కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 94 పేజీ 220-పేజీ 221 పేరా 2
  • ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన మరియు వినయముల అవసరత
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యెహోవా ‘న్యాయము తీరుస్తాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మనం దేని గురించైనా గొప్పలు చెప్పుకోవచ్చా?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 94 పేజీ 220-పేజీ 221 పేరా 2
ఒక పరిసయ్యుడు, పన్ను వసూలుచేసే వ్యక్తి ప్రార్థిస్తున్నారు

94వ అధ్యాయం

ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి

లూకా 18:1-14

  • పట్టుదల గల విధవరాలి ఉదాహరణ

  • పరిసయ్యుడు, పన్ను వసూలుచేసే వ్యక్తి

పట్టుదలగా ప్రార్థించడం గురించి యేసు ఇదివరకే తన శిష్యులకు ఒక ఉదాహరణ చెప్పాడు. (లూకా 11:5-13) యేసు ఇప్పుడు సమరయ లేదా గలిలయలో ఉండివుంటాడు. పట్టుదలగా ప్రార్థించడం గురించి మళ్లీ నొక్కిచెప్తూ ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు:

ఒక విధవరాలు న్యాయం చేయమని ఒక న్యాయమూర్తిని వేడుకుంటుంది

“ఒకానొక నగరంలో దేవుడంటే భయం గానీ మనుషులంటే గౌరవం గానీ లేని ఒక న్యాయమూర్తి ఉండేవాడు. అదే నగరంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి, ‘నా ప్రతివాదితో నాకున్న గొడవ పరిష్కరించి నాకు న్యాయం జరిగేలా చూడు’ అని అడుగుతూ ఉండేది. కొంతకాలం పాటు అతను ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఇలా అనుకున్నాడు: ‘నాకు దేవుడంటే భయం గానీ మనుషులంటే గౌరవం గానీ లేకపోయినా, ఈ విధవరాలు నన్ను అదేపనిగా విసిగిస్తోంది కాబట్టి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాను. అప్పుడిక ఆమె ఇలా నా దగ్గరికి వస్తూ తన గొడవతో నన్ను విసిగించకుండా ఉంటుంది.’”—లూకా 18:2-5.

ఆ ఉదాహరణలో ఉన్న పాఠాన్ని యేసు ఇలా వివరించాడు: “అన్యాయస్థుడే అయినా ఆ న్యాయమూర్తి ఏమన్నాడో గమనించండి! కాబట్టి తాను ఎంచుకున్నవాళ్లు రాత్రింబగళ్లు తనను వేడుకుంటూ ఉంటే, దేవుడు తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేలా చేయడా? అంతేకాదు, వాళ్ల విషయంలో ఆయన ఓర్పు కూడా చూపిస్తాడు.” (లూకా 18:6, 7) యేసు తన తండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు?

యెహోవా దేవుడు ఆ అన్యాయస్థుడైన న్యాయమూర్తిలా ఉన్నాడని యేసు చెప్పట్లేదు. బదులుగా, తనను పదేపదే అడిగినవాళ్లకు అన్యాయస్థుడైన న్యాయమూర్తే న్యాయం చేశాడంటే, దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడని ఆయన చెప్తున్నాడు. అంతేకాదు యెహోవా న్యాయవంతుడు, మంచివాడు కాబట్టి పట్టుదలగా ప్రార్థించేవాళ్లకు తప్పకుండా జవాబిస్తాడు. ఆ విషయాన్ని యేసు ఇలా నొక్కిచెప్పాడు: “నేను మీతో చెప్తున్నాను, ఆయన [దేవుడు] వాళ్లకు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు.”—లూకా 18:8.

సాధారణంగా డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకు న్యాయం జరుగుతుంది కానీ దీనులకు, పేదవాళ్లకు జరగదు. కానీ దేవుడు అలా కాదు. సమయం వచ్చినప్పుడు ఆయన న్యాయం చేసి చెడ్డవాళ్లకు శిక్షపడేలా, తన సేవకులు శాశ్వత జీవితం పొందేలా చేస్తాడు.

ఆ విధవరాలు చూపించినలాంటి విశ్వాసం ఎవరికి ఉంది? దేవుడు “త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు” అనే నమ్మకం ఎంతమందికి ఉంది? యేసు ఇప్పటివరకు పట్టుదలగా ప్రార్థించడం గురించి మాట్లాడాడు. తర్వాత, ప్రార్థనకున్న శక్తి మీద విశ్వాసం ఉంచడం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అడిగాడు: “మానవ కుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమ్మీద నిజంగా ఇలాంటి విశ్వాసం కనిపిస్తుందా?” (లూకా 18:8) క్రీస్తు వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం ఎక్కువమందికి ఉండకపోవచ్చని ఆయన ఉద్దేశం.

యేసు మాటల్ని వింటున్నవాళ్లలో కొంతమంది తమకు చాలా విశ్వాసం ఉందని అనుకుంటున్నారు. తామే నీతిమంతులమని నమ్ముతూ, ఇతరుల్ని చిన్నచూపు చూస్తున్నారు. అలాంటి వాళ్లకోసం యేసు ఈ ఉదాహరణ చెప్పాడు:

“ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి ఆలయంలోకి వెళ్లారు. వాళ్లలో ఒకతను పరిసయ్యుడు, ఇంకొకతను పన్ను వసూలుచేసే వ్యక్తి. ఆ పరిసయ్యుడు నిలబడి, మనసులో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: ‘దేవా, నేను మిగతావాళ్లలా లేనందుకు, అంటే దోచుకునేవాళ్లలా, అనీతిమంతుల్లా, వ్యభిచారుల్లా, చివరికి ఈ పన్ను వసూలుచేసే వాడిలా కూడా లేనందుకు నీకు కృతజ్ఞతలు. నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను; నాకు వచ్చే ప్రతీదానిలో పదోవంతు చెల్లిస్తున్నాను.’”—లూకా 18:10-12.

పరిసయ్యులు తాము నీతిమంతులమని అందరికి చూపించుకునేవాళ్లు, ఇతరుల్ని మెప్పించడానికి ప్రయత్నించేవాళ్లు. ఎక్కువమందికి కనిపించాలని సంతలు రద్దీగా ఉండే సోమ, గురువారాల్లో ఉపవాసం ఉండేవాళ్లు. అది వాళ్లు సొంతగా పెట్టుకున్న నియమం. వాళ్లు చిన్నచిన్న కూరమొక్కల్లో కూడా చాలా నిష్ఠగా పదోవంతు చెల్లించేవాళ్లు. (లూకా 11:42) వాళ్లు సామాన్య ప్రజల్ని ఎంత హీనంగా చూసేవాళ్లో, కొన్ని నెలల క్రితం వాళ్లు అన్న ఈ మాటల్లో స్పష్టమౌతుంది: “ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజలు [పరిసయ్యుల దృష్టిలో] శపించబడిన వాళ్లు.”—యోహాను 7:49.

యేసు ఆ ఉదాహరణను ఇలా కొనసాగించాడు: “అయితే పన్ను వసూలుచేసే వ్యక్తి కాస్త దూరంలోనే నిలబడి, ఆకాశం వైపు తల ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చేయలేక, గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నన్ను కరుణించు, నేను పాపిని’ అన్నాడు.” ఆ పన్ను వసూలుచేసే వ్యక్తి వినయంగా తన తప్పుల్ని ఒప్పుకున్నాడు. యేసు ఇలా ముగించాడు: “నేను మీతో చెప్తున్నాను, ఆ పరిసయ్యుడి కన్నా ఇతను ఎక్కువ నీతిమంతుడిగా ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే, తనను తాను గొప్ప చేసుకునే ప్రతీ వ్యక్తి తగ్గించబడతాడు; కానీ తనను తాను తగ్గించుకునే ప్రతీ వ్యక్తి గొప్ప చేయబడతాడు.”—లూకా 18:13, 14.

వినయంగా ఉండడం ఎంత ముఖ్యమో యేసు ఆ ఉదాహరణ ద్వారా స్పష్టం చేశాడు. స్థానం, హోదా వంటివాటికి ప్రాముఖ్యత ఇచ్చే స్వనీతిపరులైన పరిసయ్యుల మధ్య యేసు శిష్యులు పెరిగారు. కాబట్టి యేసు ఇచ్చిన సలహా శిష్యులకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్లకే కాదు యేసు అనుచరులందరికీ ఆ సలహా ఎంతో ఉపయోగపడుతుంది.

  • అన్యాయస్థుడైన న్యాయమూర్తి ఉదాహరణ ద్వారా యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడు?

  • యేసు వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసం కోసం చూస్తాడు?

  • పరిసయ్యులు చూపించే ఎలాంటి స్వభావాన్ని యేసు అనుచరులు అలవర్చుకోకూడదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి