కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • hf భాగం 3 పేజీలు 9-11
  • సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా?
  • ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 సమస్య గురించి మాట్లాడండి
  • 2వినండి, అర్థంచేసుకోండి
  • 3 ఆచరణలో పెట్టండి
  • సమస్యలను పరిష్కరించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీ జీవిత భాగస్వామిని గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఒకరికొకరు నమ్మకంగా ఉండండి
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • ఆనందం వెల్లివిరిసే వైవాహిక జీవితం కోసం దేవుని సహాయం తీసుకోండి
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
మరిన్ని
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
hf భాగం 3 పేజీలు 9-11
భార్య మాట్లాడుతున్నప్పుడు వింటున్న భర్త

3వ భాగం

సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా?

‘ప్రేమ అనేక పాపాల్ని కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి.’—1 పేతురు 4:8

మీరు భార్యాభర్తలుగా ఓ కొత్త జీవితాన్ని ఆరంభించినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మీ ఇద్దరి ఆలోచనల్లో, భావాల్లో తేడా ఉండవచ్చు. జీవితం మీద కూడా వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. కొన్నిసార్లు సమస్యలు బయట నుండి రావచ్చు, లేదా ఊహించని సంఘటనల వల్ల తలెత్తవచ్చు.

సమస్యల నుండి పారిపోవాలని మనకు అనిపించవచ్చు. కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని బైబిలు మనకు సలహా ఇస్తోంది. (మత్తయి 5:22, 23) బైబిలు సూత్రాలను పాటిస్తే, మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది.

1 సమస్య గురించి మాట్లాడండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘మాట్లాడడానికి సమయము కలదు.’ (ప్రసంగి 3:1, 7) సమస్య గురించి మాట్లాడడానికి సమయం కేటాయించండి. సమస్య గురించి మీకు ఏమి అనిపిస్తుందో, దానిపై మీ అభిప్రాయం ఏమిటో నిజాయితీగా మీ జీవిత భాగస్వామికి చెప్పండి. తనతో ఎప్పుడూ “సత్యమే” మాట్లాడండి. (ఎఫెసీయులు 4:25) కోపం కట్టలు తెంచుకునే పరిస్థితి వచ్చినాసరే గొడవపడాలనే తపనను అణచుకోండి. ఒక చిన్న చర్చతో పోయేది పెద్ద రణరంగంలా మారకూడదంటే మృదువుగా జవాబివ్వాలి.—సామెతలు 15:4; 26:20.

తన అభిప్రాయం మీకు నచ్చకపోయినా సౌమ్యంగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామిపట్ల ప్రేమాగౌరవాలు చూపించడం ఎన్నడూ మరవకండి. (కొలొస్సయులు 4:6) వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. మాట్లాడుకోవడం మానకండి.—ఎఫెసీయులు 4:26.

ఓ సమస్య గురించి మాట్లాడుకుంటున్న దంపతులు

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • సమస్య గురించి మాట్లాడడానికి సరైన సమయం ఎంచుకోండి

  • తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడాలనే ఆరాటాన్ని అణచుకోండి. మీకూ మాట్లాడే అవకాశం వస్తుంది

2వినండి, అర్థంచేసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) మీరు ఎలా వింటున్నారనేది చాలా ముఖ్యం. సానుభూతితో, ‘వినయంతో’ విషయాన్ని తనవైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించండి. (1 పేతురు 3:8; యాకోబు 1:19) వింటున్నట్టు నటించకండి. వీలైతే, చేస్తున్న పని కాసేపు పక్కనపెట్టి తను చెప్పేదేంటో మనసుపెట్టి వినండి. వీలుకాకపోతే, ఆ విషయం గురించి తర్వాత మాట్లాడవచ్చేమో అడిగి చూడండి. మీ జీవిత భాగస్వామి మీ ప్రత్యర్థి కాదు, తనూ మీ జట్టే అనుకుంటే మీరు ‘ఆత్రపడి కోప్పడరు.’—ప్రసంగి 7:9.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • విశాల హృదయంతో వినండి. తను చెప్పేది మీకు నచ్చకపోయినా సరే వినండి

  • మాటల వెనకున్న భావాన్ని వినండి. తన హావభావాలను, స్వరాన్ని గమనించండి

3 ఆచరణలో పెట్టండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.” (సామెతలు 14:23) ఇద్దరూ కలిసి మంచి పరిష్కారాన్ని కనిపెట్టడం ఒక్కటే సరిపోదు, దాన్ని అమలు చేయాలి. దానికోసం ఎంతో కష్టపడాల్సి రావచ్చు, పట్టుదలతో ప్రయత్నించాల్సి రావచ్చు. అయితే మీ శ్రమ వృథా కాదు. (సామెతలు 10:4) మీరిద్దరూ ఒక జట్టుగా పనిచేస్తే, మీ కష్టానికి “మంచిఫలము” పొందుతారు.—ప్రసంగి 4:9.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక్కొక్కరు ఏమేమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి

  • వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి

సమస్యల్ని కలిసి ఎదిరించండి

మీరిద్దరు కలిసి కృషి చేస్తే మీ బంధాన్ని దృఢంగా, సంతోషంగా ఉంచుకోగలుగుతారు, అప్పుడు మీ బంధం బలహీనపడదు, భారంగా అనిపించదు. (సామెతలు 24:3) పాత సమస్యల్ని పైకి తోడకుండా రేపటి జీవితంపై దృష్టిపెట్టండి. (సామెతలు 17:9) ఒకరికొకరు సహకరించుకుంటూ బైబిలు సూత్రాలను పాటిస్తే మీరు ఏ సమస్యనైనా సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు.

మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • నేను ఏ సమస్య గురించి తనతో వెంటనే చర్చించాలి?

  • సమస్య గురించి తనకు నిజంగా ఏమనిపిస్తుందో అర్థంచేసుకోవడానికి నేను ఏమి చేస్తే బాగుంటుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి