“శాంతి సమైక్యతలతో జీవించే లోకం”
అలాంటి లోకం ఎన్నటికైనా వస్తుందని మీరు నమ్మగలరా? “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా? అనే మీ కరపత్రం నేను మునుపు చదివిన అత్యంత శక్తివంతమైన నిరీక్షణా సందేశాల్లో ఇది ఒకటి. నేను దానిని మళ్ళీ మళ్ళీ చదివాను. దానిని—శాంతి సమైక్యతలతో జీవించే లోకాన్ని గురించిన ఆ ప్రేమపూర్వక తలంపును గురించి చదివిన ప్రతిసారీ నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది” అని అమెరికాలోని ఫ్లోరిడా నుండి ఒక మహిళ వ్రాసింది.
శాంతి సమైక్యతలతో జీవించగల ప్రజల, అలా జీవించే ప్రజల లోకం వస్తుందనేదానికి రుజువు కావాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే, దయచేసి, Watch Tower, H-58 Old Khandala Road, Lonavla, 410 401, Mah., India అనే చిరునామాకు లేదా 5వ పేజీలోని సరైన చిరునామాకు వ్రాయండి. 6 రూపాయలకు దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే 32 పేజీల బ్రోషూర్ ప్రతి మీకు పంపించబడుతుంది. “దేవుని వలన కలిగే అద్భుతమగు నూతన లోకము” అనే 10వ భాగం మీ హృదయాన్ని ఆహ్లాదపరుస్తుందని మేము నమ్ముతున్నాం.