కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 7/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 7/8 పేజీ 30

మా పాఠకుల నుండి

అంగారకునిపై ఒక రోబోట్‌ అన్వేషణ మానవుల్ని జంతువులనుండి వేరుచేసే పెద్ద అంతరాన్ని వివరించిన శీర్షికల పరంపరను చదవడం ముగించిన తర్వాత, నేను అదే సంచికలో ఉన్న “అంగారకునిపై ఒక రోబోట్‌ అన్వేషణ” అనే పేరుగల శీర్షికవైపుకు తిరగేసాను. (జూలై 8, 1998) మానవులకు జంతువులకు మధ్యనున్న మేధాపరమైన అంతరాన్ని ఆ శీర్షిక సులభగ్రాహ్యమైనవిధంగా, నిర్వివాదంగా ధృవీకరించింది!

జి. డి. ఎమ్‌., అమెరికా

డబ్బును సంపాదించడం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను కాస్తంత డబ్బును ఎలా సంపాదించగలను?” అనే ప్రభావవంతమైన శీర్షికను ప్రచురించడానికి సమయం తీసుకొన్నందుకు కృతజ్ఞతలు. (సెప్టెంబరు 8, 1998) ఉద్యోగం సంపాదించుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. కాని నేను మీ సలహాలను పాటించాను, చివరికి నాకొక ఉద్యోగం దొరికింది !

ఎస్‌. డి., ఘానా

పీడకలలు “ప్రపంచ పరిశీలన”లో, “పిల్లలకు పీడకలలు రావడం సాధారణమే” అన్న అంశంపై ఇవ్వబడిన సూచనలను నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. (అక్టోబరు 8, 1998) నా పిల్లలకు పీడకలలు వస్తాయి, కాని వాటి గురించి మాట్లాడవద్దనీ, వెళ్ళి నిద్రపోండని నేను వారికి ఎప్పుడూ చెప్పేదాన్ని. ఇవ్వబడిన సూచనలను పాటించడం ద్వారా, నేను ఇప్పుడు ఈ సమస్యను మెరుగైన విధంగా ఎదుర్కోగలను. దయచేసి, ఇలాంటి సహాయకరమైన సమాచారాన్ని ప్రచురించడం మానివేయకండి.

ఆర్‌. ఎన్‌., జింబాబ్వే

మనస్సును నిలపడం టీచరు మాట్లాడుతున్నప్పుడు మనస్సును నిలపడం నాకు కష్టంగా ఉండేది. కాని క్లాస్‌రూమ్‌లో నా అలవాట్లను మార్చుకోవడానికి “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా మనస్సును ఎలా నిలుపగలను?” అనే మీ శీర్షిక సహాయపడింది. (అక్టోబరు 8, 1998) మీ శీర్షికను చదివినప్పటి నుండి, ఈ సమస్యను నేను అధిగమించాను, ఇప్పుడు నేను చాలా క్రమశిక్షణతో ఉన్నాను.

ఎమ్‌. ఏ. ఎమ్‌., బ్రెజిల్‌

మనస్సును నిలపడంలో నాకు సమస్యలున్నాయి. మనస్సును నిలపడానికి అవసరమైందల్లా, కొంత ప్రేరణా, స్వయం-క్రమశిక్షణా మాత్రమేనని నేను గ్రహించలేదు. దీనికి శ్రద్ధాపూర్వకమైన ప్రయత్నం అవసరం, కాని నేనాపని చేయగలననే అనుకుంటున్నాను!

డి. ఆర్‌. ఏ., అమెరికా

నాలాంటి యౌవనస్థులకు ఎంతో ఆసక్తిని రేకెత్తించే చాలా సమాచారం తేజరిల్లు!లో ఉంటుంది. మనస్సును నిలపడంలో నాకు సమస్య ఉంది గనుక ఈ శీర్షిక ద్వారా నేను ప్రయోజనం పొందాను. దీనికై నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఎమ్‌. ఎన్‌., ఇటలీ

ఎయిడ్స్‌ “ఎయిడ్స్‌పై యుద్ధం—గెలుపు లభిస్తుందా?” (డిసెంబరు 8, 1999) అనే శీర్షికల పరంపర నిమిత్తం మీకు హృదయపూర్వకంగా థాంక్స్‌ చెప్పాలనుకున్నాను. అది విషయ పరిజ్ఞానాన్నిస్తోంది. నాకు 19 ఏళ్లు. ఎయిడ్స్‌ గురించీ హెచ్‌ఐవీ గురించీ స్కూల్లోనూ ఇంట్లోనూ నాకెన్నో విషయాల్ని బోధించారు, అయినప్పటికీ నాకు అంతా అయోమయంగా ఉండేది. ఈ శీర్షిక, నేను వివాహ జతను జ్ఞానపూర్వకంగా ఎంపిక చేసుకోవడమూ, నైతికంగా పరిశుభ్రమైన జీవితాన్ని గడపడమూ ఎంత కీలకమో గ్రహించడానికి సహాయం చేసింది.

ఎస్‌. టి., అమెరికా

మీ శీర్షికలు విషయ పరిజ్ఞానాన్ని కలుగజేస్తున్నాయి, కచ్చితంగాను సత్యసంధతతోను ఉన్నాయి. నేను పది సంవత్సరాలకు పైగా ఎయిడ్స్‌తో జీవిస్తున్నాను. మీ ప్రచురణల సహాయంతో ఒక స్నేహితురాలు నాకు బైబిలును బోధిస్తుంది. ఇటువంటి శీర్షికలను ప్రచురించడానికి వెనుకాడనందుకు మీకు కృతజ్ఞతలు.

బి. డబ్ల్యు., అమెరికా

నేను ఎయిడ్స్‌ను గురించి చర్చించిన శీర్షికలను చదవడం పూర్తిచేసేంతవరకు తేజరిల్లు!ను క్రిందపెట్టలేకపోయాను. ఈ విషయంపైన ఇంత కచ్చితమైన సమాచారాన్ని నేను ఎన్నడూ చదవలేదు. ఈ విషయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక నర్సుని. చాలా కృతజ్ఞతలు.

డి. ఇ., జర్మనీ

నా ఈ మెప్పుదలకు కారణం, నా కుమారుడు క్రైస్తవ మార్గాన్ని విడిచిపెట్టి ఎయిడ్స్‌ బాగా ముదిరాక తిరిగిరావడమే. యెహోవా సహాయంతో ఆయన ఇప్పుడు ఆధ్యాత్మికంగా బాగా ఉన్నాడు. వైద్య చికిత్స సహాయంతో ఆయన ఆరోగ్యం ఇప్పుడు కాస్త కుదుటపడింది. ఈ వైరస్‌ సోకినా ఆ విషయం తెలియని వారు చాలామంది ఉన్నారని మాకు తెలుసు. వివాహం గురించి తలస్తున్నవారు బాగా ఆలోచించవలసిన విషయం.

ఎన్‌. జె., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి