కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jl పాఠం 10
  • కుటుంబ ఆరాధన అంటే ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబ ఆరాధన అంటే ఏంటి?
  • నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాలకు సహాయం
    మన రాజ్య పరిచర్య—2011
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఓ కుటుంబంగా యెహోవాను ఆరాధించండి
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • కుటుంబ ఆరాధన మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
jl పాఠం 10

10వ పాఠం

కుటుంబ ఆరాధన అంటే ఏంటి?

కుటుంబ ఆరాధన చేసుకుంటున్న ఒక కుటుంబం

దక్షిణ కొరియా

ఒక జంట బైబిల్ని అధ్యయనం చేస్తోంది

బ్రెజిల్‌

ఒక యెహోవాసాక్షి బైబిల్ని అధ్యయనం చేస్తున్నాడు

ఆస్ట్రేలియా

ఒక కుటుంబం ఒక బైబిలు అంశం గురించి చర్చిస్తోంది

గినియా

ప్రతీ కుటుంబంలోని వాళ్లు కలిసి సమయం గడుపుతూ తనకు దగ్గరవ్వాలని, అలాగే ఒకరికొకరు కూడా దగ్గరవ్వాలని యెహోవా ప్రాచీనకాలం నుండి కోరుకుంటున్నాడు. (ద్వితీయోపదేశకాండం 6:6, 7) అందుకే యెహోవాసాక్షులు కుటుంబమంతా కలిసి ఆరాధించడానికి వారంలో కొంత సమయం కేటాయిస్తారు. అప్పుడు వాళ్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబ అవసరాలకు సరిపోయే బైబిలు సమాచారం చర్చించుకుంటారు. ఒకవేళ మీరు ఒంటరిగా జీవిస్తున్నా, ఆ సమయంలో ఒక బైబిలు విషయం గురించి పరిశోధిస్తూ దేవునికి దగ్గరవ్వడానికి ప్రయత్నించవచ్చు.

అది యెహోవాకు దగ్గరయ్యే సమయం. “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని బైబిలు చెప్తుంది. (యాకోబు 4:8) బైబిలు ద్వారా యెహోవా లక్షణాలు, పనుల గురించి నేర్చుకునేకొద్దీ ఆయన్ని ఇంకా బాగా తెలుసుకుంటాం. కుటుంబ ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టడానికి ఒక సులువైన పద్ధతి ఏమిటంటే, కుటుంబమంతా కలిసి బైబిలు చదవడం. బహుశా మీరు ఆ వారంలో జరిగే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లోని బైబిలు అధ్యాయాలు చదవవచ్చు. కుటుంబంలో ఒక్కొక్కరూ బైబిల్లోని కొంతభాగాన్ని బయటికి చదవవచ్చు, నేర్చుకున్న విషయాల్ని అందరూ కలిసి చర్చించుకోవచ్చు.

అది కుటుంబ సభ్యులు దగ్గరయ్యే సమయం. కలిసి బైబిలు చదివినప్పుడు భార్యాభర్తలు, తల్లిదండ్రులు-పిల్లలు ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు. కుటుంబ ఆరాధన సంతోషంగా, ప్రశాంతంగా సాగాలి. కుటుంబంలో అందరూ దానికోసం ఉత్సాహంగా ఎదురుచూసేలా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల వయసుకు తగిన అంశాల్ని కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి, లేదా మా jw.org వెబ్‌సైట్‌ నుండి తీసుకోవచ్చు. స్కూల్లో మీ పిల్లలకు ఎదురైన ఒక సమస్య గురించి, దాని పరిష్కారం గురించి మాట్లాడుకోవచ్చు. అంతేకాదు JW బ్రాడ్‌కాస్టింగ్‌లో (tv.jw.org) ఒక కార్యక్రమం చూసి, చర్చించుకోవచ్చు. కూటాల్లో పాడే పాటల్ని ప్రాక్టీసు చేయవచ్చు. వీలైతే, కుటుంబ ఆరాధన తర్వాత ఏమైనా తినేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇలా ప్రతీవారం కుటుంబమంతా కలిసి యెహోవాను ఆరాధించడం వల్ల, దేవుని వాక్యంలోని విషయాల్ని అందరూ ఆనందంగా నేర్చుకుంటారు. మీ ప్రయత్నాల్ని యెహోవా మెండుగా దీవిస్తాడు.—కీర్తన 1:1-3.

  • మేము కుటుంబ ఆరాధన కోసం ఎందుకు సమయం కేటాయిస్తాం?

  • కుటుంబ ఆరాధన ఇంట్లో అందరికీ నచ్చేలా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

ఇంకా తెలుసుకోవడానికి . . .

సంఘంలోని వాళ్లు కుటుంబ ఆరాధన ఎలా చేసుకుంటున్నారో అడగండి. అలాగే, మీ పిల్లలకు యెహోవా గురించి నేర్పించడానికి రాజ్యమందిరంలో ఏయే ప్రచురణలు ఉన్నాయో తెలుసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి