కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 11/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 11/8 పేజీ 30

మా పాఠకుల నుండి

పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు “పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు” (ఫిబ్రవరి 8, 1998) అనే శీర్షిక పరంపర నన్ను చాలా సాంత్వనపరచింది. మా నలుగురు పిల్లల్లో ముగ్గురు మూడు సంవత్సరాల క్రితం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసిన సమయం వస్తుందన్న స్పృహతోనే వాళ్ళను పెంచాను, అయినప్పటికీ, ముగ్గురూ ఒకేసారి ఇల్లు వదిలిపెట్టే సమయం వస్తుందని నేను ఊహించలేదు! తల్లిదండ్రుల అనుభూతుల విషయమై వాచ్‌ టవర్‌ సొసైటీ చూపించే శ్రద్ధను నిజంగా మెచ్చుకుంటున్నాను.

ఎమ్‌. ఎస్‌., జపాన్‌

ప్రస్తుతం నేనూ, నా భార్యా ప్రత్యేక పయినీర్లుగా, లేదా పూర్తికాల సువార్తికులుగా, మా రాష్ట్రానికి వెలుపల సేవ చేస్తున్నాం. మనం దూరాన ఉన్నప్పటికీ మనం మన తల్లిదండ్రులను ఇప్పటికీ ప్రేమిస్తున్నామన్న విషయాన్నీ, మనకు వాళ్ళు ప్రియమైనవాళ్ళేనన్న విషయాన్ని ఎలా తెలియజేయాలనే విషయంపై మీరిచ్చిన సలహా నిజంగా పనిచేస్తుంది.

ఎమ్‌. ఎమ్‌. ఎస్‌., బ్రెజిల్‌

నాకు 11 ఏండ్లు. ఇంటిపనులు వయోజకుడైనప్పుడు యోగ్యుడుగా ఉండేందుకు తగిన తర్ఫీదునిస్తాయని నేననుకోలేదు. అయితే, ఈ శీర్షికలు విషయాలను గురించి భిన్నంగా ఆలోచించేలా నాకు సహాయం చేశాయి. యౌవనస్థులైన మా విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు.

డి. యు., యుగోస్లేవియా

తల్లిదండ్రులు వ్యతిరేకించడం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా తల్లిదండ్రులు నా వివాహానికి వ్యతిరేకిస్తే?” (ఫిబ్రవరి 8, 1998) అనే శీర్షిక ఉన్న సంచిక ఇప్పుడే అందింది. నేను నా కూతురు పెండ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించడం తప్పైందేమో అనుకున్నాను. అయితే ఈ శీర్షిక నేను ఆలోచించిన ప్రతి విషయాన్ని చేర్చింది—ఆమె చిన్న వయస్సు, ఆమె పెండ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వ్యక్తిత్వం, అవిశ్వాసి ఆమెకు తగని జోడనే విషయం, ఎయిడ్స్‌ వచ్చే అవకాశం, సంస్కృతుల్లోని తేడాలు. ఈ శీర్షిక నా కూతురు హృదయాన్ని స్పర్శించాలని ప్రార్థిస్తున్నాను.

ఎన్‌. బి., అమెరికా

ఎంత చక్కని శీర్షిక! మీరు చాలా సున్నితమైన విషయాన్ని గురించి చర్చించారు, మీరు చాలా చక్కగా వివరించారు. ఈ విషయాలను తెలుసుకుని అంగీకరించేలా తమ మనస్సును సిద్ధం చేసుకునేందుకు చదువరికి సహాయపడుతూ అనేక విభిన్న అంశాలను వెలికితీశారు.

ఎస్‌. సి., అమెరికా

నేను ఎనిమిది సంవత్సరాలుగా పూర్తికాల సువార్తపని చేస్తున్నాను. నా తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే. నేను పెండ్లి చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఈ సహాయకరమైన సమాచారాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

టీ. సీ. ఎఫ్‌., టాన్జానియా

క్రైస్తవ వైవిధ్యత “బైబిలు ఉద్దేశము: క్రైస్తవ ఐక్యత వైవిధ్యాన్ని అనుమతిస్తుందా?” (మార్చి 8, 1998) అనే శీర్షికకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను యెహోవా గురించి ఎక్కువగా తెలుసుకుంటున్న కొలదీ, నేను ఆయన సంస్థలో ఉన్నందుకు అంత ఎక్కువ సంతోషిస్తున్నాను. ఈ సంస్థలో మనం వ్యక్తిత్వాల విస్తృత వైవిధ్యాన్ని ఆస్వాదించగలం.

ఐ. పీ., స్లొవేనియా

నాకు 15 ఏండ్లు. నేను తేజరిల్లు!ను క్రమంగా చదువుతాను. ముఖ్యంగా ఈ శీర్షికను చాలా ఎక్కువ మెచ్చుకుంటున్నాను. ఇందులో ఒక భాగం పరదైసు గురించీ, అదెలా ఉంటుందనేదాని గురించీ మాట్లాడింది. పరిపూర్ణ మానవులంటే ఎలా ఉంటారు, మనమందరం రూపురేఖల్లో ఒకే విధంగా ఉండి, ఒకే విధమైన తలంపులతో ఉంటే ఎలా ఉంటుందనీ ఆలోచించేవాడ్ని. మానవుల మధ్యా, జంతువుల మధ్య కూడా ఎంతో గొప్ప వైవిధ్యం ఉంటుందనే విషయాన్ని నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను.

జె. సి., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి