కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 95 పేజీ 222-పేజీ 223 పేరా 9
  • విడాకుల గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి బోధించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విడాకుల గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి బోధించాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • విడాకులు మరియు పిల్లలను ప్రేమించుటను గూర్చిన పాఠములు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • “దేవుడు ఒకటి చేసినవాళ్లను .”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 95 పేజీ 222-పేజీ 223 పేరా 9
ప్రజలు తమ పిల్లల్ని యేసు దగ్గరికి తీసుకొస్తున్నారు

95వ అధ్యాయం

విడాకుల గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి బోధించాడు

మత్తయి 19:1-15 మార్కు 10:1-16 లూకా 18:15-17

  • విడాకుల విషయంలో దేవుని అభిప్రాయమేంటో యేసు చెప్పాడు

  • పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒక ఆశీర్వాదం

  • చిన్నపిల్లల్లా ఉండడం ప్రాముఖ్యం

యేసు, ఆయన శిష్యులు గలిలయ నుండి బయల్దేరి, యొర్దాను నది దాటి, పెరయ గుండా దక్షిణం వైపు ప్రయాణిస్తున్నారు. ఆయన అంతకుముందు పెరయలో ఉన్నప్పుడు, విడాకుల విషయంలో దేవుని ప్రమాణమేంటో పరిసయ్యులకు చెప్పాడు. (లూకా 16:18) ఇప్పుడు వాళ్లు యేసును పరీక్షించడానికి మళ్లీ అదే విషయం గురించి ప్రశ్నించారు.

ఒక స్త్రీలో “అసభ్యకరమైనది ఏదైనా” కనిపిస్తే ఆమెకు విడాకులు ఇవ్వవచ్చని మోషే రాశాడు. (ద్వితీయోపదేశకాండం 24:1) అయితే, ఏ కారణాల వల్ల విడాకులు ఇవ్వాలనే విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. కొంతమందైతే చిన్నచిన్న కారణాలకు కూడా విడాకులు ఇవ్వవచ్చని అనుకునేవాళ్లు. అందుకే పరిసయ్యులు ఇలా అడిగారు: “ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణాన్ని బట్టి తన భార్యకు విడాకులు ఇవ్వడం సరైనదేనా?”—మత్తయి 19:3.

యేసు తెలివిగా, మనుషుల అభిప్రాయాన్ని కాదుగానీ వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుని అభిప్రాయాన్ని చెప్పాడు: “మీరు ఇది చదవలేదా? దేవుడు మొదట్లో వాళ్లను సృష్టించినప్పుడు పురుషునిగా, స్త్రీగా సృష్టించి ఇలా అన్నాడు: ‘అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.’ కాబట్టి వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.” (మత్తయి 19:4-6) దేవుడు ఆదాముహవ్వల్ని పెళ్లి ద్వారా ఒకటి చేసినప్పుడు, విడాకుల గురించి ఆయన ప్రస్తావించలేదు.

పరిసయ్యులు యేసుతో, “మరైతే విడాకుల పత్రం ఇచ్చి భార్యను పంపించేయమని మోషే ఎందుకు చెప్పాడు?” అని వాదించారు. (మత్తయి 19:7) అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీ హృదయాలు మొద్దుబారిపోవడం వల్లే, మీ భార్యలకు విడాకులు ఇవ్వడానికి మోషే అనుమతించాడు. అయితే మొదటి నుండీ అలా లేదు.” (మత్తయి 19:8) ఇక్కడ “మొదటి నుండీ” అన్నప్పుడు, ఏదెను తోటలో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసిన సందర్భం గురించి యేసు మాట్లాడుతున్నాడు. అంతేగానీ మోషే కాలం గురించి కాదు.

తర్వాత యేసు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు: “నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపం [గ్రీకులో పోర్నియా] అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.” (మత్తయి 19:9) కాబట్టి, లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వవచ్చని లేఖనాలు చెప్తున్నాయి.

అప్పుడు శిష్యులు యేసుతో ఇలా అన్నారు: “భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఇలాంటిదైతే, పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.” (మత్తయి 19:10) పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు దాన్ని శాశ్వతమైన బంధంగా చూడాలని స్పష్టమౌతోంది!

పెళ్లి చేసుకోకుండా ఉండడం గురించి మాట్లాడుతూ, కొంతమంది పుట్టడమే నపుంసకులుగా పుడతారనీ, ఇంకొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడతారనీ యేసు చెప్పాడు. వాళ్లు లైంగిక సంబంధాలు పెట్టుకోలేరు. అయితే, కొంతమంది రాజ్య సంబంధ విషయాల మీద ఎక్కువగా మనసుపెట్టేలా, లైంగిక కోరికల్ని అణచుకుంటారు. వినేవాళ్లతో యేసు ఇలా అన్నాడు: “పెళ్లి చేసుకోకుండా ఉండగలిగే వాళ్లను అలాగే ఉండనివ్వండి.”—మత్తయి 19:12, అధస్సూచి.

ఇంతలో, ప్రజలు తమ చిన్నపిల్లల్ని యేసు దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు. బహుశా యేసుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో శిష్యులు ఆ ప్రజల్ని గద్దించారు. అది చూసి యేసు కోప్పడి, శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటివాళ్లదే. నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.”—మార్కు 10:14, 15; లూకా 18:15.

ఎంత చక్కని పాఠమో కదా! మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లల్లా వినయంగా ఉంటూ, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యేసు చిన్నపిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని, వాళ్లను దీవించాడు. అదేవిధంగా, “చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని” స్వీకరించే వాళ్లందరి మీద ఆయన ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు.—లూకా 18:17.

  • విడాకుల గురించి పరిసయ్యులు యేసును ఎలా పరీక్షించారు?

  • విడాకుల విషయంలో దేవుని ప్రమాణమేంటో యేసు ఎలా వివరించాడు?

  • కొంతమంది శిష్యులు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఎందుకు నిర్ణయించుకోవచ్చు?

  • చిన్నపిల్లలతో ప్రేమగా వ్యవహరించడం ద్వారా యేసు ఏ పాఠం నేర్పించాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి