కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g21 No. 3 పేజీలు 8-9
  • సైంటిస్టులు వివరించలేని విషయాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సైంటిస్టులు వివరించలేని విషయాలు
  • తేజరిల్లు!—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక ఎంబ్రియాలజిస్ట్‌ తన విశ్వాసాన్ని వివరిస్తున్నాడు
    తేజరిల్లు!—2016
  • సృష్టికర్త మీ జీవితాలకు అర్థాన్ని చేకూర్చగలడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • జీవం ఎలా ప్రారంభమైంది?
    అదనపు అంశాలు
  • జీవం ఎలా వచ్చింది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—2021
g21 No. 3 పేజీలు 8-9
ఒక సైన్స్‌ టీచర్‌ తన విద్యార్థులతో చర్చిస్తున్నాడు.

సైంటిస్టులు వివరించలేని విషయాలు

విశ్వంలో ఉన్న దాదాపు ప్రతీ అంశం మీద సైంటిస్టులు పరిశోధన చేశారంటారు. కానీ, ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు వాళ్లకింకా జవాబు దొరకలేదు.

విశ్వం ఎలా వచ్చిందో, జీవం ఎలా మొదలైందో సైంటిస్టులు వివరించగలరా? ఒక్క మాటలో చెప్పాలంటే, వివరించలేరు. కాస్మాలజీ (విశ్వశాస్త్రం) అనే సైన్స్‌ విభాగం, విశ్వం ఎలా వచ్చిందో వివరించగలదని కొందరు అంటారు. మార్సిలో గ్లేజర్‌ అనే ప్రొఫెసర్‌ డార్ట్‌మౌత్‌ కాలేజీలో ఖగోళశాస్త్రం బోధిస్తుంటారు. ఈయన ఒక అజ్ఞేయతావాది, అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం అసాధ్యమని భావించే వ్యక్తి. ఆయన ఇలా అంటున్నారు: “విశ్వం ఎలా వచ్చిందో ఇప్పటిదాకా మేము అస్సలు వివరించలేకపోయాం.”

అదేవిధంగా, జీవం ఎలా పుట్టిందనే విషయం గురించి సైన్స్‌ న్యూస్‌ అనే పత్రిక ఇలా రాసింది: “భూమ్మీద జీవం ఎలా మొదలైందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే, భూమి పుట్టుక గురించి తెలిపే పురాతన రాళ్లు, శిలాజాలు ఎప్పుడో అంతరించిపోయాయి.” ఈ విషయాల్ని బట్టి చూస్తే, విశ్వం ఎలా వచ్చింది, జీవం ఎలా మొదలైంది అనే ప్రశ్నలకు సైన్స్‌ ఇంకా జవాబు చెప్పలేకపోతోందని అర్థమౌతోంది.

అయితే మీకు ఇలాంటి కొన్ని సందేహాలు రావచ్చు: ‘జీవాన్ని ఎవరో సృష్టించివుంటే, ఆ సృష్టికర్త ఎవరు? నిజంగానే ఒక తెలివైన, ప్రేమగల సృష్టికర్త ఉన్నట్లయితే, ఆయన సృష్టించిన మనుషులు కష్టాలుపడడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు? ప్రజలు రకరకాల దేవుళ్లను ఆరాధిస్తున్నా, ఆయన ఎందుకు ఏమీ అనట్లేదు? తనను ఆరాధించేవాళ్లు చెడ్డపనులు చేస్తుంటే, ఆయనెందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు?’

ఈ ప్రశ్నలన్నిటికీ సైన్స్‌ జవాబు ఇవ్వలేదు. అలాగని ఇవి జవాబులే దొరకని అంతుచిక్కని ప్రశ్నలేమీ కాదు. చాలామందికి వీటి జవాబులు బైబిల్లో దొరికాయి.

బైబిల్ని చదివి, అధ్యయనం చేసిన కొంతమంది సైంటిస్టులు సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నారు. ఎందుకో తెలుసుకోవాలని ఉందా? అయితే jw.org/teలో జీవారంభం గురించిన అభిప్రాయాలు అనే వీడియో సిరీస్‌ని వెతకండి.

వాళ్లు నమ్మడానికి కారణం—సైన్స్‌, బైబిలు

జియార్జీ ఎన్‌. కొయిడన్‌, కెమిస్ట్‌

“రకరకాల కెమికల్స్‌ కలుపుతూ అణువుల్ని తయారు చేయడం నా పని. ఒకరకంగా అది చెస్‌ ఆడుతున్నట్లు ఉంటుంది, ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో రసాయన చర్యలు జరుపుతూ వెళ్తేనే చివరికి కావాల్సిన అణువు తయారౌతుంది. ఒక్క చర్య తప్పినా, అణువు తయారుకాదు. నాది కష్టమైన పనే; కానీ అణువుల్ని తయారుచేయడానికి జీవకణాల్లో జరిగే వేల రసాయన చర్యలతో (chemical reactions) పోలిస్తే నా పని సులువైనదనే చెప్పాలి. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు, కెమిస్ట్రీ గురించి మనకన్నా ఎంతో ఎక్కువ తెలిసిన ఒక సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం కుదిరింది.

“బైబిలు చదివినప్పుడు, అది మిగతా పుస్తకాల్లాంటిది కాదు అనిపించింది. బైబిల్ని 2,000 ఏళ్ల క్రితం రాశారు, కానీ అందులోని సలహాలు ఇప్పటికీ పనికొస్తున్నాయి. కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, ఇరుగుపొరుగు వాళ్లతో కలిసిమెలిసి ఉండడం గురించి బైబిల్లో ఉన్న సలహాలు మనకాలంలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంత మంచి సలహాల్ని ఒక మనిషి ఖచ్చితంగా ఇవ్వలేడు. మనుషుల కన్నా ఎన్నో వేల రెట్లు ఎక్కువ తెలివి ఉన్న వేరెవరో ఈ సలహాలు ఇచ్చారని నాకు నమ్మకం కుదిరింది.”

యాన్‌-డెర్‌ సూ, ఎంబ్రియాలజిస్టు

‘పిండం తయారౌతున్నప్పుడు, వేర్వేరు కణాలు ఒకదానితో మరొకటి చక్కగా సహకరించుకుంటేనే నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం, ఇతర కణజాలాలు (tissues) ఏర్పడి చివరికి ఒక బిడ్డ తయారౌతుంది. పిండం తయారయ్యే విధానం, మనిషి ఆలోచనకు అంతుచిక్కని అద్భుతంలా అనిపిస్తుంది. నేనైతే, ఎంతో తెలివైన ఒక డిజైనర్‌ జీవాన్ని సృష్టించాడని నమ్ముతాను.

‘తల్లి గర్భంలో పిండం ఎలా తయారు అవుతుందో కేవలం కొన్ని దశాబ్దాల క్రితమే సైంటిస్టులు కనుక్కున్నారు. కానీ వాళ్లు కనుక్కున్న లాంటి విషయాలు బైబిల్లోని కీర్తన 139:15, 16 వచనాల్లో ఎప్పుడో రాసున్నాయి. ఒక మామూలు మనిషికి, అన్ని వందల ఏళ్ల క్రితమే ఆ విషయాలు అంత ఖచ్చితంగా తెలియడం అసాధ్యం. ఆ కీర్తనకర్తకు సృష్టికర్త చెప్తే తప్ప, అవి అతనికి తెలిసే అవకాశమే లేదు.’

రసియో పికాడో హెరరొ: ఒక కెమిస్ట్రీ టీచర్‌ తన నమ్మకాల గురించి చెప్తుంది వీడియో చూడండి. jw.org/teలో వీడియో టైటిల్‌ టైప్‌ చేసి వెతకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి