కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 7/8 పేజీలు 9-10
  • వైకల్యాలన్నీ కనుమరుగైనప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వైకల్యాలన్నీ కనుమరుగైనప్పుడు
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • అశక్తతలు ఎలా అంతం అవుతాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • వికలాంగున్ని—అయినా వాహనం నడిపేందుకు సమర్థున్ని
    తేజరిల్లు!—1996
  • కాలుగాని చెయ్యిగాని లేకున్నా శ్రేష్ఠమైన జీవితం
    తేజరిల్లు!—1999
  • ఒక మేలైన జీవితం వాగ్దానం చేయబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 7/8 పేజీలు 9-10

వైకల్యాలన్నీ కనుమరుగైనప్పుడు

అనేకమంది ప్రజలు “ఆరోగ్యవంతమైన శరీరాలను తాత్కాలికంగా” మాత్రమే కలిగి ఉంటారని పక్షవాతం కారణంగా తన రెండు కాళ్ళను, రెండు చేతులను పోగొట్టుకున్న ఒక స్త్రీ చెప్పింది. త్వరలో గానీ లేదా తర్వాత గానీ శారీరక వైకల్యాలు మనల్నందరినీ చుట్టుముడతాయన్నది ఎంత వాస్తవం! అందుకే, కళ్ళద్దాలు, కాంటాక్ట్‌ లెన్సులు, కట్టుడు పళ్ళు, చెవిటి మిషన్‌లు, ఎలక్ట్రానిక్‌ పేస్‌మేకర్‌లు, కృత్రిమ అవయవాలు వంటివాటికి మార్కెట్‌లో గిరాకీ బాగా పెరుగుతూ వస్తోంది. రోమీయులు 8:22 చెబుతున్నట్లుగా, “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్న[ది].”

కాబట్టి, దేవుడు విధేయత గల మానవులకు ఒక నీతియుక్త “క్రొత్త భూమి”పై పరిపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాడన్న ఆయన వాగ్దానం ద్వారా మనమందరం ఓదార్పును పొందవచ్చు. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) యెషయా 35:5, 6 ఇలా చెబుతుంది: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.”

ప్రస్తుత దుష్ట విధానపు నాశనం నుండి “యొక గొప్పసమూహము” తప్పించుకుంటుందని బైబిలు ముందుగానే తెలియజేసింది. (ప్రకటన 7:9, 14; కీర్తన 37:10, 11, 29) దుష్ట విధానపు నాశనం జరిగిన వెంటనే గంభీరమైన వైకల్యాలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తమ రుగ్మతలు తక్షణమే బాగవ్వడాన్ని చూస్తారు! (యెషయా 33:24) యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు చేసిన స్వస్థతలు దేవుని నూతన లోకంలో జరగబోయే స్వస్థతలకు ముంగుర్తుగా ఉన్నాయి. (మార్కు 5:25-29; 7:33-35తో పోల్చండి.) వికలాంగులు తమ కృత్రిమ అవయవాలను, ఊత కర్రలను, చక్రాల కుర్చీలను విడిచిపెట్టేటప్పుడు వారికి కలిగే అనుభూతిని, ఆనంద బాష్పాలను ఎవ్వరూ వర్ణించలేరు! ఆరోగ్యవంతమైన శరీరంతో, తర్వాత వాళ్ళు ఈ భూమిని పరదైసు గృహంగా మార్చమని దేవుడు ఇచ్చిన పనిని చేయడానికి సహకరించటంలో తమ వంతు చేయగలుగుతారు.—లూకా 23:43.

అదేసమయంలో, ఈనాడు వికలాంగులు ఇంకా తమ పరిమితులతో పోరాడవలసి ఉంది. కెనడాకు చెందిన వికలాంగుడైన నెల్సన్‌ ఇలా అంటున్నాడు: “నా గురించి నేను విచారపడేటప్పుడు మత్తయి 24:13లోని ‘అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును’ అన్న యేసు మాటలను గురించి ఆలోచిస్తాను.” పరిమితులు ఉన్నప్పటికీ, వికలాంగులు క్రైస్తవ విశ్వాసంలో సహించడం ద్వారా అత్యంత ప్రాముఖ్యమైన విధంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగల్గుతారు.—యాకోబు 1:3, 4.

లక్షలాదిమంది ఈ విశ్వాసాన్ని హత్తుకోవడానికి యెహోవాసాక్షులు సహాయం చేశారు. ముందటి శీర్షికలో ఉదాహరించబడిన వికలాంగుడైన డెల్‌ అనే వ్యక్తి ఇలా అన్నారు: “నాకున్న శారీరక సమస్యల వంటివి వాస్తవానికి కేవలం తాత్కాలికమైనవని నేను నేర్చుకొన్నప్పుడు నాకు కలిగిన అనుభూతిని నేను వ్యక్తీకరించలేను.” అవును, అటువంటి నిరీక్షణచే బలపర్చబడిన డెల్‌ను, ఆయన వంటి దృక్పథం గల అనేకమంది ఇతరులను వికలాంగులని పిలువలేము.

[10వ పేజీలోని చిత్రం]

రాబోయే నాశనాన్ని తప్పించుకునేవారు తమ వైకల్యాలకు అద్భుతకరమైన స్వస్థతను పొందుతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి