మీరు విచారించవలసిన అవసరం రాని ఒక నిర్ణయం
రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జన్మించిన లక్షలాది మంది స్త్రీపురుషులు ఇప్పుడు మధ్య వయస్కులయ్యారు. తాము పూర్తిచేయగలిగిన కార్యాల విషయమై అనేకులు సంతృప్తిని పొందుతుండగా, కొందరు నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. వాళ్లు వివాహం చేసుకున్నారు, ఉద్యోగాలు చేశారు, పిల్లలకు జన్మనిచ్చారు, కుటుంబాలను పోషించారు, కొందరు తమ తల్లిదండ్రులు చనిపోతుండగా చూశారు. ఈ రోజు, వాళ్ళ తలవెంట్రుకలు నెరిసిపోతున్నాయి. బాగా లావెక్కిపోతున్నారు, వాళ్ళ మోకాళ్ళు బలహీనమయ్యాయి, తాము జీవితంలో తమ లక్ష్యాలను చేరుకోలేదని భావిస్తున్నారు. నిరాశగా ఉన్నారు గనుక, ‘జీవిత పరమార్థం ఏమిటి?’ అని అడుగుతున్నారు. బహుశా మీరు కూడా ఆ ప్రశ్నను అడిగి ఉండవచ్చు.
అప్పుడప్పుడు మీరు మీ జీవితాన్ని గురించి పునరాలోచించుకోవడంవల్ల చాలా ప్రయోజనముంటుందన్నదానికి సందేహం లేదు. అయితే, మీరు విచారానికి గురవ్వవలసి వచ్చిన గతంలో తీసుకున్న నిర్ణయాలను గురించి అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే మీకు నిరాశానిస్పృహలు కలుగుతాయి. ‘నేను అలా చేసి ఉంటే . . . ,’ అని మీకు మీరు అనుకునే బదులు, ఇప్పటికీ మీరు భవిష్యత్తులో తీసుకోగల జ్ఞానపూర్వకమైన నిర్ణయాల విషయమై మనస్సు కేంద్రీకరించడం ఎంత బాగుంటుంది. జీవిత పరమార్థాన్ని గురించిన ప్రశ్నలకు జవాబులిచ్చే సమాచారాన్ని పరిశీలించుకోవాలనుకోవడం అలాంటి నిర్ణయాల్లో ఒకటి. కనుక, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే ప్రచురణను చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని అంగీకరించాలన్న మీ నిర్ణయం మీరు విచారపడవలసిన అవసరం రాని నిర్ణయమై ఉంటుంది.
దీనితోపాటు ఉన్న కూపన్ను నింపి, ఇవ్వబడిన చిరునామాకు లేదా, ఈ పత్రిక 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు అనుకూలమైనదానికి పంపి, ఈ 32 పేజీల బ్రోషూర్ను పొందండి.
□ దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్ను నాకు పంపించండి.
□ మా ఇంటికి వచ్చి బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు ఈ చిరునామాను ఉపయోగించండి.