కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 12/8 పేజీలు 8-9
  • ఎయిడ్స్‌—ఏమిటి భవిష్యత్తు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎయిడ్స్‌—ఏమిటి భవిష్యత్తు?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక పరిష్కారం ఉంటుంది
  • ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి
    తేజరిల్లు!—1998
  • ఎయిడ్స్‌ ఆఫ్రికాలో వ్యాపిస్తోంది
    తేజరిల్లు!—2003
  • ఎయిడ్స్‌—విజృంభిస్తోన్న మహమ్మారి
    తేజరిల్లు!—1998
  • ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 12/8 పేజీలు 8-9

ఎయిడ్స్‌​—ఏమిటి భవిష్యత్తు?

ఈ హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌కి చికిత్స చేయడానికి లేదా దాన్ని రాకుండానే నివారించడానికి మందులు లేకపోవడమే కాక, ఈ వ్యాధిని అణచడానికి విరుద్ధంగా పనిచేసే ఇతర కారకాలు కూడా పనిచేస్తున్నాయి. వీటిలో ఒకటి ఏమిటంటే, చాలామంది ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవడానికి ఇష్టపడక ఇన్ఫెక్షన్‌ని అంటించుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో ఎయిడ్స్‌ బాగా ముదిరిపోయిన స్థాయికి చేరుకుంటున్న ప్రజల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ ఇన్ఫెక్షన్‌ రేటులో మాత్రం మార్పేమీ లేకుండానే అలాగే ఉంది. అసోసియేటెట్‌ ప్రెస్‌ సూచిస్తున్న కారణం, “చాలా మంది ప్రజలు నివారణను గురించిన హెచ్చరికలను పట్టించుకోవడం లేదు.”

రిపోర్టుల ప్రకారం హెచ్‌ఐవి సోకిన వారిలో దాదాపు 93 శాతం మంది ప్రజలు నివసించే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఈ దేశాల్లో అనేకం కనీసం ప్రాథమిక ఆరోగ్య సేవలను కూడా అందించలేనంత బీదవి. ఒకవేళ ఈ దేశాల్లో క్రొత్త మందులు లభించినప్పటికీ​—చెప్పాలంటే చాలా మట్టుకు అందడంలేదు​—ఒక్క సంవత్సరంలో చికిత్సకయ్యే ఖర్చు, చాలా మంది ప్రజలు తమ జీవితకాలంలో సంపాదించే దానికన్నా ఎక్కువగా ఉంటుంది!

అయినా, ఈ వ్యాధిని నిజానికి నయంచేసే ఒక చవకైన మందు కనిపెట్టబడిందని మనం అనుకుందాము. అటువంటి మందు అది అవసరమయ్యే వారందరినీ చేరుతుందా? బహుశ చేరకపోవచ్చు. ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి ప్రకారం ప్రతి సంవత్సరం, చవకైన ఇప్పుడు లభిస్తూనే ఉన్న వాక్సిన్‌లను వాడి నివారించగల్గే ఐదు రకాల వ్యాధుల మూలంగా దాదాపు 40 లక్షలమంది పిల్లలు చనిపోతున్నారు.

చికిత్స కోసం మందుల్ని పొందలేని దేశాల్లో నివసిస్తున్న హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తుల సంగతేమిటి? కాలిఫోర్నియాలో శాంతాక్రూజ్‌లోని అంతర్జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనే సంస్థకు చెందిన రూత్‌ మోట అనే స్త్రీ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెచ్‌ఐవి నివారణ మరియు శ్రద్ధ కార్యక్రమాలను సంస్థీకరించడంలో సహాయపడింది. ఆమె ఇలా అంటుంది: “నా అనుభవం నుండి తెలిసిన విషయం ఏమిటంటే, మందుల్ని పొందగల్గడం ఎంత ప్రాముఖ్యమో ఒక అనుకూల దృక్పథం కల్గివుండడం కూడా అంతే ప్రాముఖ్యం. హెచ్‌ఐవితో 10 నుండి 15 సంవత్సరాల పాటు జీవిస్తూనే ఎటువంటి మందులూ తీసుకోని ప్రజలు నాకు తెలుసు. మందులు ప్రయోజనకరమైనవే, కానీ స్వస్థత అంటే అర్థం, కేవలం మీ శరీరాన్ని రసాయనాలతో నింపడం మాత్రమే కాదు. స్వస్థతలో మనోవైఖరి, సామాజిక మద్దతు, ఆధ్యాత్మికత, పోషకాహారం అన్నీ వస్తాయి.”

ఒక పరిష్కారం ఉంటుంది

ఒకరోజు ఎయిడ్స్‌ వ్యాధి లేకుండా నాశకమౌతుంది అని నమ్మడానికి ఏమైనా కారణముందా? అవును, ఉంది. చాలామంది పరలోక ప్రార్థన అనీ లేదా ప్రభువు ప్రార్థన అని పిలిచే దానిలో అతి శ్రేష్టమైన ఆశ దానివుంది. బైబిలులోని ఒక పుస్తకమైన మత్తయిలో ఉన్న ఆ ప్రార్థనలో దేవుని చిత్తం పరలోకంలో ఉన్నట్లుగానే భూమి మీద కూడా జరగాలని మనం మొరపెడతాము. (మత్తయి 6:​9, 10) మానవులు అస్వస్థతతో నిరంతరమూ పీడితులుగానే ఉండాలన్నది దేవుని చిత్తము కాదు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. జవాబిస్తూ ఆయన కేవలం ఎయిడ్స్‌కు మాత్రమే కాదు; మానవజాతిని పట్టి పీడిస్తున్న ఇతర అన్ని వ్యాధులకు కూడా అంతం తెస్తాడు. అప్పుడు, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.”​—యెషయా 33:24.

ఈలోగా, అన్నింటికన్నా అతి శ్రేష్టమైన విధానం నివారణే. అనేక వ్యాధులకు రెండు ఎంపికలు ఉన్నాయి: అయితే నివారించడం లేకపోతే బహుశ చికిత్స చేయడం. హెచ్‌ఐవి విషయంలో అటువంటి ఎంపిక లేదు. దాన్ని నివారించవచ్చు, కానీ ప్రస్తుతం దానికి చికిత్స చేయలేము. మీ ప్రాణాల్ని ముప్పులో పడవేసే ప్రమాదాల్ని ఎందుకు కొనితెచ్చుకోవడం? ఎటువంటి చికిత్సా లేకపోవడం కన్నా నివారణ మిన్న కదా!

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“స్వస్థత అంటే అర్థం, కేవలం మీ శరీరాన్ని రసాయనాలతో నింపడం మాత్రమే కాదు. స్వస్థతలో మనోవైఖరి, సామాజిక మద్దతు, ఆధ్యాత్మికత, పోషకాహారం అన్నీ వస్తాయి.”​—రూత్‌ మోట

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

“సంఘం ఎంతో సేదదీర్పునిచ్చింది”

అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను ఇలా ఉద్బోధించాడు: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) మొదటి శీర్షికలో ప్రస్తావించబడిన కరేన్‌ తల్లి, స్థానిక యెహోవాసాక్షుల సంఘంలో కరేన్‌, బిల్‌లు హెచ్‌ఐవి మూలంగా అస్వస్థతతో ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంఘ సభ్యులు ఎలా ప్రతిస్పందించారో వివరిస్తుంది. ఆమె ఇలా అంది: “సంఘం ఎంతో సేదదీర్పునిచ్చింది. బిల్‌కి న్యుమోనియా వచ్చినప్పుడు కరేన్‌ కూడా అస్వస్థతగా ఉండి, ఆయననూ పిల్లల్నీ చూసుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. అప్పుడు సహోదరులు వారి ఇంటిని శుభ్రంచేశారు. కారుకి మరమ్మతు చేశారు, బట్టల్ని ఉతికిపెట్టారు. వారి చట్టబద్ధమైన కార్యకలాపాల్ని చూసుకున్నారు, వేరే ఇంటికి మారినప్పుడు సహాయం చేశారు. భావోద్రేకమైన, ఆధ్యాత్మికమైన, వస్తుదాయకమైన మద్దతును హృదయపూర్వకంగా అందజేశారు.”

[8వ పేజీలోని చిత్రం]

వైవాహికబంధంలో విశ్వాసంగా ఉండడం హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ రాకుండా నివారించగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి