కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g25 No. 1 పేజీలు 10-11
  • ఉన్నంతలో తృప్తిగా జీవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉన్నంతలో తృప్తిగా జీవించండి
  • తేజరిల్లు!—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉన్నంతలోనే ఎందుకు తృప్తిగా ఉండాలి?
  • మీరేం చేయవచ్చు?
  • సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • సంతృప్తిగా ఉండడం సాధ్యమేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • సంతృప్తితో ఎలా జీవించవచ్చు?
    తేజరిల్లు!—2021
  • ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
తేజరిల్లు!—2025
g25 No. 1 పేజీలు 10-11
చిత్రాలు: 1. పని స్థలంలో తన షిఫ్ట్‌ ముగించుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్న ఒక తండ్రి. 2. తర్వాత, రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉన్న తన ఇంటి ముందు ఆయన తన ఇద్దరు పిల్లలతో, కుక్కతో ఆడుకుంటున్నాడు. వెనకనుండి ఆయన భార్య నవ్వుతూ చూస్తోంది.

ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?

ఉన్నంతలో తృప్తిగా జీవించండి

ఉన్నంతలో తృప్తిగా జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు వాళ్ల అవసరాల్ని మార్చుకుంటూ, వచ్చిన దాంట్లోనే హాయిగా బ్రతికేస్తారు.

ఉన్నంతలోనే ఎందుకు తృప్తిగా ఉండాలి?

జెస్సికా కోహ్లర్‌ అనే సైకాలజిస్ట్‌ ప్రకారం, తృప్తిగా ఉండేవాళ్లు జీవితాన్ని భారంగా ఈడ్చుకురారు, ఆశతో ముందుకెళ్తారు. వాళ్లు ఇతరుల్ని చూసి కుళ్లుకోరు కాబట్టి, ఏ చీకూచింతా లేకుండా సంతోషంగా ఉంటారు. కొంతమంది దగ్గర ఆస్తులు లేకపోయినా వాళ్ల ఇళ్లు ఆనందానికి చిరునామాలా ఉంటుంది. ఎందుకంటే, కోట్లు కుమ్మరించినా కొనలేని వాటిని వాళ్లు సంపాదించుకున్నారు. అవే, నా అనుకునే వాళ్లతో పెంచుకునే అనుబంధాలు, ఆప్యాయతలు.

“మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”—1 తిమోతి 6:8.

మీరేం చేయవచ్చు?

పక్కవాళ్లతో పోల్చుకోకండి. తక్కువలో బ్రతుకుతున్న మీ జీవితాన్ని, బాగా దర్జాగా బ్రతికేవాళ్లతో పోల్చుకుంటే ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. మీకు వెలితిగా అనిపించి, ఇతరుల దగ్గర ఉన్నవి మా దగ్గర లేవే అని బాధపడతారు, ఈర్ష్య పడతారు. అయితే, కనిపించేవన్నీ నిజం కాకపోవచ్చు. పైకి డాబుగా కనిపించే వాళ్లకు ఎన్ని అప్పులున్నాయో ఎవరికి తెలుసు. సెనెగల్‌ అనే దేశంలో ఉంటున్న నికోల్‌ ఇలా చెప్తుంది: “అన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటామని నేను అనుకోను. తృప్తిగా ఉంటే, వేరేవాళ్ల దగ్గర ఉన్నవి నా దగ్గర లేకపోయినా సంతోషంగానే ఉంటాను.”

ఇలా చేసి చూడండి: మీరు చాలా గొప్పగా బ్రతకొచ్చు అని చూపించే యాడ్‌లను, సోషల్‌ మీడియా పోస్ట్‌లను చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి.

“ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”—లూకా 12:15.


కృతజ్ఞతతో ఉండండి. కృతజ్ఞతతో ఉండేవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారు. తమకు ఇంకా ఏదో కావాలని ఆరాటపడరు. హయిటీ అనే దేశంలో ఉంటున్న రాబర్టన్‌ ఇలా అంటున్నాడు: “నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఎవరైనా మంచి చేస్తే, దాని గురించి సమయం తీసుకుని ఆలోచిస్తాను. వాళ్లు చేసిన దానికి నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్తాను. అలాగే, ఎవరు ఏది ఇచ్చినా థ్యాంక్యూ చెప్పమని మా ఎనిమిదేళ్ల అబ్బాయికి నేర్పిస్తాను.”

ఇలా చేసి చూడండి: మీరు “థ్యాంక్యూ” చెప్పాలని అనుకునే వాటి గురించి రోజూ డైరీలో రాసిపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండడం, మంచి కుటుంబం-స్నేహితులు ఉండడం, ఒక అందమైన సూర్యాస్తమయం చూడడం . . . ఇలా దేని గురించైనా మీరు రాసుకోవచ్చు.

“సంతోష హృదయం గలవాడికి ప్రతీరోజు విందే.”—సామెతలు 15:15.

తృప్తిగా జీవించడం కొన్నిసార్లు మనందరికి కష్టంగానే అనిపిస్తుంది. కానీ మన కష్టం ఊరికే పోదు! సంతృప్తిగా ఉంటే సంతోషంగా ఉంటాం. సంతోషాన్ని డబ్బులు పెట్టి కొనగలమా చెప్పండి.

Erik.

“నేను, నా భార్య, నా ముగ్గురు కూతుళ్లు సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాం. దానివల్ల చాలా మంచి జరిగింది. మా జీవితం ఇప్పుడు ఉరుకులు పరుగులతో లేదు. కుటుంబంగా కలిసి తీరిగ్గా సమయం గడపగలుగుతున్నాం. అలాగే మాకు ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నాం.”—ఎరిక్‌, అమెరికా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి