కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 1 పేజీలు 6-11
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సంస్థలోని పరలోక భాగం
  • యెహోవా సంస్థ ముందుకు సాగిపోతోంది
  • ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దేవుని సంస్థలో భాగంగా సురక్షితంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ప్రకాశమానమైన యెహోవా రథము కదలుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవా ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడువుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 1 పేజీలు 6-11

1వ అధ్యాయం

యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ

ప్రపంచవ్యాప్తంగా మత, రాజకీయ, వాణిజ్య, సామాజిక సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరు. కానీ ఒక్క సంస్థ మాత్రం వాటన్నిటికి చాలా భిన్నంగా ఉంది. అదే యెహోవాసాక్షుల సంస్థ అని దేవుని వాక్యం స్పష్టంగా సూచిస్తుంది.

2 సంతోషకరమైన విషయమేమిటంటే, మీరు యెహోవా సంస్థతో సహవసించడం మొదలుపెట్టారు. దేవుని ఇష్టం ఏంటో స్వయంగా తెలుసుకున్నారు, ఇప్పుడు దాన్ని చేస్తున్నారు. (కీర్త. 143:10; రోమా. 12:2) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమగల సహోదరుల బృందంతో కలిసి మీరు చురుగ్గా సేవ చేస్తున్నారు. (2 కొరిం. 6:4; 1 పేతు. 2:17; 5:9) దానివల్ల దేవుని వాక్యం మాటిచ్చినట్లు మీరు మెండైన దీవెనలు, పట్టలేనంత సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. (సామె. 10:22; మార్కు 10:30) ఇప్పుడు మీరు యెహోవా ఇష్టాన్ని నమ్మకంగా చేయడం ద్వారా శాశ్వతమైన, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సిద్ధపడుతున్నారు.—1 తిమో. 6:18, 19; 1 యోహా. 2:17.

3 మన గొప్ప సృష్టికర్తకు ఒక ప్రత్యేకమైన ప్రపంచవ్యాప్త సంస్థ ఉంది. అది దైవపరిపాలనా పద్ధతిలో పరిపాలించబడుతోంది. అంటే అందరికన్నా పైస్థానంలో ఉన్న యెహోవాయే దాని పరిపాలకుడు. ఆయన మీద మనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన మన న్యాయమూర్తి, మన శాసనకర్త, మన రాజు. (యెష. 33:22) దేవుడు అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో చేస్తాడు కాబట్టి, తన సంకల్ప నెరవేర్పులో మనం తన ‘తోటిపనివాళ్లుగా’ సేవ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు.—2 కొరిం. 6:1, 2.

4 ఈ వ్యవస్థ నాశనం ఇప్పుడు ఇంకా దగ్గరపడుతుండగా, మన నియమిత రాజైన క్రీస్తుయేసు నాయకత్వంలో ముందుకు సాగిపోదాం. (యెష. 55:4; ప్రక. 6:2; 11:15) భూమ్మీదున్నప్పుడు తాను చేసిన పరిచర్య కన్నా తన అనుచరులు ఇంకా గొప్ప పనులు చేస్తారని యేసే స్వయంగా చెప్పాడు. (యోహా. 14:12) ఆ మాట నిజం, ఎందుకంటే తాను పరిచర్య చేసిన సమయం కన్నా ఎంతో ఎక్కువ కాలవ్యవధిలో, అధిక సంఖ్యలో యేసు అనుచరులు రోజురోజుకీ విస్తరిస్తున్న క్షేత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన అనుచరులు మంచివార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తారు.—మత్త. 24:14; 28:19, 20; అపొ. 1:8.

5 అది ఇప్పటికే నెరవేరడం చూశాం. అయితే, యెహోవా నిర్ణయించిన సమయానికి ఈ మంచివార్త ప్రకటించే పని ఆగిపోతుందని యేసు స్పష్టంగా చెప్పాడు. దేవుని ప్రవచన వాక్యంలోని సూచనలన్నీ, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే యెహోవా మహారోజు దగ్గరపడిందని చూపిస్తున్నాయి.—యోవే. 2:31; జెఫ. 1:14-18; 2:2, 3; 1 పేతు. 4:7.

దేవుడు కోరే దాన్ని చేయడానికి మనం ఇంకా ఎక్కువగా కృషి చేయాలి. అలా చేయాలంటే దేవుని సంస్థ ఎలా పని చేస్తుందో మనం బాగా తెలుసుకోవాలి

6 ఈ చివరి గడియలో యెహోవా ఇష్టమేమిటో గ్రహిస్తుండగా, దేవుడు కోరే దాన్ని చేయడానికి మనం ఇంకా ఎక్కువ కృషిచేయాలి. అలా చేయాలంటే దేవుని సంస్థ ఎలా పని చేస్తుందో మనం బాగా తెలుసుకోవాలి, దానికి పూర్తిగా సహకరించాలి. దేవుని ప్రేరేపిత వాక్యంలోని లేఖన సూత్రాలు, ఆజ్ఞలు, నియమాలు, ఆదేశాలు, విధులు, బోధల ఆధారంగా ఈ సంస్థ పని చేస్తుంది.—కీర్త. 19:7-9.

7 యెహోవా ప్రజలు అలాంటి బైబిలు ఆధారిత నిర్దేశాన్ని పాటించినప్పుడు ఐక్యంగా, శాంతిగా జీవిస్తారు; పనిచేస్తారు. (కీర్త. 133:1; యెష. 60:17; రోమా. 14:19) అన్నిచోట్లా మన సహోదరుల మధ్య ఉన్న అనుబంధం దేనివల్ల బలపడుతుంది? ప్రేమ వల్ల. మనం చేసే ప్రతీది ప్రేమతోనే చేస్తాం. అంతేకాదు ఒకరకంగా, మనం ప్రేమను ధరించుకున్నాం. (యోహా. 13:34, 35; కొలొ. 3:14) దేవుని అనుగ్రహం పొందిన ఈ మార్గంలో నడుస్తూ, యెహోవా సంస్థలోని పరలోక భాగంతో పాటు ముందుకు సాగుదాం.

యెహోవా సంస్థలోని పరలోక భాగం

8 ప్రవక్తలైన యెషయా, యెహెజ్కేలు, దానియేలు యెహోవా సంస్థలోని పరలోక భాగం గురించిన దర్శనాలు చూశారు. (యెష., 6వ అధ్యా.; యెహె., 1వ అధ్యా.; దాని. 7:9, 10) అదేవిధంగా, అపొస్తలుడైన యోహాను కూడా ఈ పరలోక ఏర్పాటును ఓ దర్శనంలో చూశాడు. దానికి సంబంధించిన కొన్ని వివరాల్ని కూడా ప్రకటన పుస్తకంలో రాశాడు. ఆ దర్శనంలో, మహిమాన్విత సింహాసనం మీద యెహోవా కూర్చుని ఉండడం, ఆయనతోపాటు పరలోక ప్రాణులు ఉండడం యోహాను చూశాడు. వాళ్లు ఇలా ప్రకటిస్తూ ఉన్నారు: “సర్వశక్తిమంతుడు, ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు అయిన యెహోవా దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.” (ప్రక. 4:8) అంతేకాదు, ‘సింహాసనానికి మధ్యలో గొర్రెపిల్ల’ ఉండడం కూడా యోహాను చూశాడు. ఆ గొర్రెపిల్ల “దేవుని గొర్రెపిల్ల” అయిన యేసుక్రీస్తు.—ప్రక. 5:6, 13, 14; యోహా. 1:29.

9 ఈ దర్శనంలో, సింహాసనం మీద యెహోవా కూర్చుని ఉండడం, ఆయనే ఈ సంస్థకు అధిపతి అని సూచిస్తుంది. యెహోవా గురించి, ఆయనకున్న అత్యున్నత స్థానం గురించి 1 దినవృత్తాంతాలు 29:11, 12 ఇలా చెప్తుంది: “యెహోవా, గొప్పతనం, బలం, తేజస్సు, వైభవం, ఘనత నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే. యెహోవా, రాజ్యం నీది. అందరి మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఐశ్వర్యాన్ని, మహిమను ఇచ్చేది నువ్వే, నువ్వు అన్నిటి మీద పరిపాలన చేస్తున్నావు; శక్తి, బలం నీ చేతిలో ఉన్నాయి, నీ చెయ్యి ఎవరినైనా గొప్ప చేయగలదు, అందరికీ బలాన్ని ఇవ్వగలదు.”

10 యెహోవా తోటిపనివానిగా యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని, ఎంతో అధికారాన్ని పొందాడు. నిజానికి, “దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద లోబర్చి, సంఘానికి సంబంధించి అన్నిటిమీద ఆయన్ని శిరస్సుగా నియమించాడు.” (ఎఫె. 1:22) యేసు గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు. పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్న ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని, తండ్రైన దేవునికి మహిమ కలిగేలా ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తే ప్రభువని బహిరంగంగా ఒప్పుకోవాలని దేవుడు అలా చేశాడు.” (ఫిలి. 2:9-11) కాబట్టి, యేసుక్రీస్తు నీతియుక్త నాయకత్వం మీద మనం పూర్తి నమ్మకం ఉంచవచ్చు.

11 దానియేలు ప్రవక్త ఓ దర్శనంలో, మహా వృద్ధుడు పరలోక సింహాసనం మీద కూర్చుని ఉండడం చూశాడు. అంతేకాదు, దేవదూతలు “వేవేలమంది ఆయనకు పరిచారం చేస్తూ ఉన్నారు, కోట్లమంది ఆయన ఎదుట నిలబడివున్నారు.” (దాని. 7:10) ఈ దేవదూతల సైన్యాన్ని ‘పవిత్రసేవ చేసే దేవదూతలు’ అనీ ‘రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయడానికి’ పంపబడ్డారు అనీ బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 1:14) ఈ పరలోక ప్రాణులంతా ‘సింహాసనాలుగా, పరిపాలనలుగా, ప్రభుత్వాలుగా, అధికారాలుగా’ వ్యవస్థీకరించబడ్డారు.—కొలొ. 1:16.

12 యెహోవా సంస్థలోని పరలోక భాగానికి సంబంధించిన ఆ విషయాల గురించి ధ్యానించినప్పుడు, యెషయా తాను చూసిన దర్శనానికి ఎలా స్పందించాడో, ఎందుకలా స్పందించాడో మనం అర్థంచేసుకోవచ్చు. ఆ దర్శనంలో “యెహోవా ఒక ఉన్నతమైన గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉండడం” అలాగే “ఆయనకు పైగా సెరాపులు నిలబడి” ఉండడం యెషయా చూశాడు. అది చూసినప్పుడు ఆయనిలా అన్నాడు: “అయ్యో, నాకు శ్రమ! నేను చచ్చినవాడితో సమానం. ఎందుకంటే, అపవిత్రమైన పెదాలుగల నేను, అపవిత్రమైన పెదాలుగల ప్రజల మధ్య నివసిస్తున్న నేను రాజూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాను కళ్లారా చూశాను!” నిజానికి, యెహోవా సంస్థ ఎంత విస్తరించి ఉందో యెషయా గ్రహించినప్పుడు ఆయన ఆశ్చర్యంతో నిండిపోయి, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ అనుభవం ఆయనమీద ఎంతగా ప్రభావం చూపించిందంటే, యెహోవా తీర్పుల్ని ప్రకటించే ప్రత్యేకమైన పనికి సంబంధించిన ఆహ్వానం పరలోకం నుండి వచ్చినప్పుడు యెషయా ఇలా అన్నాడు: “నేనున్నాను! నన్ను పంపు!”—యెష. 6:1-5, 8.

13 యెహోవా సంస్థను గుర్తించి, దానిపట్ల మెప్పుదల చూపించినప్పుడు దేవుని ప్రజలు కూడా యెషయాలాగే స్పందిస్తారు. సంస్థ ముందుకు సాగిపోతుండగా, మనం కూడా దానితోపాటు ముందుకు వెళ్లడానికి కృషి చేస్తాం. నేడున్న యెహోవా సంస్థ మీద నమ్మకం ఉందని చూపించడానికి గట్టిగా కృషి చేస్తాం.

యెహోవా సంస్థ ముందుకు సాగిపోతోంది

14 యెహోవా ఒక పెద్ద పరలోక రథాన్ని నడిపిస్తున్నట్లు యెహెజ్కేలు మొదటి అధ్యాయం వర్ణిస్తోంది. తేజోవంతమైన ఆ రథం, యెహోవా సంస్థలోని అదృశ్య భాగాన్ని సూచిస్తుంది. ఆయన ఆ రథాన్ని ప్రేమతో నడిపిస్తూ, తన సంకల్పానికి తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు.—కీర్త. 103:20.

15 ఈ రథానికున్న ప్రతీ చక్రం లోపల, అదే పరిమాణంలో ఉన్న మరో చక్రం అడ్డంగా బిగించి ఉంది. అందుకే ఆ చక్రాలు “నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్లగలవు” అని చెప్పబడింది. (యెహె. 1:17) ఆ చక్రాలు తమ దిశను వెంటనే మార్చుకోగలవు. అయితే, ఆ రథం అదుపులో లేదనో లేక దానిపై తెలివైన పర్యవేక్షణ లేదనో దానర్థం కాదు. యెహోవా తన సంస్థను ఎటుపడితే అటు వెళ్లనివ్వడు. యెహెజ్కేలు 1:20 ఇలా చెప్తుంది: ‘పవిత్రశక్తి వాటిని ఎక్కడికి నడిపిస్తుందో అవి అక్కడికి వెళ్తాయి.’ కాబట్టి తాను అనుకున్న దిశలో సంస్థ వెళ్లేలా యెహోవా తన పవిత్రశక్తితో దాన్ని నడిపిస్తాడు. మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నేను సంస్థతోపాటు ముందుకు వెళ్తున్నానా?’

16 యెహోవా సంస్థతోపాటు ముందుకు వెళ్లాలంటే, కూటాలకు హాజరవ్వడం, పరిచర్యకు వెళ్లడం కన్నా ఎక్కువే చేయాలి. ముఖ్యంగా మనం ప్రగతి సాధిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలి. మనం ‘ఎక్కువ ప్రాముఖ్యమైన వాటిని పరిశీలించి తెలుసుకోవాలి’ అలాగే యెహోవా సంస్థ ఇస్తున్న తాజా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. (ఫిలి. 1:10; 4:8, 9; యోహా. 17:3) ఒక సంస్థ అన్నప్పుడు అందులో మంచి సమన్వయం, వ్యక్తుల మధ్య సహకారం ఉంటాయని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి, యెహోవా మనకిచ్చిన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సామర్థ్యాల్ని, వనరుల్ని ఆయన పని చేయడం కోసం వీలైనంత ఎక్కువగా ఉపయోగించడం ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి. యెహోవా పరలోక రథంతోపాటు మనం ముందుకు సాగిపోతుండగా, మన జీవితాలు మనం ప్రకటిస్తున్న సందేశానికి తగ్గట్టుగా ఉంటాయి.

17 యెహోవా సంస్థ సహాయంతో, మనం దేవుని ఇష్టం చేయడంలో ముందుకు సాగిపోతున్నాం. ఈ పరలోక రథాన్ని నడిపిస్తున్నది యెహోవాయే కాబట్టి, మనం ఈ రథంతోపాటు ముందుకు వెళ్లడం ద్వారా, మన ఆశ్రయదుర్గమైన యెహోవా మీద గౌరవం, నమ్మకం ఉన్నాయని చూపిస్తాం. (కీర్త. 18:31) “యెహోవా తన ప్రజలకు బలాన్నిస్తాడు. యెహోవా తన ప్రజల్ని శాంతితో దీవిస్తాడు” అని బైబిలు మాటిస్తుంది. (కీర్త. 29:11) నేడు మనం యెహోవా సంస్థలో ఒకరిగా ఉండడంవల్ల, ఆయనిచ్చే బలాన్ని పొందుతూ తన సంస్థీకృత ప్రజలకు ఆయన అనుగ్రహించే శాంతిని ఆస్వాదిస్తున్నాం. అవును, మనం ఇప్పుడూ ఎల్లప్పుడూ యెహోవా ఇష్టం చేస్తుండగా, ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాల్ని ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి