కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g 1/15 పేజీలు 2-6
  • మానసిక సమస్య ఉంటే భయపడాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మానసిక సమస్య ఉంటే భయపడాలా?
  • తేజరిల్లు!—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానసిక వ్యాధుల గురించి కొన్ని నిజాలు
  • మానసిక వ్యాధుల గురించి తెలుసుకోండి
  • మానసిక వ్యాధులకు చికిత్స
  • దేవుని మీద భక్తి కూడా అవసరం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • దేవుడు మాటిస్తున్నాడు మానసిక సమస్యలు ఇక ఉండవు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • 4 | బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
మరిన్ని
తేజరిల్లు!—2015
g 1/15 పేజీలు 2-6
మానసికంగా బాధపడుతున్న భర్తను దిగులుగా చూస్తున్న భార్య

పత్రిక ముఖ్యాంశం

మానసిక సమస్య ఉంటే భయపడాలా?

“నాకు మానసిక వ్యాధి (బైపోలార్‌ డిజార్డర్‌, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌) ఉందని డాక్టర్లు చెప్పగానే ఒక్క నిమిషం ఊపిరాడలేదు. మానసిక వ్యాధి ఉందంటే అందరూ వింతగా చూస్తారని చాలా భయమేసింది” అని క్లాడీయ అంది.

“పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. ఈ పరిస్థితిలో నేను నా భార్యకు తోడుగా ఉంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాను” అని ఆమె భర్త మార్క్‌ చెప్పాడు.

మీకు గానీ, మీవాళ్లెవరికైనా గానీ మానసిక వ్యాధి ఉందని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? కంగారు పడకండి, ఈ వ్యాధులకు చికిత్స ఉంది. మానసిక వ్యాధుల గురించి మనం తెలుసుకోవాల్సిన వాటిని చూద్దాం. తెలుసుకుంటే చాలా ఉపయోగాలున్నాయి.a

మానసిక వ్యాధుల గురించి కొన్ని నిజాలు

“ప్రపంచంలో కోట్లమంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీటివల్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా బాధ పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మానసిక వ్యాధితో బాధపడతారు. మానసిక వ్యాధుల్లో ఎక్కువమందిలో కనిపించేది డిప్రెషన్‌ అయితే ఎక్కువగా ఇబ్బందిపెట్టే వ్యాధులు మాత్రం వేరే ఉన్నాయి. అవి స్కిట్సొఫ్రెనియా, బైపోలార్‌ డిజార్డర్‌. . . . మానసిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నా వాటిని బయటకు చెప్పడం లేదు, సరైన వైద్య సహాయం అందట్లేదు, వాళ్లను చులకనగా చూస్తున్నారు.”—ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).

మానసిక వ్యాధి ఉందని తెలిస్తే అవమానమని చాలామంది వైద్య సహాయం తీసుకోవడానికి వెనకాడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.

మానసిక వ్యాధులకు చికిత్స ఉన్నా గడిచిన సంవత్సరంలో అమెరికాలో ఆ వ్యాధులతో బాధపడుతున్న పెద్దవాళ్లలో దాదాపు 60 శాతం, 8 నుండి 15 ఏళ్ల పిల్లల్లో 50 శాతం చికిత్స పొందలేదు అని నేషనల్‌ అలయన్స్‌ ఆన్‌ మెంటల్‌ ఇల్‌నెస్‌ అనే సంస్థ చెప్పింది.

మానసిక వ్యాధుల గురించి తెలుసుకోండి

మానసిక వ్యాధి ఉన్న స్త్రీ

మానసిక వ్యాధి అంటే సరిగ్గా ఆలోచించలేకపోవడం, ప్రవర్తించలేకపోవడం; కోపం, సంతోషం, దుఃఖం లాంటివి వచ్చినప్పుడు విపరీతంగా ప్రవర్తించడం అని డాక్టర్లు చెబుతున్నారు. మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోవడం, అందరిలా ఉండలేకపోవడం, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడం జరగవచ్చు.

మానసిక వ్యాధులు మనలో ఉండే బలహీనతల వల్ల రావు

వ్యాధి లక్షణాలు ఎంత కాలంగా ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక్కొక్కరి సమస్య, పరిస్థితిని బట్టి మారుతుంది. ఆడామగ, చిన్నాపెద్ద, మతం, ప్రాంతం, చదువు, ఆస్తి లాంటి వాటితో సంబంధం లేకుండా ఎవరికైనా ఇవి రావచ్చు. మానసిక వ్యాధులు మనలో ఉండే బలహీనతల వల్ల రావు. సరైన వైద్య సహాయం తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుంది, అప్పుడు అందరిలాగే జీవిస్తారు, పనిచేస్తారు.

మానసిక వ్యాధులకు చికిత్స

చికిత్స ద్వారా డాక్టర్లు మానసిక వ్యాధులను పూర్తిగా తగ్గిస్తారు. ముందు చేయాల్సిన పనేంటంటే చికిత్స చేయడంలో అనుభవం ఉన్న డాక్టరుతో పూర్తిగా పరీక్ష చేయించుకుని సమస్యను తెలుసుకోవాలి.

మానసిక వ్యాధి ఉన్న ఆమె డాక్టరుతో మాట్లాడుతుంది

డాక్టరుకు చూపించుకుంటే సరిపోదు ఆయనిచ్చిన మందులు వాడాలి, సలహాలను పాటించాలి. డాక్టరుకు సమస్య గురించి ఏమీ దాచిపెట్టకుండా చెప్పాలి. మీ వ్యాధి ఏంటో, రోజూ మీకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో డాక్టరు, ఆయనతో పనిచేసే వాళ్లు చెబుతారు. అంతేకాక వాళ్లు చికిత్స పూర్తయ్యేవరకు దాన్ని ఆపకూడదు అని కూడా చెబుతారు. చికిత్స కోసం వెళ్తున్నప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మీకు ధైర్యం చెప్పే వాళ్లను తోడుగా తీసుకువెళ్లాలి.

చాలామంది సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల, డాక్టరు చెప్పిన వైద్యాన్ని పాటించడం వల్ల వ్యాధిని తగ్గించుకున్నారు. “నా భార్యకు సమస్య ఉందని తెలీక ముందు, మాకు మానసిక వ్యాధుల గురించి అంతగా తెలీదు. వ్యాధివల్ల వచ్చే ఇబ్బందులను మెల్లమెల్లగా పరిష్కరించుకుంటూ పరిస్థితికి తగినట్లు ఎలా మారాలో ఇప్పుడు నేర్చుకున్నాం. డాక్టర్లు, ఆయనతో పనిచేసేవాళ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం మాకెంతో ఉపయోగపడింది” అని మొదట్లో చూసిన మార్క్‌ అన్నాడు.

ముందు చేయాల్సిన పనేంటంటే మంచి డాక్టరుతో పరీక్ష చేయించుకుని, సమస్యను పూర్తిగా తెలుసుకోవాలి

“నాకు వ్యాధి ఉందని తెలిసినప్పుడు, జైల్లో పడేసినట్లు అనిపించింది. నా వ్యాధి వల్ల నేను, నా భర్త ప్రతీది చేయలేం. కానీ ప్రయత్నిస్తే కష్టంగా అనిపించే వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు అని అర్థమైంది. నాకు వైద్య సహాయం ఇస్తున్న వాళ్ళు చెప్పేవన్నీ పాటిస్తూ, అందరితో స్నేహంగా ఉంటూ, ఇబ్బందులను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ నా వ్యాధిని తగ్గించుకుంటున్నాను” అని క్లాడీయ చెప్పింది.

దేవుని మీద భక్తి కూడా అవసరం

బైబిలు చదువుకుంటున్న స్త్రీ

కేవలం దేవుని మీద భక్తి మాత్రమే వ్యాధుల్ని తగ్గిస్తుందని బైబిలు చెప్పడం లేదు. కానీ బైబిల్లో ఉన్న విషయాల నుండి ప్రపంచంలో చాలా కుటుంబాలు ఓదార్పును, ధైర్యాన్ని పొందారు. మనల్ని ప్రేమించే సృష్టికర్త “విరిగిన హృదయం,” “నలిగిన మనస్సు” ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటాడని బైబిలు హామీ ఇస్తుంది.—కీర్తన 34:18.

బైబిలు వైద్య పుస్తకం కాకపోయినా మనసంతా బాధతో నిండినప్పుడు, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఏమి చేయాలో బైబిల్లో ఉంది. జీవితంలో బాధలు, వ్యాధులు ఇంకెప్పుడూ ఉండని రోజులు రాబోతున్నాయి అనే ఊరటను కూడా బైబిలు ఇస్తుంది. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును” అని దేవుడు మాటిస్తున్నాడు.—యెషయా 35:5, 6. ◼ (g14-E 12)

a ఈ ఆర్టికల్‌లో “మానసిక వ్యాధి” అంటే మానసిక సమస్యలు, మామూలుగా ప్రవర్తించకపోవడం వంటివి.

మానసిక వ్యాధి ఉంటే ఇలా ఉంటుంది

“కొన్నిసార్లు భయం వల్ల కొన్ని పనులు ఇక చేయలేను అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు కనీసం సరిగ్గా మనసుపెట్టి చదవలేను. బాధలో ఎంత మునిగిపోతానంటే ఎవ్వరితో కనీసం స్నేహితులతో కూడా మాట్లాడాలనిపించదు. కొంతమంది పరిస్థితులు మారతాయని, పరిస్థితులు అంత ఘోరంగా లేవని నాకు సహాయం చేయడానికి చెబుతుంటారు. ఇంకొంతమంది జీవితంలో మంచి విషయాల గురించి అలోచించమని చెబుతారు. వాటిని నేను ఎన్నోసార్లు చేసిచూసాను! అవన్నీ నా మంచికోసమే చెప్పినా వాటిని విన్నప్పుడల్లా నేను ఎందుకూ పనికిరాననీ, ఏమీ చేయలేననీ, నాలో ఏదో తప్పుందనీ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.”—క్లాడీయ, దక్షిణ ఆఫ్రికా.

మానసిక వ్యాధులు ఉంటే

  1. డాక్టర్లు ఇచ్చే వైద్యం తీసుకోండి, సలహాలు పాటించండి.b

  2. ప్రతీరోజు పనుల్ని సమయానికి చేయడం అలవాటు చేసుకోండి.

  3. వ్యాయామం (ఎక్సర్‌సైజ్‌) చేయండి.

  4. సరిపడినంత నిద్రపోండి.

  5. ప్రతీ రోజు కొంచెం సమయం సరదాగా గడపండి.

  6. మంచి ఆహారం తీసుకోండి.

  7. మద్యం తాగడం తగ్గించండి, డాక్టరు ఇవ్వని మందులు తీసుకోవద్దు.

  8. ఒంటరిగా ఉండకుండా మీకు ఇష్టమైన వాళ్లతో మిమ్మల్ని చూసుకునే వాళ్లతో ఉండండి.

  9. దేవుని మీద భక్తి పెంచుకోండి.c

b తేజరిల్లు! పత్రికలో ఏ చికిత్స తీసుకోవాలో చెప్పరు. తీసుకుంటున్న చికిత్స బైబిలుకు విరుద్ధంగా ఉండకుండా క్రైస్తవులు చూసుకోవాలి.

c తేజరిల్లు! (ఇంగ్లీషు) మే 2014 సంచికలో “మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా?” కూడా చూడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి