కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 11/8 పేజీలు 7-9
  • యుద్ధానికి వీడ్కోలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధానికి వీడ్కోలు
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూగోళవ్యాప్త శాంతిని గురించిన ఒక వాస్తవిక దర్శనం
  • దేవుని వాగ్దానాల్లో విశ్వాసముంచడం—ఎందుకు, ఎలా?
  • భూమ్మీద శాంతి సాధ్యమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుని రాజ్యం పరిపాలిస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ‘ఎన్నటికి నాశనం కాని’ రాజ్యము
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 11/8 పేజీలు 7-9

యుద్ధానికి వీడ్కోలు

అన్నిచోట్ల ఉన్న ప్రజలు, యుద్ధం లేని లోకాన్ని గురించి ఎంతో కాలంగా కలలు కన్నారు. అది ఇప్పటివరకూ నెరవేరని కల. ముందటి శీర్షికలో మనం చూసినట్లుగా, నిష్పక్షపాతంగా, భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచవ్యాప్త ప్రభుత్వం ద్వారా మాత్రమే, భూగోళవ్యాప్త సమాధానం రాగలదని అనేకులు నమ్ముతారు. అయితే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి తమ సర్వాధికారాన్ని మానవ పరిపాలకులు ఇష్టపూర్వకంగా ఎన్నడూ ఇవ్వరని చాలా మంది గుర్తిస్తారు. అలాంటి లోక ప్రభుత్వం రావడం అసాధ్యమని దానర్థమా?

అలా అనిపించవచ్చు. అయితే, భూమ్యంతటా పరిపాలించే ఒక ప్రభుత్వం త్వరలోనే భూమిమీద శాంతిని నెలకొల్పుతుందని బైబిలు ప్రవచనం చూపిస్తుంది. మానవ సంప్రదింపు వల్ల లేదా అంతర్జాతీయ ఒడంబడుల ద్వారా ఇది రాదు. “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు” అని వ్రాయడానికి దానియేలు దైవప్రేరేపితుడయ్యాడు. (ఇటాలిక్కులు మావి.)—దానియేలు 2:44.

ఈ రాజ్యమూ, ప్రభువు ప్రార్థన అని లక్షలాదిమందికి తెలిసిన ప్రార్థనలో అంటే యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ప్రార్థించమని యేసు చెప్పిన రాజ్యమూ ఒక్కటే. మత్తయి 6:9, 10లో కనిపించే ఆ ప్రార్థన మీకు తెలిసే ఉండవచ్చు. అందులోని కొంత భాగం, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని దేవునికి విజ్ఞప్తి చేసుకుంటుంది. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ రాజ్యం, భూమి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు త్వరలోనే ‘వస్తుంది.’ ఈ భూగోళాన్ని, శాంతియుతమైన పరదైసుగా మార్చాలన్నది దేవుని చిత్తంలో భాగమై ఉంది.

భూగోళవ్యాప్త శాంతిని గురించిన ఒక వాస్తవిక దర్శనం

మానవ ప్రభుత్వాల కన్నా దేవుని రాజ్యం బాగా పని చేయగలదని నమ్మడానికి ఏదైన కారణముందా? తన రాజ్యంలో అందరికీ నిత్యశాంతిని ఇచ్చే దేవుని రాజ్యపు కనీసం ఎనిమిది సవిశేషతలను చూద్దాం.

1. “శాంతికి రాకుమారుడు” అయిన మహిమపరచబడిన యేసుక్రీస్తు, ఆ రాజ్యానికి దైవనియుక్త నాయకుడుగా ఉంటాడు. (యెషయా 9:6, NW) తన సేవకులు యుద్ధానికి సన్నద్ధులు కారు అని భూమి మీద ఉన్నప్పుడు యేసు చూపించాడు. “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని ఆయన పేతురుతో అన్నాడు.—మత్తయి 26:52.

2. ఆ రాజ్యం, నిజమైన ప్రపంచవ్యాప్తమైన ఒక ప్రభుత్వంగా ఉంటుంది. యేసుకు ఇవ్వబడిన అధికారాన్ని గురించి, దానియేలు ఈ విధంగా ముందుగానే చెప్పాడు: “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను.”—దానియేలు 7:14.

3. ఆ రాజ్యం సకల జనములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. యేసు సహపరిపాలకులు, ‘ప్రతి వంశములో నుండి, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి’ వచ్చినవారై ఉంటారు, వారు ‘భూలోకమును ఏలుతారు.’—ప్రకటన 5:9, 10.

4. దేవుని ప్రభుత్వం తనను వ్యతిరేకించే సమస్త మానవ ప్రభుత్వాలను అంతం చేస్తుంది. “ఆ రాజ్యము . . . ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

5. భూమి మీది ప్రజలను అంతర్జాతీయ చట్టం నడిపిస్తుంది. ఆ కాలము గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. . . . ఆయన . . . అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును.”—యెషయా 2:3, 4.

6. ఆ రాజ్య ప్రజలు శాంతియుత మార్గాలను నేర్చుకుంటారు. యెషయా ఇంకా ఇలా అన్నాడు: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.

7. హింస ప్రేమికులు తుడిచిపెట్టబడతారు. “యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలాత్కారాసక్తులును [“హింసను ప్రేమించేవారును,” NW] ఆయనకు అసహ్యులు, దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.”—కీర్తన 11:5, 6.

8. ఆయుధాలు నిర్మూలం చేయబడతాయి. “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.

దేవుని వాగ్దానాల్లో విశ్వాసముంచడం—ఎందుకు, ఎలా?

బైబిలు దేవుని రాజ్యాన్ని గురించిన మరెక్కువ వివరాలను ఇస్తుంది. ఉదాహరణకు, భూమిమీది కార్యాలను నడిపించడంలో యేసుతోపాటు ఎవరు చేరుతారు అన్నది బైబిలు చూపిస్తుంది. వాళ్ళు ఎలా ఎంపిక చేయబడ్డారు, వాళ్ళు ఏ యోగ్యతలను సంపాదించుకోవడం తప్పనిసరి అన్నది కూడా అది వివరిస్తుంది. ఆ రాజ్యం, తరచూ సంఘర్షణలకు దారితీసే అసూయనూ, దురాశనూ తీసివేస్తూ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ, సిరిసంపదలనూ, సంతోషాన్నీ ఇచ్చేలా భూవనరులను ఉపయోగిస్తుంది అని కూడా బైబిలు చెబుతుంది.

అలాంటి ప్రవచనాలను నమ్మాలా? “నా నోటనుండి వచ్చువచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” అని యెహోవాయే స్వయంగా అంటున్నాడు. (యెషయా 55:10, 11) ఈ మాటలు, దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని హామీ ఇవ్వడం కన్నా ఎక్కువే చేస్తున్నాయి. ఈ మాటలు ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నాయి: యెహోవా సర్వశక్తిమంతుడు కనుక, భూగోళవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే శక్తి ఆయనకు ఉంది; ఆయన అవగాహనకు అందనివి ఏమీ లేవు; కనుక, శాంతిని నిలబెట్టేందుకు కావలసిన వివేకం ఆయనకు ఉంది. (యెషయా 40:13, 14) అంతేకాక, యెహోవాయే ప్రేమ యొక్క మూర్తీభావమై ఉన్నాడు కనుక, ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకురావాలన్న కోరిక ఆయనకన్నా ఎక్కువగా మరెవరికీ లేదు.—1 యోహాను 4:8.

నిజమే, దేవుని వాగ్దానాలను నమ్మేందుకు విశ్వాసం అవసరం. విశ్వాసం జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, దేవుని వాక్యమైన బైబిలును అధ్యయనం చేయడం ద్వారా దాన్ని పెంపొందించుకోవచ్చు. (ఫిలిప్పీయులు 1:9, 10) మనం దేవుని వ్యక్తిత్వాన్నీ, ఆయన ఉద్దేశాలనూ తెలుసుకుంటున్నప్పుడు, దేవుని రాజ్యం వాస్తవమైనదన్న విషయం స్పష్టమౌతుంది. అవును, యుద్ధం నిర్మూలం చేయబడుతుంది. అయితే అది మానవ ప్రయత్నాల వల్ల కాదు కానీ, దైవిక మద్దతుతో కూడిన మహిమాన్వితమైన ప్రపంచవ్యాప్త ప్రభుత్వం ద్వారా, అంటే దేవుని రాజ్యం ద్వారా అవుతుంది.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

దేవుని రాజ్యం క్రింద, ప్రజలు సమాధానంగా ఉండడాన్ని నేర్చుకుంటారు, ఆయుధాలు నిర్మూలం చేయబడతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి