4వ సెక్షన్‌కు పరిచయం
ఈ సెక్షన్‌లో మనం యోసేపు, యోబు, మోషే, ఇశ్రాయేలీయుల గురించి చూస్తాం. వీళ్లందరూ అపవాది అయిన సాతాను చేతిలో చాలా కష్టాలు పడ్డారు. వాళ్లలో కొంతమంది అన్యాయం, జైలు శిక్ష, బానిసత్వం, చివరికి మరణం కూడా చూడాల్సి వచ్చింది. కానీ ఎన్నో విధాలుగా యెహోవా వాళ్లను కాపాడాడు. ఆ సేవకులకు ఎంత చెడు జరిగినా యెహోవా మీద విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఎలా ఉన్నారో తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి.
ఐగుప్తు దేవుళ్ల కంటే యెహోవాకు చాలా శక్తి ఉందని చూపించడానికి ఆయన పది తెగుళ్లను తెప్పించాడు. యెహోవా తన ప్రజలను ఆ రోజుల్లో ఎలా కాపాడాడో, ఇప్పుడు ఎలా కాపాడతాడో ముఖ్యంగా చెప్పండి.