కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • hf భాగం 9 పేజీలు 29-31
  • ఓ కుటుంబంగా యెహోవాను ఆరాధించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓ కుటుంబంగా యెహోవాను ఆరాధించండి
  • ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 యెహోవాతో మీ బంధాన్ని పటిష్ఠపర్చుకోండి
  • 2 మీ కుటుంబ ఆరాధనను ఆస్వాదించండి
  • కుటుంబాలకు సహాయం
    మన రాజ్య పరిచర్య—2011
  • కుటుంబ ఆరాధన అంటే ఏంటి?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • కుటుంబ ఆరాధన మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • నిత్యభవిష్యత్‌ నిమిత్తం ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
మరిన్ని
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
hf భాగం 9 పేజీలు 29-31
కలిసి బైబిలు చదువుతున్న ఆలుమగలు

9వ భాగం

ఓ కుటుంబంగా యెహోవాను ఆరాధించండి

‘ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుణ్ణే ఆరాధించండి.’—ప్రకటన 14:7, NW.

మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడే సూత్రాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయని మీరు ఈ బ్రోషురులో చూశారు. మీరు సంతోషంగా ఉండాలన్నదే యెహోవా అభిలాష. మీరు తన ఆరాధనకు ప్రథమస్థానం ఇస్తే, ఇతర అవసరాలు కూడా తీరుస్తానని ఆయన మాటిస్తున్నాడు. (మత్తయి 6:33) మీరు తన స్నేహితులు కావాలని ఆయన నిజంగా కోరుకుంటున్నాడు. దేవునితో స్నేహం చేయడానికి దొరికే ఏ అవకాశాన్నీ చేజార్చుకోకండి. దీనికి మించిన గొప్ప అవకాశం మనిషికి ఇంకొకటి ఉండదు. —మత్తయి 22:37, 38.

1 యెహోవాతో మీ బంధాన్ని పటిష్ఠపర్చుకోండి

కలిసి ప్రకటిస్తున్న భార్యాభర్తలు

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని ప్రభువు [“యెహోవా,” NW] చెబుతున్నాడు.’ (2 కొరింథీయులు 6:18) మీరు తనకు దగ్గరి స్నేహితులు కావాలని యెహోవా కోరుతున్నాడు. ఆయనకు స్నేహితులవ్వడానికి ఓ మార్గం ప్రార్థన. ‘ఎడతెగక ప్రార్థన చేయండి’ అని యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:15) మీ హృదయలోతుల్లో ఉన్న మనోభావాల్ని, మీ చింతల్ని వినాలని ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:6) కుటుంబంతో కలిసి మీరు ప్రార్థిస్తే, దేవునితో మీకున్న స్నేహం ఎంత బలమైనదో వాళ్లకు తెలుస్తుంది.

మీరు దేవునితో మాట్లాడడం ఒక్కటే కాదు, ఆయన చెప్పేది కూడా మీరు వినాలి. ఆయన వాక్యాన్ని, బైబిలు ప్రచురణలను బాగా చదవడం ద్వారా మీరు ఆయన చెప్పేది వినవచ్చు. (కీర్తన 1:1, 2) మీరు నేర్చుకునే దాని గురించి లోతుగా ఆలోచించండి. (కీర్తన 77:11, 12) అయితే దేవుడు చెప్పేది వినాలంటే మనం ఇంకొకటి చేయాలి, క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలి.—కీర్తన 122:1-4.

యెహోవాతో మీ బంధాన్ని పటిష్ఠపర్చుకునే ముఖ్యమైన మార్గం మరొకటి ఉంది. అదేమిటంటే, ఆయన గురించి ఇతరులకు చెప్పడం. ఆ పని మీరు ఎంత ఎక్కువగా చేస్తే, ఆయనకు అంత ఎక్కువగా దగ్గరైనట్టు మీకు అనిపిస్తుంది.—మత్తయి 28:19, 20.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • బైబిలు చదవడానికి, ప్రార్థించడానికి ప్రతీరోజు సమయం కేటాయించండి

  • కుటుంబంగా మీరందరూ వినోదం, ఆటవిడుపుల కన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వండి

2 మీ కుటుంబ ఆరాధనను ఆస్వాదించండి

కుటుంబ ఆరాధన కోసం సిద్ధపడుతున్న తండ్రి; ఆ తర్వాత సంతోషంగా కుటుంబ ఆరాధన జరుపుకుంటున్న దృశ్యం

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) మంచి పట్టిక వేసుకుని క్రమంగా కుటుంబ ఆరాధన జరుపుకోవాలి. (ఆదికాండము 18:19) అయితే అదొక్కటే సరిపోదు. దేవుడు మీ రోజువారీ జీవితంలో ఓ భాగం కావాలి. “నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును” దేవుని గురించి మాట్లాడుతూ ఆయనతో మీ కుటుంబ బంధాన్ని పటిష్ఠపర్చుకోండి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) యెహోషువ ఇలా అన్నాడు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” మీరు ఆయనలా ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.—యెహోషువ 24:15.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఓ చక్కని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని క్రమంగా జరుపుకుంటూ ఉండండి

తన పసిబిడ్డకు చదివి వినిపిస్తున్న తల్లి; బైబిల్లోని ఓ కథ ఆధారంగా నాటకం వేస్తున్న కుటుంబం; తన కూతురితో కలిసి అధ్యయనం చేస్తున్న తండి

యెహోవాను సంతోషంగా ఆరాధించే సేవకులు

యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి మించింది ఏదీ లేదు. మీరు, మీ కుటుంబం నమ్మకంగా ఆయనను ఆరాధించడం చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. మీరు అలా చేస్తూ ఉంటే యెహోవాను ఇంకా ఎక్కువ ప్రేమించగలుగుతారు, ఆయనను ఇంకా బాగా అనుకరించగలుగుతారు. (మార్కు 12:30; ఎఫెసీయులు 5:1) మీ వైవాహిక బంధంలో యెహోవాకు చోటిస్తే, మీ ఇద్దరి బంధం మరింత పటిష్ఠమౌతుంది. (ప్రసంగి 4:12; యెషయా 48:17) ‘మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు’ అని తెలుసుకొని మీరూ, మీ కుటుంబమూ కలకాలం ఆనందంగా ఉండవచ్చు.—ద్వితీయోపదేశకాండము 12:7.

మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • మేమిద్దరం కలిసి ప్రార్థన చేసి ఎంతకాలమైంది?

  • యెహోవా మీద విశ్వాసం పెంచే ఏ సమాచారాన్ని నా కుటుంబంతో చర్చించాలి?

కుటుంబ శిరస్సులకు గమనిక

  • మీ కుటుంబ ఆరాధనకు ఏ ఆటంకం రాకుండా చూసుకోండి

  • కుటుంబ ఆరాధనలో చర్చించబోయే విషయాలను ముందే మీ కుటుంబ సభ్యులకు చెప్పి పెట్టండి. అప్పుడు వాళ్లు కూడా సిద్ధపడగలుగుతారు

  • కుటుంబంలో ప్రతి ఒక్కరూ కుటుంబ ఆరాధనకు ఉండేలా చూసుకోండి

  • అందరికీ హాయిగా అనిపించే ప్రశాంతమైన వాతావరణం కల్పించండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి