కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od పేజీలు 4-5
  • పరిపాలక సభ నుండి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ నుండి ఉత్తరం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుడిచ్చిన బైబిలుకు అనుగుణంగా క్రమపద్ధతిలో నడవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా గొఱ్ఱెలకు వాత్సల్యంతో కూడిన శ్రద్ధ అవసరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యౌవన సహోదరులారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od పేజీలు 4-5

పరిపాలక సభ నుండి ఉత్తరం

మంచివార్త ప్రకటిస్తున్న ప్రియమైన తోటి ప్రచారకులకు:

ఏకైక సత్య దేవుడైన యెహోవాను ఐక్యంగా ఆరాధించడం నిజంగా మనకు దొరికిన గొప్ప గౌరవం! మనం ఆయన ‘తోటి పనివాళ్లం.’ ఆయన స్థాపించిన రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడం, బోధించడం అనే పవిత్రమైన, ప్రాణాల్ని కాపాడే పని మనకు అప్పగించబడింది. (1 కొరిం. 3:9; మత్త. 28:19, 20) ఆ ప్రపంచవ్యాప్త పనిని శాంతిగా, కలిసికట్టుగా చేయాలంటే మనం చక్కగా సంస్థీకరించబడి ఉండాలి.—1 కొరిం. 14:40.

నేడు క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది. ఒక యెహోవాసాక్షిగా మీకున్న సేవావకాశాల గురించి, బాధ్యతల గురించి ఇది చర్చిస్తుంది. మీ సేవావకాశాల్ని విలువైనవిగా ఎంచుతూ, మీ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తే, మీరు ‘విశ్వాసంలో స్థిరపర్చబడతారు.’—అపొ. 16:4, 5; గల. 6:5.

కాబట్టి, ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇందులోని సమాచారాన్ని మీ జీవితంలో ఏయే విధాలుగా పాటించవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ఈ మధ్యే బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా అయ్యుంటే, బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవ్వడానికి మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులైతే, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి, యెహోవాకు మీరు చేస్తున్న సేవను ఇంకా విస్తృతపర్చుకోవడానికి ఏం చేయవచ్చు? (1 తిమో. 4:15) సంఘ శాంతికి మీరెలా తోడ్పడవచ్చు? (2 కొరిం. 13:11) ఈ ప్రశ్నలకు జవాబుల్ని ఈ పుస్తకంలో చదివి తెలుసుకోండి.

మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరుడైతే, సంఘ పరిచారకునిగా, ఆ తర్వాత సంఘ పెద్దగా అర్హత సాధించడానికి మీరేమి చేయవచ్చు? దేవుని సంస్థలోకి కొత్తవాళ్లు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు కాబట్టి, నాయకత్వం వహించడానికి అర్హులైన సహోదరుల అవసరం ఎంతో ఉంది. ఈ ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకునేలా ‘కృషిచేయడంలో’ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది.—1 తిమో. 3:1.

యెహోవా ఏర్పాటులో మీ స్థానమేమిటో గుర్తించి, దాన్ని విలువైనదిగా ఎంచడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మేము మిమ్మల్నందర్నీ ఎంతో ప్రేమిస్తున్నాం. మన పరలోక తండ్రి అయిన యెహోవాను శాశ్వతకాలం సంతోషంగా ఆరాధించే వాళ్లలో మీరూ ఉండాలని మేము ఎప్పుడూ ప్రార్థిస్తాం.—కీర్త. 37:10, 11; యెష. 65:21-25.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి