కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 43 పేజీ 234-పేజీ 235 పేరా 3
  • నియమిత సమాచార వినియోగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నియమిత సమాచార వినియోగం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠశాలలో విద్యార్థి నియామకాలకు సిద్ధపడడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 43 పేజీ 234-పేజీ 235 పేరా 3

43

నియమిత సమాచార వినియోగం

మీరు ఏమి చెయ్యాలి?

మీ ప్రసంగాన్ని నియమిత విషయం చుట్టూ అల్లండి. సమాచారం ఎక్కడి నుండి తీసుకోవాలో తెలియజేస్తే, అక్కడి నుండి లేఖనాలను, ముఖ్యాంశాలను తీసుకోండి.

ఎందుకు ప్రాముఖ్యం?

మన ప్రసంగాన్ని విపులీకరించడానికి నియమిత సమాచారాన్ని ఉపయోగించినప్పుడు మనం నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఏర్పాటు చేసిన ఆహార కార్యక్రమం పట్ల గౌరవాన్ని చూపుతున్న వారమవుతాము.

బైబిలు క్రైస్తవ సంఘాన్ని ఒక మానవ శరీరంతో పోలుస్తోంది. ప్రతి అవయవము ప్రాముఖ్యమే, కానీ ‘ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని ఉండదు.’ అదే విధంగా, మనకు ఎలాంటి ఆధిక్యత అప్పజెప్పబడినా దాన్ని నెరవేర్చడానికి కృషిచేయాలి. కాబట్టి, మనకు ఎలాంటి ప్రసంగ నియామకం ఇవ్వబడినా దాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని పూర్తిచేయాలి. మన ప్రసంగానికి నియమిత విషయాలకన్నా ఇతర విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని భావిస్తూ నియమిత సమాచారం ప్రాముఖ్యాన్ని తక్కువ చేయకూడదు. (రోమా. 12:4-8) “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందజేసే బాధ్యత నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడి తరగతికి ఉంది. (మత్త. 24:45) మనకు లభించిన నిర్దేశకాల ప్రకారమే ప్రసంగాలను విపులీకరించడానికి మన వ్యక్తిగత సామర్థ్యాలను వినియోగించినప్పుడు మనం ఆ ఏర్పాటు పట్ల కృతజ్ఞత చూపినవారమవుతాము. సంఘమంతా సాఫీగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది.

ఏమి చేర్చాలి? మీకు పాఠశాలలో ఒక విషయం నియమించబడినప్పుడు దాన్ని మాత్రమే విపులీకరించడానికి ప్రయత్నించండి, మరేదో విషయాన్ని కాదు. అత్యధిక సందర్భాల్లో నిర్దిష్ట సమాచార మూలం మీకు అందజేయబడుతుంది. అలా కాకుండా, మీ ప్రసంగానికి ఏ ముద్రిత సమాచారాన్ని ఉపయోగించాలో తెలియజేయబడకపోతే, మీకిష్టమైన మూలం నుండి సమాచారాన్ని సేకరించవచ్చు. అయితే మీరు ప్రసంగానికి సిద్ధపడుతుండగా ప్రసంగం అంతటినీ నియమిత విషయం చుట్టూ మాత్రమే అల్లేలా నిశ్చయపరచుకోండి. దేన్ని చేర్చాలో నిర్ణయించుకునేటప్పుడు మీరు మీ ప్రేక్షకులను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం కూడా ఉంటుంది.

నిర్దేశిత సమాచారంలోని లేఖనాలను విశ్లేషిస్తూ దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఆ తర్వాత, ప్రేక్షకుల ప్రయోజనార్థం దాన్ని అత్యంత సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. మీ ప్రసంగానికి ముఖ్యాంశాలుగా రెండు లేదా మూడు అంశాలను ముద్రిత సమాచారం నుండి ఎంపిక చేసుకోండి. అదే విధంగా, మీరు చదివి చర్చించాలని అనుకుంటున్న లేఖనాలను నియమిత సమాచారం నుండి ఎంపిక చేసుకోండి.

నియమిత సమాచారంలో ఎంత భాగాన్ని మీరు చర్చించాలి? మీరు సమర్థవంతంగా చర్చించగలిగేంత మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువ సమాచారాన్ని చేర్చే ఉద్దేశంతో మంచి బోధనా పద్ధతులను విస్మరించకండి. మీ ప్రసంగ లక్ష్యంలో కొంత సమాచారం ఇమడకపోతే, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడే భాగాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. నియమిత సమాచారం నుండి మీ ప్రేక్షకులకు ఎంతో సమాచారాన్ని అందించేదిగా ఉండేదాన్ని, అత్యంత ప్రయోజనకరంగా ఉండేదాన్ని ఉపయోగించండి. ఈ ప్రసంగ లక్షణం క్రింద మీ లక్ష్యం, మీరు ఎంతమట్టుకు మీ చర్చలో చేర్చుకోగలరన్నది కాదు గానీ, మీ ప్రసంగానికి ఆధారంగా మీకు నియమించబడిన దాన్ని ఉపయోగించడమే.

మీ ప్రసంగం నియమిత సమాచారానికి వట్టి సారాంశంలా ఉండకూడదు. కొన్ని అంశాలను మీరు వివరించడానికి సిద్ధపడాలి, వాటిని విపులీకరించాలి, దృష్టాంతపరచాలి, సాధ్యమైతే వాటి అన్వయింపును తెలియజేయడానికి ఒక ఉదాహరణ ఇవ్వాలి. అదనపు తలంపులు గనుక చేరిస్తే వాటిని మీ నియమిత సమాచారంలోని ముఖ్యాంశాలను విపులీకరించడానికి ఉపయోగించుకోవాలి గానీ ఆ సమాచారానికి బదులుగా వాటిని చేర్చకూడదు.

బోధకులకు అవసరమైన అర్హతలు ఉన్న సహోదరులు కొంతకాలానికి సేవా కూటంలో ఉపదేశాన్ని ఇవ్వడానికి ఆహ్వానించబడుతుండవచ్చు. నియమిత సమాచారానికి బదులుగా వేరే సమాచారాన్ని ఉపయోగించకుండా, నియమిత సమాచారాన్ని పూర్తిగా ఉపయోగించవలసిన అవసరాన్ని వారు అర్థంచేసుకోగలుగుతారు. అదేవిధంగా, బహిరంగ ప్రసంగం ఇచ్చే సహోదరుడికి ఒక సంక్షిప్తప్రతి ఇవ్వబడుతుంది, ఆయన దాన్ని అనుసరించాలి. సంక్షిప్తప్రతి విషయంలో చూస్తే, వివేచన ఉపయోగిస్తూ కాస్త సర్దుబాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రసంగీకుడు విపులీకరించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటో, వాటికి మద్దతునిచ్చే తర్కాలేమిటో, ప్రసంగానికి పునాదిగా ఉండే లేఖనాలేమిటో అందులో స్పష్టంగా ఉంటాయి. నియమిత సమాచారాన్ని ఆధారం చేసుకొని బోధించడం ఎలాగో నేర్చుకోవడం, మరితర ప్రసంగ ఆధిక్యతల కోసం సిద్ధపడడంలో ఒక ప్రముఖ భాగం.

మీరు పురోభివృద్ధికరమైన గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో కూడా ఈ శిక్షణ దోహదపడుతుంది. కొన్ని అంశాలు ఆసక్తికరమైనవే అయినా, విషయాన్ని అర్థంచేసుకోవడానికి అంత ప్రాముఖ్యం కాని వాటిని ఎక్కువగా చర్చిస్తూ అసలు విషయానికి దూరంగా వెళ్ళిపోవడానికి బదులుగా మీరు అధ్యయన సమాచారంపైనే అవధానాన్ని కేంద్రీకరించడాన్ని నేర్చుకుంటారు. కానీ, మీరు ఈ పాఠంలోని అసలు ఉద్దేశాన్ని గ్రహించినట్లైతే, విద్యార్థికి అవసరమైన అదనపు వివరణలు ఇవ్వడంలో విఫలమయ్యేంతగా, కేవలం అధ్యయన సమాచారాన్ని మాత్రమే అంటిపెట్టుకోరు.

ఎలా చెయ్యాలి?

  • నియమిత విషయానికి నేరుగా సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించండి.

  • మీ నియామకంలో భాగంగా, ఏదైనా ముద్రిత ప్రచురణను మీ ప్రసంగానికి ఆధారం చేసుకోవలసివస్తే మీరు ముఖ్యాంశాలను, కీలకమైన లేఖనాలను ఆ ప్రచురణ నుండే తీసుకోండి, వేరే మూలాల నుండి తీసుకోవద్దు.

అభ్యాసం: మూడు వేర్వేరు రోజుల్లో, మీరు దినవచనాన్ని చదివేటప్పుడు దినవచనం క్రింద ఉన్న పేరాలో చర్చించబడుతున్న విషయాన్ని సూచించే పదం లేదా పదబంధం చుట్టూ పెన్నుతో గీయండి. ఆ విషయానికి సూటిగా సంబంధం ఉన్న ఒకటి రెండు క్లుప్తమైన వ్యాఖ్యానాల క్రింద గీతలు గీయండి. ఆ తర్వాత, వచనాన్నీ మీరు గీతలు గీసిన అంశాలనూ ఉపయోగిస్తూ ఆ విషయంపై మీ సొంత మాటల్లో వ్యాఖ్యానించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి