కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • yc పాఠం 1 పేజీలు 4-5
  • మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం
  • చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఈ పత్రికలో
    తేజరిల్లు!—2018
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
yc పాఠం 1 పేజీలు 4-5
యేసు ప్రజలతో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వింటున్న దేవదూతలు

1

మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం

పిల్లలూ, ఎవరైనా ఓ విషయాన్ని మీకు మాత్రమే చెప్పారా?—a ఆ విషయం మీకూ వాళ్లకూ తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు కాబట్టి దాన్ని రహస్యం అంటారు. బైబిలు ఒక ప్రత్యేక రహస్యం గురించి చెబుతోంది, దాన్నే పరిశుద్ధ మర్మం అంటారు. ఈ రహస్యాన్ని దేవుడు చెబుతున్నాడు, అందుకే అది పరిశుద్ధమైనది. దీని గురించి దేవదూతలు కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నారు. మరి మీకు ఆ రహస్యమేంటో తెలుసుకోవాలనుందా?—

ఈ దేవదూతలు ఏమి తెలుసుకోవాలని ఆసక్తిగా వింటున్నారు?

చాలాకాలం క్రితం, దేవుడు మొట్టమొదటి పురుషుడిని, స్త్రీని సృష్టించాడు. వాళ్ల పేర్లు ఆదాము, హవ్వ. దేవుడు వాళ్లను అందమైన ఏదెను తోటలో ఉంచాడు. అదే వాళ్ల ఇల్లు. ఆదాముహవ్వలు దేవుని మాట వినుంటే వాళ్లు, వాళ్ల పిల్లలు మొత్తం భూమిని పరదైసులా అంటే, అందమైన తోటలా చేసివుండేవాళ్లు. చూడచక్కని పరిసరాల్లో ఎప్పటికీ చనిపోకుండా అలా జీవిస్తూ ఉండేవాళ్లు. కానీ ఆదాముహవ్వలు ఏమి చేశారో మీకు గుర్తుందా?—

వాళ్లు దేవుని మాట వినలేదు, అందుకే ఇప్పుడు మన భూమి అందమైన తోటలా లేదు. అయితే దేవుడు ఈ భూమంతటినీ అందంగా మారుస్తాననీ, అప్పుడు ఎవ్వరూ చనిపోకుండా సంతోషంగా ఉంటారనీ చెప్పాడు. ఆయన ఇదెలా చేస్తాడు? ఆ విషయం చాలాకాలం వరకు ప్రజలకు తెలియలేదు. అదొక రహస్యంగా ఉండిపోయింది.

యేసు భూమ్మీదకు వచ్చినప్పుడు దాని గురించి ప్రజలకు మరిన్ని వివరాలు చెప్పాడు. ఆ రహస్యం దేవుని రాజ్యం గురించినదని ఆయన అన్నాడు. ఆ రాజ్యం రావాలని ప్రార్థించమని ప్రజలకు చెప్పాడు. ఆ రాజ్యం భూమిని ఒక అందమైన పరదైసులా చేస్తుంది.

ఈ రహస్యం గురించి తెలుసుకున్నందుకు మీకు ఆనందంగా లేదా?— అయితే ఓ విషయం గుర్తుంచుకోండి, యెహోవా చెప్పిన మాట వినేవాళ్లే పరదైసులో జీవిస్తారు. ఆయన మాట విన్న స్త్రీపురుషుల కథలెన్నో బైబిల్లో ఉన్నాయి. మీకు వాళ్ల గురించి తెలుసుకోవాలనుందా?— అయితే వాళ్లలో కొంతమంది గురించి చూద్దాం, వాళ్లలా ఉండాలంటే ఏమి చేయాలో కూడా నేర్చుకుందాం.

మీ బైబిల్లో చదవండి

  • మార్కు 4:11

  • 1 పేతురు 1:12

  • ఆదికాండము 1:26-28; 2:8, 9; 3:6, 23

  • మత్తయి 6:9, 10

  • కీర్తన 37:11, 29

a ఈ బ్రోషుర్‌లోని ప్రతీ పాఠంలో కొన్ని ప్రశ్నల దగ్గర ఓ అడ్డగీత (—) ఉంటుంది. అక్కడ కొంచెం ఆగి, ఆ ప్రశ్నలకు మీ చిన్నారులు ఏమి చెబుతారో వినండి.

ప్రశ్నలు:

  • భూమి ఇప్పుడు పరదైసులా ఎందుకు లేదు?

  • ఏ ప్రత్యేక రహస్యం గురించి బైబిలు చెప్తోంది?

  • ఆ రహస్యం గురించి ప్రజలకు యేసు ఏమి చెప్పాడు?

  • పరదైసు భూమ్మీద జీవించాలంటే మీరేం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి