కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g23 No. 1 పేజీలు 9-11
  • అడవులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అడవులు
  • తేజరిల్లు!—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అడవులకు పొంచివున్న ముప్పు
  • మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది
  • సంరక్షణ చర్యలు
  • ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది
  • విషయసూచిక
    తేజరిల్లు!—2023
తేజరిల్లు!—2023
g23 No. 1 పేజీలు 9-11
ఒకావిడ ఓ వర్షారణ్యంలోని వంతెన పై నడుస్తోంది.

మన భూమికి ఏమౌతుంది?

అడవులు

మనిషికి ఊపిరితిత్తులు ఎలాగో భూపర్యావరణానికి అడవులు అలాగ! ఎందుకంటే చెట్లు, మనిషికి హానిచేసే కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుని, మనం బ్రతకడానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్‌ను గాల్లోకి వదులుతాయి. భూమ్మీదున్న మొక్కల్లో, జంతువుల్లో 80 శాతం అడవుల్లోనే ఉంటాయి. అడవులే లేకపోతే మనిషి జాతే ప్రమాదంలో పడుతుంది!

అడవులకు పొంచివున్న ముప్పు

ప్రతీ సంవత్సరం, వ్యవసాయ భూములుగా వాడుకోవడానికి కొన్ని కోట్ల చెట్లను నరికేస్తున్నారు. 1940ల నుండి ఇప్పటిదాకా చూస్తే, ప్రపంచంలోని వర్షారణ్యాల్లో (rain forests) సగానికి సగం మాయమైపోయాయి.

అడవుల్ని నాశనం చేస్తున్నామంటే, వాటిలో ఉండే చెట్లను, జంతువుల్ని కూడా నాశనం చేస్తున్నట్టే.

మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది

ఆశ్చర్యం కలిగించే ఓ విషయం ఏంటంటే, నరికేయబడిన కొన్ని అడవులు మళ్లీ దట్టంగా పెరిగి ఇంతకుముందుకన్నా ఎక్కువ స్థలంలో విస్తరించాయి. ఈ మధ్యే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు, నరికేసిన చెట్లు మానవ ప్రమేయం లేకుండానే చాలా త్వరగా, ఆరోగ్యంగా పెరగడం చూసి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు! ఈ ఉదాహరణలు ఒకసారి గమనించండి:

  • వ్యవసాయ భూములుగా వాడుకోవడం కోసం అడవుల్ని నరికేసి, ఆ తర్వాత ముట్టుకోకుండా వదిలేసిన కొన్ని స్థలాల్ని సైంటిస్టులు గమనిస్తూ వచ్చారు. ఉత్తర-దక్షిణ అమెరికాల్లో, పశ్చిమ ఆఫ్రికాలో అలాంటి 2,200 భూముల్ని అధ్యయనం చేశాక తేలిన విషయమేంటంటే, 10 ఏళ్లు తిరగకముందే అలాంటి స్థలాల్లో మళ్లీ చెట్లు మొలిచి అడవిగా మారడం సాధ్యమేనట!

  • వాటిని అలానే వదిలేస్తే సుమారు 100 ఏళ్లలోపే, అడవి మునుపటిలా పచ్చగా రకరకాల చెట్లతో, జంతువులతో కళకళలాడిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నట్లు సైన్స్‌ అనే మ్యాగజైన్‌లో వచ్చింది.

  • నరికేసిన అటవీ ప్రాంతాన్ని ముట్టుకోకుండా వదిలేస్తే త్వరగా అడవిగా మారుతుందా లేక, మనుషులు జోక్యం చేసుకుని కొత్త మొక్కల్ని నాటితే త్వరగా అడవిగా మారుతుందా అని బ్రెజిల్‌లోని సైంటిస్టులు పోల్చి చూశారు.

  • ఆ సైంటిస్టుల గురించి మాట్లాడుతూ నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఇలా చెప్పింది: “మనుషులు జోక్యం చేసుకుని చెట్లు నాటాల్సిన అవసరంలేదని వాళ్లు తెలుసుకున్నారు.” వాళ్లు పరిశోధించిన భూముల్లో మనుషులు ఎవరూ చెట్లు నాటకపోయినా కేవలం ఐదు సంవత్సరాల్లో, “ఆ ప్రాంతంలో సహజంగా పెరిగే చెట్లతో అవి నిండిపోయాయి.”

    మీకు తెలుసా?

    నరికేసినా ఎదుగుతాయి!

    వ్యవసాయం కోసం నరికేసి వదిలేసిన అటవీ ప్రాంతాన్ని చూపిస్తున్న నమూనా చిత్రం. 10 ఏళ్ల తర్వాత ఒక మోస్తరు ఎత్తు వరకు మొక్కలు ఎదుగుతాయి. 100 కన్నా ఎక్కువ ఏళ్ల తర్వాత చెట్లు పూర్తిగా ఎదిగి మళ్లీ అడవిలా మారే అవకాశం ఉంది.

    వ్యవసాయ భూములుగా వాడుకోవడానికి అడవుల్ని నరికి, ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల వాటిని అలానే వదిలేస్తుంటారు. అలాంటి భూముల్లో మొక్కలు వాటంతటవే మొలుస్తుంటాయి. వేర్వేరు కారణాలవల్ల నరికేసిన మిగతా అడవుల్ని కూడా అలానే వదిలేస్తే మళ్లీ ఇంతకుముందులా దట్టంగా మారిపోతాయి.

సంరక్షణ చర్యలు

ఉన్న అడవుల్ని కాపాడడానికి, నరికేసిన అడవుల్ని మళ్లీ ముందులా మార్చడానికి అన్ని దేశాల్లో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫలితం? గత 25 ఏళ్లలో, “ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత 50 కన్నా ఎక్కువ శాతం తగ్గిపోయిందని” ఒక UN రిపోర్ట్‌ చెప్పింది.

కాకపోతే, అడవుల్ని కాపాడడానికి ఈ ప్రయత్నాలు చాలవు! “గత కొన్నేళ్లుగా, ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవుల్ని (tropical forests) అడ్డూ-అదుపూ లేకుండా నరికేస్తున్నారు” అని గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ అనే సంస్థ ప్రచురించిన రిపోర్ట్‌లో వచ్చింది.

కలప అమ్మే కొన్ని కంపెనీలు ప్రభుత్వం కళ్లు కప్పి అక్రమంగా చెట్లను నరికి కోట్లకు పడగలెత్తుతున్నారు. వాళ్ల స్వార్థం కోసం అడవుల్ని అన్యాయంగా నాశనం చేస్తున్నారు.

అడవిలోని చెట్లను గమనిస్తున్న అటవీ ప్రాంత అధికారి.

అటవీ సంరక్షణను చూసుకుంటున్న కొన్ని సంస్థలు చెట్లను నరికే విషయంలో హద్దులు పెట్టుకుని పూర్తిగా ఎదిగిన చెట్లను అది కూడా తక్కువ సంఖ్యలో నరకడం, తర్వాత వాటి స్థానంలో కొత్తవాటిని నాటడం చేస్తున్నారు.

ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది

“చూడడానికి చక్కగా, తినడానికి మంచిగా ఉండే ప్రతీ చెట్టును యెహోవాa దేవుడు మొలిపించాడు.”—ఆదికాండం 2:9.

సృష్టికర్త అడవుల్ని ఏవిధంగా తయారు చేశాడో తెలుసా? మనుషులు వాళ్ల అవసరాల కోసం వాటిని ఉపయోగించుకునేలా, మళ్లీ అవి వాటంతటవే పెరిగేలా చేశాడు. ఆయన అడవుల్ని, వాటిలో ఉన్న కోటానుకోట్ల ప్రాణుల్ని కాపాడాలని, పోషించాలని అనుకుంటున్నాడు.

మనుషులు వాళ్ల స్వార్థం కోసం ఈ భూమిని, దాని మీదున్న ప్రాణుల్ని నాశనం చేస్తూ పోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడని బైబిలు చెప్తుంది. 15వ పేజీలో “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు” అనే ఆర్టికల్‌ చూడండి.

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.

ఎక్కువ తెలుసుకోవాలనుందా

అందమైన తోటగా మారిన భూమిని చూస్తూ ఒక జంట ఆనందిస్తున్నారు.

మనుషులు వాళ్ల స్వార్థం కోసం భూవనరుల్ని ఇష్టమొచ్చినట్లు వాడేసినా భూమి నాశనం కాదనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు? దేవుడు భూమిని ఎందుకు చేశాడు? వీడియో చూడండి. అది jw.org/teలో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి