కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 11/8 పేజీలు 11-12
  • విపత్తుకున్న రెండు ముఖాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విపత్తుకున్న రెండు ముఖాలు
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ప్రజలు ప్రతిస్పందిస్తారు
  • కొన్ని సానుకూల ఫలితాలు
  • ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి
    తేజరిల్లు!—1993
  • మెక్సికో నందు విపత్తుల మధ్య క్రైస్తవ ప్రేమ
    తేజరిల్లు!—1996
  • “నువ్వు బోధించేది వినేవాళ్లు” రక్షించబడతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • విశ్వాసంగల వాళ్లను యెహోవా దీవించడం నేను చూశాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 11/8 పేజీలు 11-12

విపత్తుకున్న రెండు ముఖాలు

మెక్సికోలోని తేజరిల్లు! విలేఖరి

గోడోఫ్రేడే మరియు గీసలా అనే వివాహిత దంపతులు యెహోవాసాక్షులు. వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఆస్‌ఫాల్ట్‌ షీట్లతో కట్టినది. మెక్సికోలోని వహాకా తీరప్రాంతంలో పౌలీనా తుపాను వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ ఇంటిలోపలే ఉన్నారు. ఆ తుపాను తాకిడికి ఒక దాని తర్వాత ఒకటి అన్ని షీట్లు ఊడి వచ్చేశాయి. చివరికి చట్రం మాత్రమే మిగలడంతో, ఆ కుటుంబానికి బొత్తిగా ఆశ్రయం లేకుండా పోయింది.

గీసలా ఎనిమిదేండ్ల బిడ్డను ఎత్తుకుని ఉంది. గీసలా, గోడోఫ్రేడే మిగతా ముగ్గురు పిల్లలను గట్టిగా పట్టుకుని ఉన్నారు. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు వీచిన బలమైన ఈదురు గాలులతో వాళ్ళు పోరాటం సల్పారు. ఒక్కోసారి ఆ పెనుతుపాను వాళ్ళను నేలపై దొర్లించేసేది. చివరికి ఎలాగైతేనేమి వాళ్లందరూ ప్రాణాలతో బయటపడగలిగారు.

ఆకపూల్కో నగరంలో, యెహోవాసాక్షుల్లో ఒకరైన నెలీ తమ ఇంట్లోకి నీళ్ళు ప్రవేశించడాన్ని చూసి తన కుటుంబ సభ్యులను మేల్కొలిపింది. ఇంట్లో ప్రవేశించిన నీళ్ళ మట్టం చాలా త్వరగా పెరిగిపోయింది. నీటి ప్రవాహం నెలీని నీళ్ళలోకి లాగేసింది. కాని ఆమె కూతురు ఆమెను బయటికి లాగేసింది. వాళ్ళు తమ ఇంటి కిటికీ ఊచలను పట్టుకుని వ్రేలాడుతూ నీళ్ళ మట్టం తమ పీకల వరకూ చేరుకోవడాన్ని నిస్సహాయంగా చూస్తుండిపోయారు. బయటికి రమ్మని ఒక మనిషి పిలవడాన్ని వాళ్ళు విన్నారు. ఆ స్వరం వాళ్ళ పొరుగునవున్న వ్యక్తిది; వాళ్ళు ఆ ఇంట్లో నుండి బయటపడేందుకు ఆయన వాళ్ళకు సహాయం చేసి వాళ్ళను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి, తాము కొన్ని నిమిషాల క్రితం వరకూ ఉన్న ఇంటిని ఒక కారు కొట్టుకుని వచ్చి ఢీకొనడాన్నీ, ఆ ఇల్లు పూర్తిగా నుగ్గనుగ్గయిపోవడాన్నీ వాళ్ళు భయభ్రాంతులతో చూస్తూ ఉండిపోయారు.

1997, అక్టోబర్‌ 8, బుధవారం మధ్యాహ్నం, వహాకా స్టేట్‌ తీర ప్రాంతాన్ని గంటకు 100 కన్నా ఎక్కువ మైళ్ళ వేగంతో వీచిన తుపాను గాలులు బాగా దెబ్బ తీశాయి. తర్వాత, అక్టోబరు 9, గురువారం నాడు, తెల్లవారుజామున కొన్ని గంటల్లో తుపాను గరరో స్టేట్‌ను ముఖ్యంగా ఆకపూల్కో నగరాన్ని విధ్వంసం చేసింది. అది సమీపంలో ఉన్న సముద్రపు అలలు 30 అడుగులకుపైగా ఉవ్వెత్తున లేచేలా చేసింది. అలా వరద రావడంతో, ఇండ్లూ, కార్లూ, పశువులూ కొట్టుకుపోయాయి. మనుష్యులు కూడా కొట్టుకుపోయారు. తుపాను వెలిసేసరికి, వీధులు 30 అడుగుల కన్నా ఎక్కువ లోతున్న గోతులుగా మారాయి. ద న్యూస్‌ వార్తాపత్రిక ప్రకారం, ఈ రెండు స్టేట్లలో కలిపి కనీసం 400 మంది చనిపోయి ఉంటారనీ, 20,000 నుండి 25,000 మంది నిరాశ్రయులై ఉంటారనీ మెక్సికోలోని రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనావేసింది. అయితే, ఈ విపత్తు మధ్యన కూడా క్రైస్తవ ప్రేమను చూపించే వ్యక్తీకరణలు హృదయాన్ని స్పర్శించేవిగా ఉన్నాయి.

యెహోవా ప్రజలు ప్రతిస్పందిస్తారు

పౌలీనా తుపానును గూర్చిన వార్త తెలియగానే, మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఆఫీస్‌కు దేశంలోని అన్ని ప్రాంతాల నుండీ తాము ఏ సహాయం చేయవచ్చో తెలుసుకోవాలని అనుకున్నవాళ్ళందరూ ఫోన్‌ చేశారు. సముద్రాంతర దేశాల నుండి కూడా సహాయం ప్రతిపాదించబడింది. వెంటనే ఒక ఉపశమన కార్యక్రమ కమిటీ రూపొందించబడింది. భోజనపదార్థాలూ, వస్త్రాలూ, మరితర వస్తువులూ టన్నుల లెక్కన పంపిణీ చేయబడ్డాయి.

నిర్మాణ వస్తువులను కూడా కొన్నారు. పాడైన, లేదా విధ్వంసమైన 360 ఇండ్లనూ, అనేక రాజ్య మందిరాలనూ బాగు చేసే పని మొదలైంది. డొనేట్‌ చెయ్యడంలోనూ, వస్తువులను వాటి వాటి కోవనుబట్టి వేరు చేయడంలోనూ, ప్యాక్‌ చెయ్యడంలోనూ, రవాణా చెయ్యడంలోనూ, బాధితుల సహాయార్థం ఇస్తున్న వస్తువులను అందజేయడంలోనూ లేదా పాడైనవాటిని బాగుచేయడంలోనూ వేలాది క్రైస్తవ సహోదర సహోదరీలు బిజీ అయిపోయారు.

కొంతమంది స్టోర్‌కీపర్‌లు సాక్షుల క్రియాశీలతలను చూసి ముగ్ధులై, భోజనపదార్థాలను, నిర్మాణ సామగ్రినీ, ఇతర వస్తువులనూ డొనేట్‌ చేశారు. ఇతరులు తక్కువ ధరకు వస్తువులను అమ్మారు. బాధితులైన సాక్షులు తమకు చూపబడిన ప్రేమకు, ముఖ్యంగా, తమకు కావలసిన వస్తువులను పంపిస్తూ, వాటితో పాటు జతచేసిన ప్రోత్సహిస్తూ వ్రాసిన లేఖలకు కదిలిపోయారు.

విచారకరంగా, హోసే ఫావుస్టీనో అనే 18 ఏండ్ల సాక్షీ, సాక్షులతో బైబిలు పఠిస్తున్న ముగ్గురు వ్యక్తులూ తుపాను వల్ల చనిపోయారు. వాళ్ళ బంధువులూ, ముఖ్యంగా హోసే తల్లిదండ్రులూ తమ కోసం సంఘంవారు ప్రార్థన చేసినందుకు, తమను ప్రోత్సహించినందుకు చాలా మెప్పుదల కనబరచారు.

కొన్ని సానుకూల ఫలితాలు

పౌలీనా తుపాను వచ్చి వెలిసిపోయిన తర్వాత చాలా మంది ప్రజలు బైబిలు పఠనం కావాలని కోరారు. సాక్షుల అవిశ్వాసులైన బంధువులూ, అనేక మంది పొరుగువారితో సహా అనేకులు నిరీక్షణ విషయమై సాక్షులు చెప్పిన సందేశాన్ని ఆలకించేందుకు చాలా సుముఖత చూపించారు. అలాగే, సహాయ కార్యక్రమంలో భాగంగా అందరికీ భోజనపదార్థాలను పంచిపెట్టే పనిలోనూ సాక్షులు భాగం వహించారు. ఒక సందర్భంలో, తన కంపెనీ డొనేట్‌ చేసిన భోజనపదార్థాలను పంచిపెట్టే పనికి సాక్షులనే ఎందుకు ఎన్నుకున్నారు అని ఒక సాక్షి ఆయనను అడిగినప్పుడు, “ఎందుకంటే, మీరు సంస్థీకరించబడినవారనీ, నిజాయితీగలవారనీ నాకు తెలుసు. అంతేగాక, మీ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీకు తెలుసు గనుక, ఈ సహాయం ఎవరికి ఎక్కువ అవసరమో మీకు తెలుసు” అని జవాబిచ్చాడు.

అంతం సమీపిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో విపత్తులు జరుగుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బైబిలు సూత్రాలు ఆచరణలో పెట్టబడడాన్ని చూడడం ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటోంది.

[11వ పేజీలోని చిత్రం]

పిల్లలు పునర్నిర్మాణంలో సహాయపడుతున్నారు

[12వ పేజీలోని చిత్రం]

పౌలీనా తుపాను తర్వాత వహాకాలో సాక్షులు క్రొత్త రాజ్యమందిరాన్ని నిర్మిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి