కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 7/1 పేజీలు 20-25
  • ఆ అమ్మాయి సహాయం చేయాలనుకుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆ అమ్మాయి సహాయం చేయాలనుకుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప
    నా బైబిలు పుస్తకం
  • మొదట్లో మొండికేసినా తర్వాత మాట విన్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ధైర్యంగా మాట్లాడిన చిన్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 7/1 పేజీలు 20-25

మీ పిల్లలకు నేర్పించండి

ఆ అమ్మాయి సహాయం చేయాలనుకుంది

మీకు అనారోగ్యంతో బాధపడుతున్నవారెవరైనా తెలుసా?​— వారికి సహాయం చేయడానికి ఏదైనా చేయగలిగితే బావుండునని మీరనుకున్నారా?​—ఒకవేళ వారు వేరే దేశస్థులో వేరే మతస్థులో అయినా, మీరు అలాగే అనుకుంటారా? వారు బాగవ్వడానికి సహాయం చేయాలనుకుంటారా?​—దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న అమ్మాయి అలాగే చేసింది. అప్పుడేమి జరిగిందో కాసేపు మాట్లాడుకుందాం.

ఆ చిన్న అమ్మాయి నివసించిన ప్రాచీన ఇశ్రాయేలుకు, దగ్గర్లో ఉన్న సిరియా దేశానికి తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. (1 రాజులు 22:1) ఒకరోజు సిరియన్లు ఇశ్రాయేలు మీదికి వచ్చి ఆ చిన్న అమ్మాయిని సిరియాకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఆ చిన్న అమ్మాయి సిరియా సైన్యాధిపతియైన నయమాను భార్య దగ్గర పనిచేసేది. నయమానుకు కుష్ఠు అనే ఘోరమైన వ్యాధి ఉండేది. ఆ వ్యాధి వల్ల శరీరావయవాలు పాడైపోతాయి.

నయమాను భార్యతో మాట్లాడుతున్న పనిపిల్ల

ఆ చిన్న అమ్మాయి నయమాను భార్యతో అతని వ్యాధి ఎలా నయమవగలదో చెప్పింది. ‘నయమాను షోమ్రోనుకు వెళ్తే, యెహోవా ప్రవక్తయైన ఎలీషా ఆయన కుష్ఠవ్యాధిని బాగుచేస్తాడు’ అంది. ఆ చిన్న అమ్మాయి ఎలీషా గురించి మాట్లాడినదాన్నిబట్టి ప్రవక్త తనను నిజంగా బాగుచేయ​గలడనే నమ్మకం నయమానుకు కలిగింది. కాబట్టి సిరియా రాజైన బెన్హదదు అనుమతి తీసుకుని నయమాను, ఆయన సేవకులు ఎలీషాను వెతుక్కుంటూ దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించారు.

ముందు వాళ్లు ఇశ్రాయేలు రాజైన యెహోరాము దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు ఆయనకు రాజైన బెన్హదదు, నయమానుకు సహాయం చేయమని కోరుతూ వ్రాసిన ఉత్తరాన్ని చూపించారు. కానీ యెహోరాముకు యెహోవా మీద గానీ ఆయన ప్రవక్తయైన ఎలీషా మీద గానీ నమ్మకం లేదు. బెన్హదదు ఏదో సాకుతో తమతో యుద్ధం చేయాలని చూస్తున్నాడని యెహోరాము అనుకున్నాడు. దీని గురించి ఎలీషా విన్నప్పుడు, “అతని నాయొద్దకు రానిమ్ము” అని రాజైన యెహోరాముతో అన్నాడు. నయమానుకు కలిగిన ఘోరమైన వ్యాధిని బాగుచేయగల శక్తి దేవునికి ఉందని ఎలీషా చూపించాలనుకున్నాడు.​—2 రాజులు 5:1-8.

నయమాను తన గుఱ్ఱాలతో, రధాలతో ఎలీషా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నయమానుతో ఇలా చెప్పమని ఆయన ఒక దూతను పంపించాడు, ‘నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ వ్యాధి బాగవుతుంది.’ దానితో నయమానుకు కోపం వచ్చింది. ఎలీషా బయటకు వచ్చి రోగముగా ఉన్న స్థలముమీద తన చెయ్యి ఆడించి కుష్ఠరోగమును మాన్పుతాడని నయమాను ఆశించాడు. కానీ ఎలీషా దూతను పంపేసరికి నయమాను కోపంతో తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు.​—2 రాజులు 5:9-12.

మీరు నయమాను సేవకుల్లో ఒకరైతే ఏమి చేసుండేవారు?​— నయమాను సేవకులు ఆయనను ఇలా అడిగారు, ‘ఆ ప్రవక్త యేదైన ఒక గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయరా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికన్నా చిన్నదికదా?’ నయమాను వాళ్ళ మాట విని, వెళ్ళి “యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.”

అప్పుడు నయమాను ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును.” అంతేకాక ఆయన ఎలీషాకు ఇలా వాగ్దానం చేశాడు, “యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను.”​—2 రాజులు 5:13-17.

ఆ చిన్న అమ్మాయిలాగే మీరు కూడా యెహోవా గురించి, ఆయన చేయగలదాని గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నారా?​— యేసు భూమ్మీద ఉన్నప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయనను నమ్మి ఆయనతో ఇలా అన్నాడు, ‘నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.’ దానికి యేసు ఏమన్నాడో మీకు తెలుసా?​— “నాకిష్టమే” అన్నాడు. యెహోవా నయమానును బాగుచేసినట్లే ఆయన ఆ కుష్ఠరోగిని బాగుచేశాడు.​—మత్తయి 8:2, 3.

ప్రజలందరూ ఆరోగ్యంగా, నిరంతరం జీవించేలా యెహోవా సృష్టించబోయే క్రొత్త లోకం గురించి మీకు తెలుసా?​—(2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) అయితే మీరు ఈ అద్భుతమైన విషయాల గురించి తప్పకుండా అందరికీ చెప్పాలనుకుంటారు. (w08 6/1)

ప్రశ్నలు:

  • నయమాను మనుష్యులు తీసుకెళ్ళిపోయిన ఒక చిన్న అమ్మాయి, నయమానుకు ఎలా సహాయం చేసింది?

  • ఎలీషా చెప్పినది చేయడానికి నయమాను ముందు ఎందుకు ఇష్టపడలేదు, అయితే ఆయన మనసును మార్చినదేమిటి?

  • ఆ చిన్న అమ్మాయి చేసినట్లే చేయాలంటే, మీరేమి చేయాలి?

  • యేసు ఏమి చేయాలనుకున్నాడు, దేవుని క్రొత్త లోకంలో జీవితం ఎందుకు అద్భుతంగా ఉంటుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి