మవ్యాధి ఉంది. ఆయన ఎప్పుడూ నొప్పితో బాధపడేవాడు. ఆయనకు సహాయం చేయాలని ఆ చిన్న పాపకు బాగా అనిపించింది. ఆ పాప నయమాను భార్యతో ఇలా అంది: ‘మీ భర్తను బాగు చేయగలిగే ఒకరి గురించి నాకు తెలుసు. ఇశ్రాయేలులో ఎలీషా అనే ఒకతను ఉన్నాడు. ఆయన యెహోవా ప్రవక్త. ఆయన మీ భర్తను బాగు చేయగలడు.’

నయమాను భార్య ఆ చిన్న పాప చెప్పిన దాన్ని నయమానుకు చెప్పింది. జబ్బు తగ్గడానికి ఆయన ఏదైనా చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలులో ఎలీషా ఇంటికి వెళ్లాడు. ఎలీషా అతన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూస్తాడని అనుకున్నాడు. కానీ అతనితో నేరుగా మాట్లాడకుండా నయమానును పలకరించడానికి ఎలీషా తన సేవకున్ని పంపించి ఈ సందేశాన్ని ఇచ్చాడు: ‘వెళ్లి, యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానం చేయి. అప్పుడు నువ్వు బాగవుతావు.’

నయమాను చాలా నిరాశపడిపోయాడు. ఆయన ఇలా అన్నాడు: ‘ఈ ప్రవక్త తన దేవున్ని పిలుస్తూ నా పై చేతులు ఊపుతూ నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. కానీ, ఆయన ఇశ్రాయేలులో ఉన్న ఈ నదికి వెళ్లమంటున్నాడు. సిరియాలో ఎన్నో మంచి నదులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్లలేనా?’ నయమానుకు కోపం వచ్చి ఎలీషా ఇంటి నుండి వెళ్లిపోయాడు.

నయమాను యొర్దాను నదిలో స్నానం చేసి బాగయ్యాడు

నయమాను సరిగ్గా ఆలోచించడానికి అతని సేవకులు సహాయం చేశారు. వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: ‘బాగవ్వడానికి మీరు ఏదైనా చేస్తారు కదా? ఈ ప్రవక్త చెప్పినది చాలా చిన్న పనే కదా? ఒకసారి చేసి చూడండి.’ నయమాను వాళ్ల మాట విన్నాడు. ఆయన యొర్దాను నదికి వెళ్లి ఏడుసార్లు నీళ్లలో మునిగాడు. ఏడవసారి నయమాను నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు పూర్తిగా నయమైపోయాడు. ఎంతో కృతజ్ఞతతో నిండిపోయి ఆయన ఎలీషాకు థ్యాంక్స్‌ చెప్పడానికి తిరిగి అతని దగ్గరికి వెళ్లాడు. నయమాను ఇలా అన్నాడు: ‘యెహోవాయే నిజమైన దేవుడని నాకు ఇప్పుడు తెలుసు.’ నయమాను బాగైపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ చిన్న ఇశ్రాయేలు పాపకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి.

“పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు.”—మత్తయి 21:16

ప్రశ్నలు: మీకేమనిపిస్తుంది, ఆ చిన్న ఇశ్రాయేలు పాప నయమాను భార్యతో మాట్లాడడం ఈజీయేనా? అంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ పాపకు ఏది సహాయం చేసింది?

2 రాజులు 5:1-19; లూకా 4:27

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి