కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • hf భాగం 2 పేజీలు 6-8
  • ఒకరికొకరు నమ్మకంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒకరికొకరు నమ్మకంగా ఉండండి
  • ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 మీ వైవాహిక బంధానికి ముఖ్య స్థానం ఇవ్వండి
  • 2 మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి
  • ఆనందం వెల్లివిరిసే వైవాహిక జీవితం కోసం దేవుని సహాయం తీసుకోండి
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • పెళ్లి తర్వాత జీవితం
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • వివాహబంధానికి కట్టుబడి ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీ జీవిత భాగస్వామిని గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
hf భాగం 2 పేజీలు 6-8
భార్య కోసం గొడుగు పట్టుకొని, కారు ఎక్కడానికి సహాయం చేస్తున్న భర్త

2వ భాగం

ఒకరికొకరు నమ్మకంగా ఉండండి

“దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” —మార్కు 10:9

‘విశ్వసనీయతకు’ విలువివ్వాలని యెహోవా కోరుతున్నాడు. (మీకా 6:8, NW) ఆలుమగల మధ్య ఆ లక్షణం చాలాచాలా అవసరం. ఎందుకంటే విశ్వసనీయత లేని చోట నమ్మకం ఉండదు. ప్రేమ పెరగాలంటే నమ్మకం కీలకం.

నేడు, భార్యాభర్తల బంధంలో విశ్వసనీయత కనుమరుగౌతోంది. మీ బంధం బీటలువారకుండా ఉండాలంటే మీరు రెండు పనులు చేయాలని తీర్మానించుకోవాలి.

1 మీ వైవాహిక బంధానికి ముఖ్య స్థానం ఇవ్వండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘మీరు శ్రేష్ఠమైన కార్యములను [“మరింత ప్రాముఖ్యమైనవాటిని, NW”] వివేచించండి.’ (ఫిలిప్పీయులు 1:9, 10) మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి మీ వైవాహిక బంధం. దానికి ముఖ్య స్థానం ఇవ్వాలి.

మీ జీవిత భాగస్వామి మీద శ్రద్ధ చూపిస్తూ మీరిద్దరూ సంతోషంగా జీవించాలని యెహోవా కోరుతున్నాడు. (ప్రసంగి 9:9) మీ భాగస్వామిని అస్సలు అశ్రద్ధ చేయకూడదని, ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి అవకాశాల కోసం ఇద్దరూ చూడాలని ఆయన స్పష్టం చేస్తున్నాడు. (1 కొరింథీయులు 10:24) మీ భాగస్వామి ఎంతో కావాల్సిన వ్యక్తి అని, తనను మీరు ప్రశంసిస్తున్నారని తనకు అర్థమయ్యేలా ప్రవర్తించండి.

భార్య తాగడానికి వేడివేడి పాలు తీసుకొచ్చి ఇస్తున్న భర్త; భర్త ఇంటికి వచ్చే సమయానికి వంట చేస్తున్న భార్య

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీరిద్దరు కలిసి తరచూ సమయం గడిపేలా చూసుకోండి. ఆ సమయాన్ని పూర్తిగా మీ భాగస్వామికే ఇవ్వండి

  • “నేను,” “నా” అని కాకుండా “మేము,” “మా” అన్నట్టు ఆలోచించండి

సరదాగా బయటికి వెళ్లి సమయం గడుపుతున్న దంపతులు

2 మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు.” (మత్తయి 5:28, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఓ వ్యక్తి చెడు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన తన భార్యకు నమ్మకంగా లేనట్టే లెక్క.

మీరు ‘మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి’ అని యెహోవా చెబుతున్నాడు. (సామెతలు 4:23; యిర్మీయా 17:9) అలా చేయాలంటే మీరు మీ కంటిని కాచుకోవాలి. (మత్తయి 5:29, 30) ఈ విషయంలో ప్రాచీనకాల యోబును ఆదర్శంగా తీసుకోండి. చెడు కోరికతో పరాయి స్త్రీని చూడకూడదని ఆయన తన కళ్లతో ఒప్పందం చేసుకున్నాడు. (యోబు 31:1) అశ్లీల చిత్రాలను చూడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. పరాయి వ్యక్తితో ప్రేమకలాపాలు అస్సలు సాగించకూడదని తీర్మానించుకోండి.

తన ఆఫీసు టేబులు మీద భార్య ఫోటో పెట్టుకున్న భర్త

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీరు మీ జీవిత భాగస్వామికే కట్టుబడి ఉన్నారని ఇతరులకు స్పష్టంగా తెలియనివ్వండి

  • మీ భాగస్వామి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోండి. తనను ఇబ్బందిపెట్టే ఎలాంటి సంబంధాన్నైనా వెంటనే తెగతెంపులు చేసుకోండి

మీ వంతు కృషి మీరు చేయండి

మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోండి, మీ బలహీనతలేమిటో గుర్తించండి. (కీర్తన 15:2) సహాయం కోరడానికి ఇబ్బందిపడకండి. (సామెతలు 1:5) మీకు చెడు ఆలోచనలు ఉంటే, వాటిని జయించడానికి పోరాడుతూ ఉండండి. నిరుత్సాహపడకండి. (సామెతలు 24:16) మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండడానికి మీరు చేసే కృషిని యెహోవా దీవిస్తాడు.

మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • నా జీవిత భాగస్వామి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి నేను ఏమి చేయాలి?

  • నా జీవిత భాగస్వామే నాకు మంచి నేస్తమా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి