కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g21 No. 1 పేజీలు 8-9
  • సంతృప్తితో ఎలా జీవించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంతృప్తితో ఎలా జీవించవచ్చు?
  • తేజరిల్లు!—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టపడి పనిచేయండి
  • నిజాయితీగా ఉండండి
  • డబ్బు వెనుక పరుగెత్తకండి
  • అత్యుత్తమ విద్యను ఎంచుకోండి
  • జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
    తేజరిల్లు!—2015
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
    తేజరిల్లు!—2007
  • డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
మరిన్ని
తేజరిల్లు!—2021
g21 No. 1 పేజీలు 8-9
ఇండియాలోని ఒక ప్రాంతంలో, షాపుల్లో ఉన్న ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలని ఆత్రంగా చూస్తున్న ప్రజల మధ్య, అవేవీ పట్టించుకోకుండా ఒక తల్లి, ఆమె కొడుకు తమకు అవసరమైనవి కొనుక్కొని సంతృప్తిగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

సంతృప్తితో ఎలా జీవించవచ్చు?

పెళ్లైన వాళ్లమైనా, పెళ్లికాని వాళ్లమైనా, ముసలివాళ్లమైనా, యౌవనస్థులమైనా అందరం కోరుకునేది ఒకటే. మనం సంతోషంగా, సంతృప్తిగా జీవించాలి. మనం అలా జీవించాలనే మన సృష్టికర్త కూడా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకోసం అద్భుతమైన సలహాలు ఇచ్చాడు.

కష్టపడి పనిచేయండి

“కష్టపడి పనిచేయాలి, అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.”—ఎఫెసీయులు 4:28.

మనం కష్టపడి పనిచేయాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు. ఆయనిచ్చే ఈ సలహా పాటిస్తే మనమే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి తననూ తన కుటుంబాన్నీ పోషించుకుంటాడు, అవసరంలో ఉన్నవాళ్లకు వీలైన సహాయం చేయగలుగుతాడు. అతని పని చూసి యజమాని సంతోషిస్తాడు కాబట్టి, ఉద్యోగం పోతుందనే భయం ఉండదు. పవిత్ర గ్రంథం చెప్తున్నట్లు, కష్టానికి వచ్చిన ప్రతిఫలం నిజంగా “దేవుడు ఇచ్చిన బహుమతి.”—ప్రసంగి 3:13.

నిజాయితీగా ఉండండి

“మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం, మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాం.”—హెబ్రీయులు 13:18.

నిజాయితీగా ఉండే వ్యక్తి ఎవ్వరికీ భయపడడు, రాత్రిపూట హాయిగా నిద్రపోతాడు. వేరేవాళ్లు కూడా అతన్ని నమ్ముతారు, గౌరవిస్తారు. కానీ నిజాయితీలేని వ్యక్తికి, అతని మీద అతనికే గౌరవం ఉండదు. తప్పు చేశాననే ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో సరిగ్గా నిద్రపట్టదు.

డబ్బు వెనుక పరుగెత్తకండి

“డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.”—హెబ్రీయులు 13:5.

ఆహారం కోసం, ఇతర అవసరాల కోసం డబ్బు అవసరమే. అయితే, డబ్బు వెనుక పరుగెత్తడం లేదా దాన్ని ప్రేమించడం మాత్రం చాలా ప్రమాదకరం. డబ్బును ప్రేమించే వ్యక్తి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తన సమయాన్ని, శక్తిని డబ్బు సంపాదించడానికే ధారపోస్తాడు. దానివల్ల భార్యాపిల్లలతో అతనికున్న సంబంధం దెబ్బతింటుంది, అతని ఆరోగ్యం కూడా పాడౌతుంది. (1 తిమోతి 6:9, 10) అన్నిటికన్నా ముఖ్యంగా, అతను అవినీతిగా నడుచుకునే అవకాశం ఉంది. అందుకే, ఒక తెలివైన వ్యక్తి ఇలా చెప్పాడు: “నమ్మకమైనవాడు ఎన్నో దీవెనలు పొందుతాడు, ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు.”—సామెతలు 28:20.

అత్యుత్తమ విద్యను ఎంచుకోండి

“తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో.” —సామెతలు 3:21.

మంచిగా చదువుకుంటే మన కాళ్ల మీద మనం నిలబడతాం, మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. కానీ ఎక్కువ చదువుకున్నంత మాత్రాన ఎప్పుడూ సంతోషంగా ఉంటామని గ్యారెంటీ లేదు. మనం ప్రతీ పనిలో నిజమైన విజయం సాధించాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని వాటి ప్రకారం నడుచుకోవాలి. పవిత్ర గ్రంథంలో ఏమని ఉందంటే: దేవుని మాట వినే వ్యక్తి “చేసే ప్రతీది సఫలమౌతుంది.”—కీర్తన 1:1-3.

నేను సంతోషంగా ఉన్నాను, నా దగ్గరున్న వాటితో సంతృప్తిగా జీవిస్తున్నాను

“మా ప్రాంతంలోని ప్రజలు చాలా పెద్దపెద్ద చదువులు చదువుతారు. చేతినిండా డబ్బు, గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటారు. అనుకున్నది సాధించాక కూడా వాళ్లు సంతోషంగా ఉండలేకపోతున్నారు. అయితే, ఒకవ్యక్తి ఏ విషయాలకు అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇవ్వాలో బైబిలు సహాయంతో అర్థం చేసుకోగలిగాను. కొన్ని పనుల కోసం డబ్బు అవసరమే, కానీ దాంతో నిజమైన సంతోషాన్ని, నిజమైన స్నేహితుల్ని కొనలేం. ఉద్యోగం ముఖ్యమే కానీ డబ్బును ప్రేమించడం మంచిది కాదని బైబిలు సహాయంతో తెలుసుకున్నాను. ఆ సలహా పాటించడం వల్ల ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, నా దగ్గరున్న వాటితో సంతృప్తిగా జీవిస్తున్నాను.”—కిషోర్‌.

కిషోర్‌.

ఎక్కువ తెలుసుకోండి

ఉద్యోగం, డబ్బు, చదువుకు సంబంధించి మన సృష్టికర్త ఇచ్చిన తెలివైన సలహాల కోసం jw.org వెబ్‌సైట్‌లో బైబిలు బోధలు > శాంతి, సంతోషం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి