కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g21 No. 3 పేజీలు 10-13
  • బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ఏం చెప్తుంది?
  • తేజరిల్లు!—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏమని చెప్పట్లేదు?
  • విజ్ఞానశాస్త్రం ఆదికాండములోని వృత్తాంతానికి విరుద్ధంగా ఉందా?
    తేజరిల్లు!—2006
  • ఆదికాండం 1:1—“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”
    బైబిలు వచనాల వివరణ
  • జీవం ఎలా వచ్చింది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
తేజరిల్లు!—2021
g21 No. 3 పేజీలు 10-13

బైబిలు ఏం చెప్తుంది?

“భూమిని, ఆకాశాన్ని సృష్టించిన రోజున వాటి చరిత్ర ఇది.” (ఆదికాండం 2:4) బైబిల్లో ఉన్న ఈ మాటలు భూమి ఎలా వచ్చిందో స్పష్టం చేస్తున్నాయి. బైబిల్లో ఉన్న విషయాలు సైన్స్‌ చెప్పే విషయాలతో సరిపోతున్నాయా? మీరే చూడండి.

సృష్టి ఆరంభంలో: దేవుడు ఆకాశాన్ని, భూమిని చేశాడు

విశ్వానికి ఒక ఆరంభం ఉందా?

ఆదికాండం 1:1 ఇలా చెప్తుంది: “మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”

విశ్వానికి ఒక ఆరంభం లేదని అది ఎప్పుడూ ఉనికిలోనే ఉందని, పేరున్న ఎంతోమంది సైంటిస్టులు సుమారు 1950 ముందు వరకు నమ్ముతూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్ని గమనించాక, విశ్వానికి ఒక ఆరంభం ఉందని చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు.

మొదట్లో భూమి ఎలా ఉండేది?

మొదట్లో భూమి “ఖాళీగా, పనికిరాకుండా,” నీళ్లతో నిండి ఉండేదని ఆదికాండం 1:2, 9 చెప్తుంది.

మనకాలంలో సైంటిస్టులు చేసిన పరిశోధనలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ప్యాట్రిక్‌ షీ అనే బయోలజిస్టు మాట్లాడుతూ, మొదట్లో భూమ్మీద ఆక్సిజన్‌ గానీ, చెట్లు గానీ, ఊపిరి ఉన్న ప్రాణులు గానీ ఉండేవి కావని చెప్పారు. ఆస్ట్రానమీ పత్రిక కూడా ఇలా రాసింది: “మొదట్లో భూమి నీటి కుండలా ఉండేది, పొడి నేల అనేదే దాదాపు ఎక్కడా కనిపించేది కాదని కొత్త పరిశోధనల్లో బయటపడింది.”

కాలం గడిచే కొద్దీ, భూవాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతూ వచ్చాయి?

ఆదికాండం 1:3-5 చెప్తున్నట్టు, మొట్టమొదటిసారిగా వెలుగు ప్రకాశించడం మొదలైనప్పుడు, ఆ వెలుగుకు కారణమైన సూర్యుడు గానీ, చంద్రుడు గానీ భూమ్మీద నుండి కనిపించేవి కావు. భూమి చుట్టూ దట్టమైన వాతావరణం ఉండడం వల్ల అవి కనిపించడానికి కొంతకాలం పట్టింది.—ఆదికాండం 1:14-18.

రోజుకు 24 గంటలు ఉండే ఆరు రోజుల్లో సృష్టి తయారు చేయబడిందని బైబిలు చెప్పట్లేదు

మొదట్లో భూమ్మీద చాలా తక్కువ కాంతి మాత్రమే ప్రసరించేదని స్మిత్‌సోనియన్‌ వాతావరణ రీసెర్చ్‌ సెంటర్‌ తెలిపింది. ఎందుకో తెలుసా? “భూమి తయారైన కొత్తలో మీథేన్‌ బిందువులు దట్టమైన పొరలా భూమిని కప్పివుంచాయి. కొంతకాలానికి ఆ బిందువులు పోయాయి, ఆకాశం నీలంగా మారింది” అని ఆ రీసెర్చ్‌ సెంటర్‌ వివరించింది.

భూమ్మీదున్న జీవుల్లో మొదట ఏవి పుట్టాయి?

1​—మొదటి రోజు: చాలా తక్కువ కాంతి భూవాతావరణాన్ని చేరింది.—ఆదికాండం 1:3-5

2​—రెండో రోజు: భూమి నీటితో, ఆవిరితో నిండివుండేది. ఆ తర్వాత ఆ రెండూ వేరుచేయబడ్డాయి. —ఆదికాండం 1:6-8

3​—మూడో రోజు: భూమ్మీద నీటి శాతం తగ్గింది, పొడి నేల ఏర్పడింది.—ఆదికాండం 1:9-13

4​—నాలుగో రోజు: భూమ్మీద నుండి సూర్యుడు, చంద్రుడు కనిపించాయి.—ఆదికాండం 1:14-19

5​—ఐదో రోజు: దేవుడు నీటిలో ఉండే జంతువుల్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని సృష్టించి వాటికి పిల్లల్ని కనే సామర్థ్యాన్ని ఇచ్చాడు.—ఆదికాండం 1:20-23

6​—ఆరో రోజు: భూమ్మీద జీవించే చిన్నా-పెద్దా జంతువులు చేయబడ్డాయి; మొదటి పురుషుడు, స్త్రీ తయారు చేయబడ్డారు. అక్కడితో ఆరో రోజు ముగిసింది.—ఆదికాండం 1:24-31

ఆదికాండం 1:20-27 వచనాల ప్రకారం, మొదట చేపలు, తర్వాత పక్షులు, ఆ తర్వాత నేలమీద జీవించే జంతువులు సృష్టించబడ్డాయి; చివరిగా మనుషులు తయారు చేయబడ్డారు. భూమ్మీద క్షీరదాలు (mammals) పుట్టడానికి ఎంతోకాలం ముందునుండే చేపలు ఉన్నాయని, మనుషులు ఆ తర్వాత చాలాకాలానికి ఉనికిలోకి వచ్చారని సైంటిస్టులు కనుగొన్నారు.

కాలం గడుస్తుండగా ప్రాణుల్లో మార్పులు జరగవని బైబిలు చెప్పట్లేదు

“బైబిలు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఎలా వచ్చిందో క్లుప్తంగానే వివరించింది. కానీ ఆధునిక సైన్స్‌ పరిశోధనల్లో తేలిన విషయాలు, ఆదికాండంలో ఉన్న విషయాలతో దాదాపుగా సరిపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.”—జెరాల్డ్‌ ఎల్‌. ష్రోడర్‌, ఫిజిస్టు.

బైబిలు ఏమని చెప్పట్లేదు?

బైబిలు చెప్తున్న విషయాలు, సైంటిస్టులు కనుగొన్న విషయాలతో సరిపోవట్లేదని కొందరు అంటారు. బైబిలు చెప్తున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వాళ్లు అలాంటి అభిప్రాయానికి వచ్చారు.

విశ్వం లేదా భూమి 6,000 ఏళ్ల క్రితమే తయారైందని బైబిలు చెప్పట్లేదు. ఆకాశం, భూమి “మొదట్లో” సృష్టించబడ్డాయని మాత్రమే అది చెప్తుంది. (ఆదికాండం 1:1) ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల క్రితం అవి ఉనికిలోకి వచ్చాయనే విషయాన్ని బైబిలు చెప్పట్లేదు.

రోజుకు 24 గంటలు ఉండే ఆరు రోజుల్లో సృష్టి తయారు చేయబడిందని బైబిలు చెప్పట్లేదు. ఈ సందర్భంలో “రోజు” అనే పదం, 24 గంటల్ని కాదుగానీ ఇంకా ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, యెహోవాa దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన “రోజున” అన్నప్పుడు, ఆరు సృష్టి రోజుల్ని అంటే భూమి, అందులోని ప్రాణులు (ఆదికాండం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది) తయారవడానికి పట్టిన మొత్తం సమయాన్ని సూచిస్తుంది. (ఆదికాండం 2:4) కాబట్టి ప్రాణులు జీవించేలా భూమిని సిద్ధం చేయడానికి, ఆ తర్వాత వివిధ ప్రాణుల్ని సృష్టించడానికి పట్టిన ఆరు సృష్టి రోజులు, 24 గంటలు ఉండే ఆరు రోజుల్ని సూచించట్లేదు; బదులుగా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సమయాన్ని సూచిస్తున్నాయి.

కాలం గడుస్తుండగా ప్రాణుల్లో మార్పులు జరగవని బైబిలు చెప్పట్లేదు. జంతువులు “వాటివాటి జాతుల ప్రకారం” సృష్టించబడ్డాయని ఆదికాండం పుస్తకం చెప్తుంది. (ఆదికాండం 1:24, 25) ‘జాతులు’ అనే పదాన్ని బైబిలు విస్తృతమైన అర్థంలో ఉపయోగిస్తుంది. కాబట్టి ఫలానా జాతి జంతువులు అన్నప్పుడు, ఏదో ఒక రకం జంతువులు కాదుగానీ, ఆ జాతికి చెందిన రకరకాల జంతువులు అని అర్థం. కాలం గడిచేకొద్దీ వాటిలో ఏదైనా ఒక రకం జంతువుల్లో మార్పులు జరిగి ఒక కొత్త రకం తయారుకావచ్చు, కానీ దాని జాతిలో మాత్రం ఏ మార్పూ ఉండదు.

మీకేమనిపిస్తుంది?

విశ్వం ఎలా వచ్చింది, మొదట్లో భూమి ఎలా ఉండేది, జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు బైబిలు సూటిగా, కరెక్ట్‌గా జవాబు ఇచ్చిందని మనం చూశాం. అయితే, వాటిని ఒకరు సృష్టించారని బైబిలు చెప్తున్న మాట కూడా సరైనదే కావచ్చా? “మనుషులను మించిన ఏదో గొప్ప శక్తి వల్ల జీవం మొదలైందనే విషయాన్ని, ఆధునిక సైన్స్‌ పరిశోధనలు కూడా అంగీకరిస్తున్నాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తోంది.b

ఒకసారి ఆలోచించండి

ఆదికాండం 1:1–2:4 చదవండి. ఈ వచనాలు సృష్టి ఎలా వచ్చిందో వివరిస్తున్నాయి. అయితే సృష్టి గురించి పురాతన కాలం నుండి రకరకాల కట్టుకథలు వినికిడిలో ఉన్నాయి. ఉదాహరణకు బబులోనీయులు, ఒక దేవత శవం నుండి అలాగే ఒక దేవుని రక్తం నుండి విశ్వం వచ్చిందని, మనుషులు పుట్టారని నమ్మేవాళ్లు. ప్రాచీన ఈజిప్టు ప్రజలైతే, రా అనే దేవుడు మనుషుల్ని కన్నీళ్ల నుండి తయారు చేశాడని చెప్పేవాళ్లు. చైనాలో కొంతమంది ప్రజలు, ఒక భారీకాయుని శవం నుండి ప్రకృతి శక్తులు వచ్చాయని, కుళ్లిపోయిన ఆయన శరీరంలోని పురుగుల నుండి మనుషులు పుట్టారని నమ్మేవాళ్లు. సృష్టి గురించి ఆదికాండం చెప్తున్న విషయాలు కూడా ఇలాంటి కట్టుకథే అని మీకు అనిపిస్తుందా? లేదా అందులోని విషయాలు సైంటిస్టులు చెప్తున్నవాటితో సరిపోతున్నట్లు అనిపిస్తుందా?

విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా? అనే నాలుగు నిమిషాల వీడియో చూడండి. jw.org/teలో వీడియో పేరు టైప్‌ చేసి వెతకండి.

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.

b సృష్టికర్త ఉన్నాడనే అభిప్రాయాన్ని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రచారం చేయట్లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి