కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 4/8 పేజీ 3
  • ఆకాశయాన స్వప్నం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆకాశయాన స్వప్నం
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • విమానం ఎలా ఉనికిలోకి వచ్చింది?
    తేజరిల్లు!—1999
  • విమానాలు ఎంత సురక్షితమైనవి?
    తేజరిల్లు!—1999
  • ఆకాశయానంలో అగ్రగాములు
    తేజరిల్లు!—1999
  • సాఫల్యానికి కీలకమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 4/8 పేజీ 3

ఆకాశయాన స్వప్నం

“లోహవిహంగాలన్నీ కూడా, ‘పైకెగసేది క్రిందపడక తప్పదు’ అన్న మన చిన్ననాటి లోకోక్తిని నిజం చేశాయి.”

అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలోగల కిట్టిహాక్‌ గ్రామంలో రైట్‌ సోదరులు ప్రసిద్ధిగాంచిన తమ ఆకాశయానాన్ని చేసి ఐదేళ్లు కూడా గడవకముందే, అంటే 1908, మే 25 నాటి ది న్యూయార్క్‌ టైమ్స్‌ సంచికలో కొంత సంశయాత్మకమైన సంపాదకీయం పైమాటలతో ప్రారంభమైంది. తలలపైగా ఆకాశంలో కనిపించనారంభించిన సరిక్రొత్త “లోహవిహంగాల” సాఫల్యాన్ని ఇంకా శంకిస్తూనేవున్న రచయిత, “భూమికిపైగా ఎంతో ఎత్తులో ఎగరాలన్న కోరిక సాపేక్షికంగా చూస్తే మనలో చాలా తక్కువమందికే ఉంది” అని తలంచాడు. భావి తరాలు ఆకాశయానం పట్ల మక్కువ చూపించవచ్చునని ఒక పక్క ఒప్పుకుంటూనే, ఆ శీర్షిక “ప్రయాణీకులను సుదూరప్రాంతాలకు తీసుకెళ్లే వాయునౌకలను . . . గురించిన కలలు, కలలుగానే మిగిలిపోవచ్చు” అని నొక్కిచెప్పింది.

ఆ ఊహ ఎంత తప్పని తేలిందోకదా! నేడు, ప్రతి సంవత్సరం వంద కోట్లకంటే ఎక్కువమంది, “ప్రయాణీకులను సుదూరప్రాంతాలకు తీసుకువెళ్లే వాయునౌకల్లో” ప్రయాణిస్తున్నారు. అవును, ఒక్క శతాబ్దంలోనే విమానాలు తమ రూపాన్ని ఎంతగానో మార్చుకున్నాయి. ఇరవయ్యో శతాబ్దారంభంలో చెక్కలతోనూ, నేతవస్త్రంతోనూ చేయబడిన దుర్బలమైన సాధనాలుగా ఉన్న విమానాలు, నేడు సున్నితమైన కంప్యూటర్‌-ఆయత్త జెట్‌ ప్రొపెల్లర్లతో నడిచే విమానాలుగా రూపాంతరం చెందాయి. అవి భూమికిపైగా పది కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ, వాతావరణ-నియంత్రిత సౌకర్యంతో, సుదూర తీరాలకు వందలాదిమంది ప్రయాణీకులను చేరవేస్తున్నాయి.

ఈ 20వ శతాబ్దంలో విమానయాన సాంకేతిక పరిజ్ఞానంలో జరిగిన శీఘ్ర పురోభివృద్ధి, నిజంగా ఎంతో విశేషమైనది, అది మన ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. నిజానికి, ఆకాశాన్ని జయించాలన్న మానవాన్వేషణను గురించిన గాథ, గత కొన్ని దశాబ్దాలకన్నా, చెప్పాలంటే గత కొన్ని శతాబ్దాలకన్నా ఎంతో కాలం క్రిందటే ప్రారంభమైంది. ఆకాశయానం చేయాలన్న తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవడం కోసం మానవుడు ప్రాచీన కాలాల నుండే కలలు కంటున్నాడు.

[2, 3వ పేజీలోని చిత్రం]

లాక్‌హీడ్‌ ఎస్‌. ఆర్‌.-71 బ్లాక్‌బర్డ్‌, ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే జెట్‌, దీని వేగం గంటకు దాదాపు 2,200 మైళ్లు

[3వ పేజీలోని చిత్రం]

బోయింగ్‌ స్ట్రాటోలైనర్‌ 307, దాదాపు 1940, 33 మంది ప్రయాణీకులు, ఎగిరే వేగం గంటకు 215 మైళ్లు

[క్రెడిట్‌ లైను]

Boeing Company Archives

[3వ పేజీలోని చిత్రం]

రైట్‌ సోదరుల “ఫ్లయర్‌,” 1903

[క్రెడిట్‌ లైను]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి