కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g23 No. 1 పేజీలు 12-14
  • గాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గాలి
  • తేజరిల్లు!—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గాలికి పొంచివున్న ముప్పు
  • మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది
  • సంరక్షణ చర్యలు
  • ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది
  • ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణం
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—2023
g23 No. 1 పేజీలు 12-14
ఒక జంట మంచు నేలపై నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ల ముందు ఓ అందమైన సరస్సు, చుట్టూ పచ్చని కొండలు, పైన నీలాకాశం ఉన్నాయి.

మన భూమికి ఏమౌతుంది?

గాలి

మనందరికీ గాలి అవసరం. ఊపిరి పీల్చుకోవడానికే కాదు, గాలి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సూర్యుని నుండి వచ్చే హానికరమైన రేడియేషన్‌ నుండి ఒక గొడుగులా గాలి మన భూమిని రక్షిస్తుంది. గాలి లేకపోతే ప్రపంచంలో అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కన్నా తక్కువకు పడిపోతాయి.

గాలికి పొంచివున్న ముప్పు

అంతకంతకూ పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల భూమ్మీదున్న ప్రాణులకు పెద్ద ముప్పే పొంచివుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే సురక్షితమైన గాలిని పీల్చుకుంటున్నారు.

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రతీ సంవత్సరం, గాలి కాలుష్యం వల్ల వయసు నిండకుండానే సుమారు 70,00,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది

ఊపిరి పీల్చుకునే ప్రాణులన్నిటికీ అవసరమయ్యే ఆరోగ్యకరమైన గాలిని నిరంతరం అందించే సహజ సామర్థ్యం మన భూమికి ఉంది. మనుషులు వాతావరణాన్ని కలుషితం చేయడం తగ్గిస్తేనే ప్రకృతిలోని ఈ సహజ ప్రక్రియలు సజావుగా పనిచేస్తాయి. ఈ ఉదాహరణలు గమనించండి:

  • అడవులు గాలిలోని కార్బన్‌డైయాక్సైడ్‌ పీల్చుకుంటాయని మనందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే, తీర ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులకు (mangroves) ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. మడ అడవులు మిగతా అడవులు పీల్చుకునే దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుంటాయి!

  • కెల్ప్‌ అని పిలిచే ఒక రకమైన సముద్రపు నాచు పెద్ద సైజులో ఉంటుంది; ఇది శైవలాల (algae) జాతికి చెందినది. ఈ మధ్య కాలంలో ఈ సముద్రపు నాచు మీద కొన్ని పరిశోధనలు చేశారు. వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను లేకుండా చేసే ప్రత్యేకమైన గుణం దీనికి ఉందని కనుక్కున్నారు. అదెలా అంటారా? ఈ సముద్రపు నాచులో గాలి బుడగలు ఉండడం వల్ల, అది చాలా దూరం నీటిలో తేలుతూ వెళ్తుంది. తీరానికి దూరంగా కొట్టుకుపోయాక ఆ గాలి బుడగలు పగిలిపోతాయి. దాంతో, కార్బన్‌డైయాక్సైడ్‌తో నిండిన నాచు సముద్రం అడుగు భాగానికి మునిగిపోయి అక్కడే కొన్ని వందల ఏళ్లు ఉండిపోతుంది.

  • కాలుష్యం తగ్గితే వాతావరణం మళ్లీ దానంతటదే ఆరోగ్యకరంగా మారుతుందని కోవిడ్‌ లాక్‌డౌన్‌ రుజువు చేసింది. 2020​లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, వాహనాలు కూడా ఇళ్లు దాటి బయటికి రాలేదని అందరికీ తెలుసు. దాంతో కొన్ని రోజులకే గాలిలో కాలుష్యం తగ్గిపోయింది! లాక్‌డౌన్‌ అమలైన కొంతకాలానికే గాలి చాలా స్వచ్ఛంగా మారిందని 80 శాతం కన్నా ఎక్కువ దేశాలు గుర్తించినట్లు ఒక ప్రపంచ రిపోర్టు తెలియజేసింది.

    మీకు తెలుసా?

    స్వచ్ఛమైన గాలి సాధ్యమే!

    ఇండియాలోని న్యూఢిల్లీ గాలిలో ఉండే సూక్ష్మ పదార్థాల స్థాయిని (PM2.5) తెలిపే గ్రాఫు. 2020 జనవరిలో వాటి స్థాయి 128.1 ఉండేది, అది ఆరోగ్యానికి హానికరం; కానీ 2020 ఆగస్టు నాటికి అది 35.5 కన్నా తక్కువకు పడిపోయింది, అది పెద్దగా హానికరం కాదు.

    కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇండియాలోని న్యూఢిల్లీలో ఫ్యాక్టరీల వల్ల, వాహనాల వల్ల కలిగే గాలి కాలుష్యం ఒక్కసారిగా బాగా తగ్గిపోయింది. సాధారణంగా కలుషితమైన గాలిలో PM2.5 అని పిలిచే సూక్ష్మ పదార్థాలు ఉంటాయి. 0.0025 mm లేదా అంతకన్నా చిన్నగా ఉండే ఆ పదార్థాల వల్ల శ్వాస సంబంధ జబ్బులు, ఇతర ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. లాక్‌డౌన్‌ సమయంలో గాలిలో ఆ పదార్థాల శాతం వేగంగా పడిపోయింది. ఈ మార్పు కొంతకాలమే ఉన్నప్పటికీ, కాలుష్య కోరల నుండి దానంతటదే బయటపడే సామర్థ్యం వాతావరణానికి ఉందని అది రుజువు చేసింది.

    2019 చివర్లో, ఇండియాలోని న్యూఢిల్లీలో తీవ్రమైన గాలి కాలుష్యం వల్ల అలుముకున్న దట్టమైన పొగ.

    © Amit kg/Shutterstock

    2019 చివర్లో

    ఇండియాలోని న్యూఢిల్లీలో, కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో గాలి కాలుష్యం తగ్గడంతో దట్టమైన పొగ పోయి స్పష్టంగా మారింది.

    © Volobotti/Shutterstock

    కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో

సంరక్షణ చర్యలు

ఒకతను పని స్థలానికి చేరుకున్నాక తన సైకిల్‌ను పార్క్‌ చేస్తున్నాడు.

సైకిల్‌ని వాడితే గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు

గాలి కాలుష్యాన్ని తగ్గించమని ప్రభుత్వాలు పరిశ్రమలకు పదేపదే గుర్తుచేస్తూనే ఉన్నాయి. కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్నంతా తీసేయడానికి సైంటిస్టులు కూడా కొత్తకొత్త పద్ధతుల్ని కనుక్కుంటున్నారు. వాటిలో ఒక పద్ధతి ఏంటంటే, సూక్ష్మజీవుల్ని ఉపయోగించి కాలుష్యానికి కారణమయ్యే వాటిని హాని కలిగించని పదార్థాలుగా మారుస్తున్నారు. అంతేకాదు ఇంట్లో తక్కువ వనరులతో జీవించడం అలవాటు చేసుకోమని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారు, బైక్‌ మీద కాకుండా సైకిల్‌ మీదో, నడిచో వెళ్లమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఒకామె తన ఇంటి ముందు నేలపై కూర్చుని వంట చేస్తోంది. ఆమె ఉపయోగిస్తున్న పొయ్యి చిన్నదే అయినా దాన్నుండి కూడా కాస్త పొగ వస్తోంది.

గాలి కాలుష్యాన్ని అరికట్టడం కోసం కొన్ని ప్రభుత్వాలు ప్రజలకు స్టవ్‌లను పంచిపెడుతున్నాయి. కానీ ఇంకా చాలామందికి అవి అందుబాటులో లేవు

అయితే అవి మాత్రమే సరిపోవని 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఒక రిపోర్టులో చెప్పాయి.

ఆ రిపోర్టు ప్రకారం, ఒక్క 2020 సంవత్సరంలోనే ప్రపంచంలోని మూడో వంతు జనాభా గాలి కాలుష్యానికి కారణమయ్యే వాటితో వంట చేసుకున్నారట! చాలా ప్రాంతాల్లో కొద్దిమందికే కొత్త స్టవ్‌లు, కాలుష్యం కలిగించని ఇంధనాలు కొనుక్కునే స్తోమత ఉంది.

ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది

“యెహోవాయే సత్యదేవుడు, ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు. . . . ఆయనే భూమిని, దాని పంటను పరిచాడు. దానిమీదున్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచేవాళ్లకు జీవశక్తిని ఇస్తున్నది ఆయనే.”—యెషయా 42:5.

మనం పీల్చుకునే గాలిని, దాన్ని స్వచ్ఛంగా మార్చే ప్రకృతి చక్రాల్ని దేవుడే చేశాడు. ఆయనకు అపారమైన శక్తితోపాటు, మనుషుల మీద అంతులేని ప్రేమ కూడా ఉంది. అలాంటి ఆయన గాలి కాలుష్యాన్ని మటుమాయం చేయడానికి ఏమీ చేయడంటారా? “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిస్తున్నాడు” ఆర్టికల్‌ చూడండి.

ఎక్కువ తెలుసుకోవాలనుందా

అంతరిక్షం నుండి భూగ్రహం చిత్రం.

మన వాతావరణం ఎలా ఏర్పడింది? విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా? వీడియో చూడండి. అది jw.org/teలో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి