కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g19 No. 2 పేజీలు 12-13
  • పెద్దవాళ్ల నిర్దేశం, సలహాలకున్న విలువ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెద్దవాళ్ల నిర్దేశం, సలహాలకున్న విలువ
  • తేజరిల్లు!—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిర్దేశాలు, సలహాలు ఎవరు ఇవ్వవచ్చు?
  • పెద్దవాళ్ల సహాయం ఎందుకు ముఖ్యం?
  • పిల్లలకు నిర్దేశం, సలహాలు ఎలా ఇవ్వాలి?
  • తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?
    కుటుంబం కోసం
  • కౌమారదశ ఈ దశలో పిల్లల్ని ఎలా పెంచాలి?
    తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • పిల్లలను పెంచే విషయంలో నమ్మదగిన సలహా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • వెళ్ళనివ్వడానికి నేర్చుకోవడం
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—2019
g19 No. 2 పేజీలు 12-13
ఒకామె తన పాత ఫోటోలను ఒక పాపకు చూపిస్తుంది

5

పెద్దవాళ్ల నిర్దేశం, సలహాలకున్న విలువ

నిర్దేశాలు, సలహాలు ఎవరు ఇవ్వవచ్చు?

పిల్లలకు వాళ్ల జీవితంలో వాళ్లను నడిపించి, సలహాలు ఇచ్చే పెద్దవాళ్లు అవసరం. తల్లిగా లేదా తండ్రిగా, మీకన్నా బాగా ఆ పని చేయగలిగేవాళ్లు ఇంకెవ్వరూ లేరు. నిజానికి అది మీ బాధ్యత. అయితే, అనుభవం ఉన్న ఇతరులు కూడా మీ పిల్లలకు కావాల్సిన సహాయం, సలహాలు ఇవ్వవచ్చు.

పెద్దవాళ్ల సహాయం ఎందుకు ముఖ్యం?

చాలా దేశాల్లో పిల్లలు పెద్దవాళ్లతో చాలా తక్కువ సమయం గడుపుతారు. వీటిని పరిశీలించండి:

  • పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లోనే గడుపుతారు. అక్కడ టిచర్లు, పెద్దవాళ్లకన్నా పిల్లలే ఎక్కువమంది ఉంటారు.

  • అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లిపోవడం వల్ల స్కూల్‌ తర్వాత కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటారు.

  • ఒక అధ్యయనం ప్రకారం, అమెరికాలో 8 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకు సగటున ఆరు గంటలు వినోద కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు.a

హోల్డ్‌ ఆన్‌ టు యువర్‌ కిడ్స్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “పిల్లలు, ఎలా ఉండాలి ఏమి చేయాలి అనే విషయాల్లో సలహాలు, నిర్దేశం కోసం అమ్మానాన్నలు, టీచర్లు, బాధ్యతగల ఇతర పెద్దవాళ్ల దగ్గరకు కాకుండా . . . తోటి వయసు ఉన్న పిల్లల దగ్గరకు వెళ్తున్నారు.”

పిల్లలకు నిర్దేశం, సలహాలు ఎలా ఇవ్వాలి?

మీ పిల్లలతో సమయం గడపండి.

మంచి సూత్రాలు: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”—సామెతలు 22:6.

పిల్లలు సాధారణంగా సలహాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తారు. నిజానికి పిల్లలు టీనేజ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా తోటి పిల్లలు ఇచ్చే సలహాల కన్నా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలకే ఎక్కువ విలువ ఇస్తారు. “పెద్దవాళ్లు అవుతుండగా పిల్లల స్వభావం, వాళ్ల ప్రవర్తన పైన తల్లిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది” అని డా. లారెన్స్‌ స్టీన్‌బర్గ్‌ యు అండ్‌ యువర్‌ ఎడాలసెంట్‌ అనే పుస్తకంలో రాశాడు. ఆయన తల్లిదండ్రులను సూచిస్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు, ‘ఎదుగుతున్న పిల్లలు మీరు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు, మీరు ఏమి చెప్తున్నారో వింటారు. వాళ్లు ఈ విషయాన్ని బయటకు చూపించకపోవచ్చు, మీరు చెప్పే ప్రతీ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ అది నిజం.’

సలహాలకు, సహాయానికి పిల్లలు సహజంగా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. వాళ్లకున్న ఈ సహజ అలవాటుని ఉపయోగించుకుని వాళ్లతో సమయం గడపండి. మీ అభిప్రాయాలను, విలువలను, మీ అనుభవాలను వాళ్లకు చెప్పండి.

అనుభవం ఉన్న పెద్దవాళ్ల సహాయం ఏర్పాటు చేయండి.

మంచి సూత్రాలు: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.”—సామెతలు 13:20.

ఎదుగుతున్న పిల్లలకు మంచి ఆదర్శంగా ఉండే పెద్దవాళ్ల సహాయం మీరు తీసుకోగలరా? అలాంటి వాళ్లను మీ బాబుతో లేదా పాపతో సమయం గడిపేలా ఎందుకు ఏర్పాటు చేయకూడదు? దానర్థం తల్లిదండ్రులుగా మీకున్న అధికారాన్ని, బాధ్యతను మీరు వదిలేయాలని కాదు. మీ పిల్లలకు హాని చేయరని మీకు నమ్మకం ఉన్న పెద్దవాళ్లను మీ పిల్లలకు సహాయం చేసేలా ఏర్పాటు చేయండి. అది మీరు ఇచ్చే శిక్షణకు అదనంగా ఉండాలి. బైబిల్లో తిమోతి పెద్దవాడు అయ్యాక కూడా అపొస్తలుడైన పౌలు సహవాసం నుండి ఎంతో ప్రయోజనం పొందాడు, పౌలు కూడా తిమోతి స్నేహం నుండి ప్రయోజనం పొందాడు.—ఫిలిప్పీయులు 2:20, 22.

ఇదివరకులా, కుటుంబంలో అందరూ ఒకేచోట ఉండడం లేదు. గడిచిన శతాబ్దంలో, చాలా కుటుంబాల్లో అమ్మమ్మ-తాతయ్యలు, పెద్దనాన్న-పెద్దమ్మలు, మిగతా బంధువులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాంటప్పుడు, మీరు కోరుకునే మంచి లక్షణాలు మీ పిల్లల్లో వచ్చేలా మీరు ఏం చేయవచ్చు? ఆ లక్షణాలు ఉన్న పెద్దవాళ్ల దగ్గర మీ పిల్లలు నేర్చుకునేలా మీరే ఏర్పాటు చేయవచ్చు.

a ఆ అధ్యయనం ప్రకారం టీనేజర్లు సగటున రోజుకు 9 గంటలు వినోద కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. పిల్లలు, టీనేజర్లు స్కూల్లో ఉన్నప్పుడు లేదా హోంవర్క్‌ చేస్తున్నప్పుడు ఆన్‌లైన్‌లో వెచ్చించే సమయాన్ని ఈ లెక్కల్లో చేర్చలేదు.

ఒకామె తన పాత ఫోటోలను ఒక పాపకు చూపిస్తుంది

ఇప్పుడే నేర్పించండి

పెద్దవాళ్ల దగ్గర నేర్చుకోవాలని కోరుకునే పిల్లలు, పెద్దయ్యాక తెలివిని పరిణతిని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది

మంచి ఆదర్శం ఉంచండి

  • నేను మా పిల్లలకు మంచి ఆదర్శంగా ఉన్నానా?

  • నేను కూడా సలహాల కోసం ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లను అడుగుతానని మా పిల్లలకు చూపిస్తున్నానా?

  • నేను నా పిల్లలతో సమయం గడపడం ద్వారా వాళ్లు నాకు చాలా ముఖ్యం అని చూపిస్తున్నానా?

తల్లిదండ్రులుగా మేము ఏం చేశామంటే . . .

“కొన్నిసార్లు నేను ఏదోక పని మధ్యలో ఉన్నప్పుడు నా కూతురు నాతో మాట్లాడాలని అంటుంది. ఆమె చెప్పేది పూర్తి శ్రద్ధతో వినడానికి ప్రయత్నిస్తాను. వెంటనే వినడం కుదరనప్పుడు నేను ఆమెను కొన్ని నిమిషాలు ఆగమని చెప్పడం ద్వారా నా కూతురు నాకు ఎప్పుడూ చాలా ముఖ్యం అని చూపిస్తాను. నా భార్య నేను మంచి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నిస్తాం దాన్నిబట్టి మేము చెప్పే విషయాలను మేము పాటిస్తామని మా కూతురు తెలుసుకుంటుంది.”—డేవిడ్‌.

“మాకు కూతురు పుట్టినప్పుడు నేను ఉద్యోగం మానేసి, ఇంట్లో ఉండి బిడ్డను చూసుకోవాలని నా భర్త, నేను మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నందుకు నాకు అస్సలు బాధ లేదు. పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. అలా చేస్తే పిల్లలు సరైన నిర్దేశం, సలహాలు పొందగలరు. ఇంకా ముఖ్యంగా, వాళ్లతో ఉండడం ద్వారా మీకు వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపిస్తారు.”—లిసా.

పెద్దవాళ్లతో సమయం గడపాలి

“మా పిల్లలు వేర్వేరు వయసు ఉన్న పెద్దవాళ్ల మధ్య పెరిగారు, అందువల్ల వేరేవాళ్ల అనుభవాల నుండి జీవితాన్ని తెలుసుకోవడానికి మా పిల్లలకు వీలైంది. ఉదాహరణకు, మా అమ్మమ్మ చిన్నప్పుడు వాళ్ల ఇంటికే మొట్టమొదటిగా కరెంట్‌ వచ్చిందని నా పిల్లలకు చెప్పింది, అప్పుడు వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. మా అమ్మమ్మ వాళ్ల వంట గదిలో లైట్‌ వేస్తే, ఆపేస్తే నిలబడి చూడ్డానికి చుట్టుప్రక్కల వాళ్లందరు వాళ్ల ఇంటికి వచ్చేవాళ్లని చెప్పింది. అప్పట్లో జీవితం ఎంత వేరుగా ఉండేదో నా పిల్లలు అర్థం చేసుకోవడానికి ఆ విషయాలు సహాయం చేశాయి. వాళ్ల మామ్మ, వాళ్లకు అవన్నీ చెప్తుంటే వినడం వల్ల పిల్లలకు ఆమె మీద, అలాగే పెద్ద వయసులో ఉన్న వాళ్ల మీద గౌరవం పెరిగింది. పిల్లలు పెద్దవాళ్లతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, తోటి వయసు వాళ్లతో తక్కువ సమయం గడిపినప్పుడు జీవితాన్ని వేర్వేరు కోణాల్లో చూడగలుగుతారు.”—మరాండ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి